కోటగడ్డను సందర్శించిన పురావస్తుశాఖ అధికారులు | Archaeological authorities visit to the kotagadda | Sakshi
Sakshi News home page

కోటగడ్డను సందర్శించిన పురావస్తుశాఖ అధికారులు

Published Tue, Jul 26 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

కోటగడ్డను సందర్శించిన పురావస్తుశాఖ అధికారులు

కోటగడ్డను సందర్శించిన పురావస్తుశాఖ అధికారులు

భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి సీతాన గర్‌  కోటగడ్డ తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలను, ఆలయ స్తంభాలను పురావస్తుశాఖ సహాయ సంచాలకులు పి.నాగరాజు, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకులు ఎస్‌.హరగోపాల్‌  సోమవారం సందర్శించారు. మట్టిగడ్డ తవ్వకాల్లో బయటపడ్డ కాలభైరవుడి(నాగబైరవుని) విగ్రహంతో పాటు రాతి స్తంభాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఈ స్థలంలో తవ్వకాలు జరిపితే మరిన్నిదేవాలయాలు, చారిత్రక సంపద బయటపడే అవకాశం ఉందన్నారు. ఈ స్థలాన్ని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. భువనగిరి ఖిలాకు అనుబంధంగా ఉన్న కోటగడ్డలో భువనేశ్వరీమాతకు సంబంధించిన ఆలయం బయటపడే అవకాశం ఉందని ఎస్‌.హరగోపాల్‌ చెప్పారు. వీరి వెంట మున్సిపల్‌ కమిషనర్‌ కుమారస్వామి, డీఈ ప్రసాదరావు, కోటపరిరక్షణ కమిటీ సభ్యులు సద్ది వెంకట్‌రెడ్డి, బండారుజయశ్రీ ఉన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement