పైసలంటే లక్షలు... రూపాయలంటే కోట్లు! | NRI Sridhar Whatsapp name In Message doing Hulchul! | Sakshi
Sakshi News home page

పైసలంటే లక్షలు... రూపాయలంటే కోట్లు!

Published Mon, Aug 15 2016 3:12 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

పైసలంటే లక్షలు... రూపాయలంటే కోట్లు!

పైసలంటే లక్షలు... రూపాయలంటే కోట్లు!

* డబ్బును లెక్కపెట్టడంలో నయీమ్ అలవాటిదీ
* నక్సలైట్లను చంపడం తనకు వ్యసనం
* ఎన్నారై శ్రీధర్ పేరిట వాట్సప్‌లో హల్‌చల్ చేస్తున్న మెసేజ్

సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ లెక్కల్లో పైసలంటే లక్షలు.. రూపాయలంటే కోట్లు. వందలాది మందిని అనేక రూపాల్లో బెదిరించి కోట్ల రూపాయల వసూలు చేసిన నయీమ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ బాధితుడు కొంచెం ధైర్యం చేసి నయీమ్ ఆగడాలను సమాజానికి చెప్పే ప్రయత్నం చేశాడు. భువనగిరికి చెందిన ఎన్నారై శ్రీధర్ డోగిపర్తి పేరిట వాట్సప్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ ప్రింట్ మెసేజ్.. నయీమ్ స్వరూపాన్ని కళ్లకు కడుతోంది.

నయీమ్‌ను మట్టుబెట్టిన పోలీసులు, సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతునట్టు ఆ మెస్సేజ్‌లో పేర్కొన్నారు. అందులో ఉన్న అంశాల ఆధారంగా నయీమ్ డీల్ తీరు.. ‘‘భువనగిరిలోని నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీను నాకు (శ్రీధర్ డోగిపర్తి) ఫోన్ చేసి నయీమ్ కలవాలన్నాడని చెప్పాడు. ఎందుకు రావాలంటే.. ‘భాయ్ ఆర్డర్’ అని హెచ్చరించాడు. ఈ ఏడాది జనవరి 29న ఉదయం భువనగిరిలోని సాయిబాబా ఆలయం వద్ద వాహనంలో ఎక్కించుకున్నారు. అందులో పాశం శ్రీను, డ్రైవర్ కత్తుల జంగయ్య, భువనగిరి జెడ్పీటీసీలు ఉన్నారు.

నా సెల్‌ఫోన్ తీసేసుకున్నారు, ఆయుధాలేమైనా ఉన్నాయని తనిఖీ చేశారు. సాయిబాబా గుడి, అయ్యప్ప, ఎల్లమ్మ దేవాలయాల వద్ద పూజలు చే శాక తుక్కుగూడకు తీసుకెళ్లారు. అక్కడ మరో వాహనం (బ్లాక్ ఎక్స్‌యూవీ500, నంబర్ టీఎస్08ఈబీ0645) ఎక్కించి.. నా కళ్లు మూసేశారు. అరగంట ఒక పెద్ద గెస్ట్‌హౌస్‌లోకి తీసుకెళ్లి.. కళ్లు తెరవమన్నారు. ఏకే 47లు ధరించిన ఇద్దరు గన్‌మన్‌లు మరోసారి చెక్ చేసి న యీమ్ ఉన్న గదిలోకి తీసుకెళ్లారు.
 
నయీమ్: అన్నా.. నన్ను గుర్తు పట్టావా?
నేను: గుర్తుపట్టాను.. 28 ఏళ్ల కింద మా నాన్న దగ్గరకు వచ్చారు కదా...
 
నయీమ్: ఎలా ఉన్నాడు మీ నాన్న
నేను: చనిపోయి ఐదేళ్లయింది

నయీమ్: మీనాన్న చాలా ధైర్యవంతుడు. అప్పట్లో నేను స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పుడు భయపెట్టే ప్రయత్నం చేసినా భయపడలేదు.
(కొంత సాధారణ సంభాషణ)

నయీమ్: నేను నక్సలైట్ల మీద పోరాటం చేస్తున్నా.. వాళ్లను చంపడం నాకు వ్యసనం. దానికోసం యుద్ధం చేసే వాళ్లుగానీ, డబ్బులిచ్చే వాళ్లుగానీ కావాలి. నువ్వు ఒకరిని చంపమంటే చంపలేవు కదా.. అందుకే డబ్బు రూపంలో సాయం చేయాలి. రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి.
నేను: ఏమన్నా రెండు కోట్లు అంటూ జోక్ చేస్తున్నావా?

నయీమ్: నీకు జోకర్‌లా క న్పిస్తున్నానా..? నీకు సీరియస్ తెలియడం లేదు. (ఐపీఎస్ అధికారి వ్యాస్, సాంబశివుడు, కోనపురి రాములు, పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి, అచ్చంపేట లో రిపోర్టర్, భువ నగిరికి చెందిన సోమ రాధాకృష్ణను చంపిన విషయాలు వివరించా డు)
నేను: అంత డబ్బు ఇచ్చుకోలేను
 
నయీమ్: డబ్బు ఇవ్వకు వెళ్లిపో.. మీవాళ్లు ఎక్కడుంటారో నాకు తెలుసు. మీ బావ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. మామూలు యాక్సిడెంటని మీరనుకుంటారు. కానీ అది నేనే చేయించానని ఫోన్ చేస్తా.. నాకు కోడిని కోసినా, మేకను కోసినా, మనిషిని కోసినా ఒకటే.. చెప్పింది చెయ్యి. లేకుంటే అమెరికా నుంచి రెండు గన్స్ తీసుకురా.. నీ దగ్గర ఎంత ఉందో నాకు తెలుసు. చచ్చేటప్పుడు ఏం తీసుకుపోతావు? ఏదీ నీతో రాదు. నువ్వు పోతే రెండు రోజులు ఏడ్చి.. మర్చిపోతారు.
నేను: పది లక్షలు ఇస్తానన్నా..
 
నయీమ్: పది పైసలు (పదిలక్షలు) ఇస్తావా.. దాని కోసం ఇంత స్కెచ్ వేయాలా? నువ్వు కావాలంటే రెండు కోట్లు ఇవ్వొచ్చు. కానీ 50 లక్షలు ఇవ్వు. అదే ఫైనల్.
నేను: నువ్వు కావాలంటే డబ్బు లాగడం పెద్ద పనికాదు. ఉన్న ఊరు కన్నతల్లిలాంటిది అంటారు.. భువనగిరి మిడిల్ క్లాస్ వాళ్లను ఎందుకు ఇబ్బందిపెడతారు?
 
నయీమ్: నాకు మీతో స్నేహం చేయాలని ఉంది. ఉట్టిగానే చేయమంటే చేస్తావా? నీకు నష్టం చేస్తే.. భయ్యాతో నష్టం జరిగింది, కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి స్నేహం చేద్దామనుకుంటారు.
(ఇదంతా జరిగాక తిరిగి తీసుకొచ్చి, సెల్‌ఫోన్ ఇచ్చి వదిలేశారని.. ఫిబ్రవరి 20, 2016 రోజున తమ అమ్మతో కలసి వెళ్లి పాశం శ్రీను ఇంటికి వెళ్లి రూ.50 లక్షలు ఇచ్చానని వాట్సప్ మెసేజ్‌లో ఉంది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement