అరాచక శక్తులను అణిచివేస్తాం
భువనగిరి
ఎన్ని అరాచకశక్తులు వచ్చినా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి నూతన జిల్లా ముసాయిదా ప్రకటన సందర్భంగా భువనగిరిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా బాబు జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడారు. ప్రజల శాంతి భద్రతలకు ప్రభుత్వం అధికప్రాధాన్యతను ఇస్తుందన్నారు. భువనగిరి ప్రజలు ఎవరికి భయపడకుండా స్వేచ్ఛగా జీవించవచ్చునన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ప్రజల కష్టాలు తీర్చడానికి తెలంగాణా రాçష్ట్రం సా«ధించారన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లా ఏర్పాటు చేస్తున్నారన్నారు. నెల రోజుల్లో మిషన్ భగీరథ పథకం ప్రారంభిస్తామన్నారు. మల్లన్న సాగర్‌తోపాటు గోదావరి నదిపై పలు ఒప్పందాలు కుదర్చుకుని వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకడానికి కార్యకర్తలు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్య, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ పట్టణ, మండల శాఖల అధ్యక్షులు కొల్పుల అమరేందర్, మారగోని రాముగౌడ్, చందుపట్ల వెంకటేశ్వర్‌రావు, చైర్మన్ ఏడ్ల సత్తిరెడ్డి, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు ఉన్నారు.