భువనగిరిని సందర్శించిన విజయనగరం కౌన్సిలర్లు | vizianagaram counsilars visited to bhongir | Sakshi
Sakshi News home page

భువనగిరిని సందర్శించిన విజయనగరం కౌన్సిలర్లు

Published Fri, Sep 16 2016 8:08 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

భువనగిరిని సందర్శించిన విజయనగరం కౌన్సిలర్లు

భువనగిరిని సందర్శించిన విజయనగరం కౌన్సిలర్లు

భువనగిరి టౌన్‌: భువనగిరి మున్సిపాలిటీలో వ్యర్థాల నిర్వహణ బాగుందని ఏపీలోని విజయనగరం మున్సిపాలిటీ కౌన్సిలర్లు అన్నారు. విజయనగరం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మురళీమోహన్‌ ఆధ్వర్యంలో 40 మంది సభ్యులు శుక్రవారం భువనగిరి మున్సిపాలిటీలోని కంపోస్ట్‌యార్డ్, చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చెత్త సేకరణకు అమలుచేస్తున్న ప్రణాళిక, రీసైక్లింగ్, వర్మీ కంపోస్టు తయారీ విధానాన్ని భువనగిరి చైర్‌పర్సన్‌ సుర్విలావణ్య, కమిషనర్, జి.వేణుగోపాల్‌రెడ్డి విజయనగరం కౌన్సిలర్లకు వివరించారు. పార్కును తలపించే రీతిలో వర్మీ కంపోస్టు యూనిట్‌ను నిర్వహిస్తున్న భువనగిరి మున్సిపల్‌ యంత్రాంగాన్ని అభినందించారు. ఈ విధానాన్ని విజయనగరం మున్సిపాలిటీలో సైతం అవలంబించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌సీయూఈఎస్‌ అధికారి వెస్లీ, మున్సిపల్‌ కౌన్సిలర్లు ఎండీ లయీఖ్‌అహ్మద్, ఫాతేమహ్మద్, అనిల్, భిక్షపతి, మున్సిపల్‌ డీఈ ఇ. ప్రసాద్‌రావు, టౌన్‌ ప్రాజెక్ట్‌ అధికారి ప్రభాకర్, ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ దోసపాటి శ్రీనివాస్, హెల్త్‌ అసిస్టెంట్‌  సతీశ్, ఏఈ మహాలక్ష్మిలు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement