కొనసాగుతున్న మట్టి తవ్వకాలు
కొనసాగుతున్న మట్టి తవ్వకాలు
Published Sun, Jul 24 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
భువనగిరి : పట్టణ శివారులోని సీతానగర్‌లో గల ఖిలా కోటగడ్డకు సంబంధించిన మట్టిలో వారం రోజులుగా జరుగుతుండగా ఆదివారం పురాతన కాలం నాటి దేవతా మూర్తుల విగ్రహాలు, రాతి స్తంభాలు బయటపడ్డాయి. ఇందులో నాగభైరవుడి విగ్రహం కూడాఉంది. జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా ఈ ఘటన వెలుగుచూసింది. పక్కనే ఉన్న వెంచర్‌లో మట్టి నింపడానికి ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఈ సమయంలో బయటపడ్డ పురాతన చరిత్రకు సంబంధించిన రాతి స్తంభాలను వెంచర్లకు తరలించారు. విషయం బయటకు పొక్కడంతో ట్రాక్టర్ ద్వారా మళ్లీ యథా స్థానంలోకి తెచ్చారు. తవ్వకాల్లో చిన్నచిన్న దేవాలయాలు ధ్వంసమైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
నాగ భైరవుడి విగ్రహానికి పూజలు
పాముల ఆ¿¶ రణాలతో అలంకరించబడి ఉన్న నాగభైరవుడి విగ్రహానికి చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్విలావణ్య, కౌన్సిలర్లు, రఘునాథ్, బోగవెంకటేష్, కాంగ్రెస్ నాయకులు దర్గాయి హరిప్రసాద్ తదితరులు పూజలు చేశారు.
గుప్త నిధులు దొరికాయని ప్రచారం
కోటగడ్డ తవ్వకాల్లో గుప్త నిధులు లభించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దేవాలయానికి సంబంధించిన రాతి స్తంభాలు, దేవతామూర్తుల విగ్రహాలు బయటపడినందున గుప్త నిధులు కూడా దొరికి ఉంటాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు జరిపిన చోట పోలీసు నిఘా ఉంచాలని కోరుతున్నారు.
ఆలయాన్ని పునర్నించాలి
–తోట భానుప్రసాద్, వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి
కోటగడ్డ మట్టి తవ్వకాల్లో ధ్వంసమైన ఆలయాన్ని పునర్నించాలి. ఆలయం ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి. మూడు రోజులుగా జరుగుతున్న మట్టి తవ్వకాల్లో బయటపడ్డ కొన్ని విగ్రహాలు తరలిపోయాయి. ఈ ఉదంతంపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.
Advertisement