mls
-
మాయమవుతున్న రూ.కోట్ల విలువైన పీడీఎస్ బియ్యం
సాక్షి, హైదరాబాద్/మెదక్: ‘మెదక్‌లోని పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్‌కు ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన బియ్యంలో 362 టన్నుల మేర తేడా వచ్చింది. అంటే రూ.3 కోట్ల విలువైన 18 లారీల బియ్యం లెక్క దొరకడం లేదు. వీటితో పాటు 700 బేల్స్ గన్నీ బ్యాగులు లేవు. 320 టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్ఆర్కే) చెడిపోయాయి. మొత్తంగా ఈ మెదక్ ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన అక్రమాల విలువ సుమారు రూ.6 కోట్లు. ఆకస్మిక తనిఖీలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి..’పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం రాష్ట్ర స్థాయి అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో స్వయంగా పోస్ట్ చేసిన వివరాలు ఇవి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎంఎల్ఎస్ పాయింట్లలో వ్యక్తిగతంగా తనిఖీలు నిర్వహించి శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని ఆయన ఆ మెసేజ్‌లో స్పష్టం చేశారు. నిఘా కరువు..రికార్డుల్లేవు రైస్ మిల్లుల నుంచి సీఎంఆర్ కింద బియ్యం ఎఫ్‌సీఐ గోడౌన్లకు చేరతాయి. ఇక్కడి నుంచి ప్రజా పంపిణీ పథకం (పీడీఎస్) కింద ఎంఎల్ఎస్ పాయింట్లకు వెళతాయి. అక్కడి నుంచే జిల్లాల్లోని అన్ని రేషన్ దుకాణాలకు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు సరఫరా అవుతాయి. అయితే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సరైన నిఘా, రికార్డుల వ్యవస్థ ఉండటం లేదు. రాష్ట్రంలో 171 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, చాలాచోట్ల అధికారులు లేరు. ఔట్ సోర్సింగ్ కింద నియామకమైన డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)ల పర్యవేక్షణలో నడుస్తున్నాయి. సెపె్టంబర్ 8న సంస్థ చైర్మన్ మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్‌ను తనిఖీ చేసినప్పుడు రెండేళ్లుగా అక్కడ స్టాక్ పాయింట్ ఇన్చార్జి లేడని, కేవలం డీఈవో ద్వారానే కోట్ల రూపాయల విలువైన బియ్యం పంపిణీ, సరఫరా ప్రక్రియ కొనసాగుతోందని తేలింది. అక్కడున్న 1,520 బ్యాగుల సన్నబియ్యం తినడానికి పనికిరాకుండా పోవడాన్ని కూడా గుర్తించారు. గోదాముల నుంచే మొదలు.. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం వచ్చే సమయంలోనూ భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లతో మిల్లర్లు కుమ్మౖMð్క బియ్యం లోడ్లను పక్కదారి పట్టిస్తున్నట్లు ఇప్పటికే పలు సంఘటనల్లో బయటపడింది. గత ఏప్రిల్ మొదటి వారంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల ఎఫ్‌సీఐ గోదాం నుంచి సుల్తానాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు 5 లారీల్లో బియ్యం పంపించారు. కానీ 420 బస్తాల చొప్పున ఉన్న 3 లారీలు మాత్రమే గోదాంకు చేరాయి. మిగతా 2 లారీలు కాట్నపల్లి వద్ద ఉన్న ఓ రైస్ మిల్లులో అన్లోడ్ అయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లేఖ ద్వారా తెలియజేశారు. సంస్థ ప్రధాన కార్యాలయానికి సంబంధం లేకుండా పెద్దపల్లిలో సీఎంఆర్‌కు అదనంగా 30 వేల టన్నుల బియ్యం తీసుకున్నట్లు తేలిందని కూడా వివరించారు. ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరపాలని కోరారు. ఇక ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యం పంపించే క్రమంలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని స్పష్టమవుతోంది. ఎంఎల్ఎస్ పాయింట్లలో కూడా భారీ మొత్తంలో బియ్యం మాయం అవుతున్నాయి. మెదక్‌తో పాటు రామాయంపేట, తూప్రాన్ ఎంఎల్ఎస్ పాయింట్లలో 10 వేల క్వింటాళ్లకు పైగా పీడీఎస్, సన్న బియ్యం లెక్క తేలకుండా పోయినట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ స్టాక్ పాయింట్ల ఇన్చార్జిలపై కేసులు కూడా నమోదయ్యాయి. పట్టించుకోని అధికారులు తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు విని్పస్తున్నాయి. 171 ఎంఎల్ఎస్ పాయింట్లలో కనీసం 150 చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని, జిల్లా స్థాయిల్లోని అధికార యంత్రాంగం అండతో బియ్యం య థేచ్ఛగా గాయబ్ అవుతున్నాయని సంస్థకు చెందినవారే అంగీకరించడం గమనార్హం. -
అరాచక శక్తులను అణిచివేస్తాం
