విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
Published Thu, Jul 28 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
భువనగిరి : విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచిస్థాయికి చేరుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని ఏఆర్ ఫంక్షన్‌హాల్‌లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మైనార్టీ డెవలప్‌మెంట్ కమిటీ ఆ«ధ్వర్యంలో నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు. దాతలు ఇస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్య, కౌన్సిలర్ ఫాతేమహ్మద్, కమిటీ అధ్యక్షుడు ఎం.ఎ.హఫీజ్‌వసీమ్, కార్యదర్శి సయ్యద్ జావెద్‌ఖాద్రీ, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షడు అమరేందర్,మహ్మద్ మొయినోద్దీన్, సయ్యద్ ఇఫ్తాఖార్ ఫహీమ్, డాక్టర్ ఎస్‌ఎస్ అలీ, మహ్మద్ సర్వర్, రఫియొద్దీన్, ఎం.ఎం.అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement