యాదాద్రి జిల్లా ఏర్పాటు సంతోషకరం
భువనగిరి
భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వం ప్రకటించిన నూతన జిల్లాల ముసాయిదాలో యాదాద్రి పేరును ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భువనగిరి రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి జిల్లా కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. యాదాద్రి జిల్లా ప్రకటించిన ందుకు కే సీఆర్‌కు భువనగిరి నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతునట్లు తెలిపారు. భువనగిరి హెడ్‌క్వాటర్‌తో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరిపాలన సులభం అవుతుందన్నారు. అలాగే ఇటీవల రియో ఒలింపిక్స్‌లో తెలంగాణ బిడ్డ సింధు పతకం గెలుచుకోవడం శుభసూచకమని చెప్పారు. భువనగిరిలో ఉన్న ఇండోర్ స్టేడియంలో రూ. 10 లక్షలతో షటిల్ కోర్టును ఏర్పాటు చేసినట్లు, త్వరలో ఉడెన్ కోర్టును కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఏర్పాటును పురస్కరించుకొని భువనగిరిలో మంగళవారం టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. పార్టీలకతీతంగా సంబరాలు చేసుకోవాలన్నారు. ఉదయం 11 గంటలకు సాయిబాబా ఆలయం నుంచి బాబుజగ్జీవన్‌రాం చౌరస్తా వరకు పెద్దఎత్తున విజయోత్సవ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, టీజీఏ రాష్ట్ర నాయకులు రావి సురేందర్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు కొల్పుల అమరేందర్, మండలశాఖ అధ్యక్షుడు మారగోని రాముగౌడ్, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, ఎం. శ్రీనివాస్, నాయకులు ఎన్. రమేష్, గోద శ్రీనివాస్, అబ్బగాని వెంకట్‌గౌడ్, ఆకుల మల్లేష్, నక్కల చిరంజీవి, పప్పు, కంచర్ల నర్సింగరావు, పుట్ట వీరేష్‌యాదవ్, సత్యనారాయణ, రమేష్, మురళి, మహేష్, నరేష్, ధనుంజయగౌడ్ తదితరులు ఉన్నారు.