భువనగిరి ఎన్ని అరాచకశక్తులు వచ్చినా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి నూతన జిల్లా ముసాయిదా ప్రకటన సందర్భంగా భువనగిరిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా బాబు జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడారు. ప్రజల శాంతి భద్రతలకు ప్రభుత్వం అధికప్రాధాన్యతను ఇస్తుందన్నారు. భువనగిరి ప్రజలు ఎవరికి భయపడకుండా స్వేచ్ఛగా జీవించవచ్చునన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ప్రజల కష్టాలు తీర్చడానికి తెలంగాణా రాçష్ట్రం సా«ధించారన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లా ఏర్పాటు చేస్తున్నారన్నారు. నెల రోజుల్లో మిషన్ భగీరథ పథకం ప్రారంభిస్తామన్నారు. మల్లన్న సాగర్‌తోపాటు గోదావరి నదిపై పలు ఒప్పందాలు కుదర్చుకుని వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకడానికి కార్యకర్తలు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ, మండల శాఖల అధ్యక్షులు కొల్పుల అమరేందర్, మారగోని రాముగౌడ్, చందుపట్ల వెంకటేశ్వర్రావు, చైర్మన్ ఏడ్ల సత్తిరెడ్డి, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, తదితరులు ఉన్నారు. -
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
భువనగిరి : విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచిస్థాయికి చేరుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని ఏఆర్ ఫంక్షన్హాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మైనార్టీ డెవలప్మెంట్ కమిటీ ఆ«ధ్వర్యంలో నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు. దాతలు ఇస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, కౌన్సిలర్ ఫాతేమహ్మద్, కమిటీ అధ్యక్షుడు ఎం.ఎ.హఫీజ్వసీమ్, కార్యదర్శి సయ్యద్ జావెద్ఖాద్రీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షడు అమరేందర్,మహ్మద్ మొయినోద్దీన్, సయ్యద్ ఇఫ్తాఖార్ ఫహీమ్, డాక్టర్ ఎస్ఎస్ అలీ, మహ్మద్ సర్వర్, రఫియొద్దీన్, ఎం.ఎం.అన్సారీ తదితరులు పాల్గొన్నారు. -
అమ్ముడుపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఆరోపణ సిగ్గులేని కేంద్ర మంత్రులు ప్యాకేజీలు అడుగుతున్నారు తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ కాదు సాక్షి, ఏలూరు/విజయవాడ: సమైక్య ఉద్యమాలు ఉవ్వెత్తున జరుగుతుంటే సీమాంధ్ర ఎంపీలు ప్యాకేజీలకు అమ్ముడు పోయారని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఆరోపించారు. తాము కోరినప్పుడు రాజీనామాలు చేయకుండా పార్లమెంటులో పోరాడతామని చెప్పి మోసం చేశారన్నారు. సిగ్గులేని సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్యాకేజీలు అడుగుతున్నారని విమర్శించారు. కొందరు ఎమ్మెల్యేలు సైతం అధిష్టానానికి అమ్ముడుపోయారని, పైకిమాత్రం సమైక్య ముసుగు వేసుకున్నారన్నారు. అలాంటి వారిని వదలిపెట్టబోమన్నారు.ఎంపీలను, కేంద్ర మంత్రులను నిలదీయాలని, సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఉన్న ప్రజాప్రతినిధులను సాంఘికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన ఇప్పుడు జరగదన్నారు. 2014 ఎన్నికలు కీలకమన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా ఉయ్యూరులో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సమైక్యాంధ్ర సకల జనుల రైతు గర్జన సభలో అశోక్‌బాబు మాట్లాడారు. విభజన చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పదని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినా అది పాస్ కాదని చెప్పారు. బిల్లు పెడితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పారు. రాష్ట్ర విభజన అంశం అసెంబ్లీకి వస్తే సీమాంధ్రలోని ఎమ్మెల్యేలంతా దాన్ని వ్యతిరేకించాలన్నారు. జీవోఎంకు సంబంధించిన 11అంశాలూ రాజ్యాంగ విరుద్ధమైనవేనన్నారు. తెలంగాణవాదులు రాజకీయ రౌడీయిజం చేస్తున్నారని అశోక్‌బాబు ఆరోపించారు. హైదరాబాద్‌లో పొలిటికల్ రౌడీయిజం నడుస్తోందని, రాజధానిని వదులుకునే సమస్యేలేదని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా పర్వాలేదని, కానీ ఆంధ్రా వాళ్లు తమను దోచేశారని తెలంగాణవాళ్లు ప్రచారం చేస్తున్న సమయంలో విడిపోవడం దారుణమని పేర్కొన్నారు. విడిపోయిన తర్వాత ఆంధ్రాప్రాంతం తమను దోచేసిందని తెలంగాణ ప్రభుత్వం పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చితే చరిత్రలో విలన్లుగా మిగిలిపోతామన్నారు. తెలంగాణను కర్ణుడితో పోల్చుతూ సోనియాను కుంతీదేవిగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ అనే కర్ణుడిని బతికించుకునేందుకు సోనియా పాట్లు పడుతున్నారన్నారు. తెలుగుజాతిని విడగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి (కావూరు సాంబశివరావు) రెండు నెలలు ఉండే పదవి కావాలో, రెండుసార్లు గెలిపించిన ప్రజలు కావాలో తేల్చుకోవాలని, పదవే కావాలంటే ఆయన రాజకీయ జీవితానికి సమాధి కడతామని చెప్పారు. జీఓఎం నివేదిక కేంద్ర కేబినెట్‌కు వెళుతుందని అప్పుడు మన కేంద్ర మంత్రులు ఇద్దరు అక్కడే ఉంటారని, మన చావుకు శాసనం రాస్తుంటే వారు సంతకం ఎలా పెడతారో అడుగుతామని చెప్పారు. ఈ నెల 24వ తేదీన ఉద్యోగ, రైతు, విద్యార్థి సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంధ్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.