కేసారంలో నీటి కష్టాలు
కేసారంలో నీటి కష్టాలు
Published Sun, Aug 21 2016 6:54 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
కేసారం(భువనగిరి అర్బన్) : వర్షాకాలంలోనూ నీటి కష్టాలు తప్పడం లేదు. మండలంలోని కేసారంలో స్కీంబోర్లలో నీరు అడగంటడం, కృష్ణాజలాల సరఫరా నిలిచిపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. గుక్కెడు నీటికోసం వ్యవసాయ బావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో 215 ఇళ్లు ఉన్నాయి. 850 మంది జనాభా ఉన్నారు. మొత్తం మూడు స్కీం బోర్లు ఉన్నాయి. రెండింటిలో నీరు అడుగంటిపోయాయి. ఒకబోరులో నీరు సన్నగా వస్తున్నాయి. ఆనీటిని కూడా గ్రామంలోని వాటర్‌ప్లాంట్‌కు సరఫరా చేస్తున్నారు. ఈ నీరు తాగేందుకు మాత్రమే వస్తున్నాయి. వాడుకునేందుకు వాటర్‌ట్యాంకర్ సరఫరా చేస్తున్నారు. అవికూడా సరిపోకపోవడం వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది అంతదూరం వెళ్లలేక వాటర్‌ప్లాంట్ వేస్టేసీ నీటిని వినియోగించుకుంటున్నారు. గతంలో కృష్ణాజలాలు కూడా సరఫరా అయ్యేవి. ప్రస్తుతం భగీరథ పనులు కొనసాగుతుండడంతో పైపులైన్లు తరచు లీకేజీ నీటి సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం వీరికి ట్యాంకర్లు, వ్యవసాయ బోర్లే దిక్కయ్యాయి. రైతులు అద్దెబోర్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో సమస్య తీవ్రమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నీటి సమస్యను పరిష్కరించాలి – పల్లపు సమ్మక్క, కేసారం
గ్రామంలో ప్రస్తుతం నీటి సమస్య ఉండడంతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి నీటిని తీసుకువస్తున్నాం. బోరు బావుల నుంచి నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు మంచినీటి కోసం ప్రత్యేక నిధులను కేటాయించాలి. గ్రామంలో బోర్లు వేసి నీటి కొరతను తీర్చాలి.
వేస్టేజ్ వాటర్‌ను ఉపయోగిస్తున్నాం – ఓర్సు లక్ష్మి, కేసారం....
వాటర్ ఫ్లాంట్ ద్వారా బయటకు వచ్చే వేస్టేజ్ వాటర్‌ను ఉపయోగిస్తున్నాం. దూరం వెళ్లలేక ఈ నీటిని ఉపయోగించడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నాం. ఇప్పటికైన అధికారులు స్పందించి నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయాలి.
ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న– వవాల్‌దాస్ సత్యనారాయణ, సర్పంచ్, కేసారం
గ్రామంలో నీటి సమస్య ఉన్నందున్న వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేస్తున్నాం. నీటి సమస్యను పరిష్కరించేందుకు రైతుల నుంచి అద్దె బోర్ల ఇవ్వాలని కోరినా ఎవరు ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యే, ఆర్‌డబ్ల్యూఎస్, ఎంపీడీఓ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. ఎమ్మెల్యే ఫైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో 3 బోర్లు వేసిన నీరు రాలేదు. నీటి సమస్యను పరిష్కారం కోసం కృషి చేస్తున్నా.
Advertisement
Advertisement