అధికారులకు నెమలి అప్పగింత
భువనగిరి అర్బన్
జాతీయ పక్షి నెమాళ్లను కొంత మంది వ్యక్తులు వేటాడుతూ వాటికి మత్తు,విషపదార్థలు ఇచ్చి మట్టు బెడుతున్నారు. శనివారం పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలోని కాస్‌మాని కుంట వద్ద కదల లేని నెమలిని చూసిన చిన్నారులు కొలుపుల సహాన, సోహన్‌లు భువనగిరి అటవీశాఖ బిట్ అధికారి సోమ నర్సయ్యకు కార్యాలయంలో అప్పగించారు. దీంతో అధికారులు నెమలికి వైద్యం అందించి ఫారెస్ట్‌లో వదిలి పెట్టారు.