Published
Tue, Sep 20 2016 10:29 PM
| Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
రుణాలు సకాలంలో అందజేయాలి
భువనగిరి అర్బన్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల లబ్ధిదారులకు ప్రభుత్వం ఇస్తోన్న రుణాలను బ్యాంకుల అధికారులు సకాలంలో వారికి అందజేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ డి.సూర్యనాయక్ అన్నారు. మంగళవారం భువనగిరి ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ బ్యాంక్‌ల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే ప్రధానంగా రైతులకు పంట రుణాలు అందజేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలుకు బ్యాంక్ అ«ధికారులు చోరవతీసుకోవాలన్నారు. చిన్నచిన్న వ్యాపారులకు ముద్ర రుణాలు అందజేసి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ గోపాలకిషన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ బల్గూరి మధుసూదన్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఫీల్డ్ అధికారి నరేందర్, బీసీ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ గోపాలకృష్ణ యాదవ్, ఎస్‌బీహెచ్ చీఫ్ మేనేజర్ సత్యనారాయణ, డీపీఎం రామకృష్ణ, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ మూర్తి, వివిధ బ్యాంక్‌ల మేనేజర్లు, ఈఓపీఆర్డీలు, సీసీలు, ఏపీఎంలు, ఎస్‌హెచ్‌జీలు పాల్గొన్నారు.