వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
Published Thu, Aug 4 2016 11:12 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
భువనగిరి అర్బన్
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని భువనగిరి, మిర్యాలగూడ మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు.. భువనగిరి పట్టణం మీనానగర్‌కు చెందిన వవాల్‌దాస్ శ్రీనివాస్(36) బీబీనగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే బుధవారం కూడా కంపెనీలో పని ముగించుకుని భువనగిరికి రావడానికి బీబీనగర్‌లో ఓ ఆటోను ఎక్కాడు. ఈ క్రమంలో ఆటో భువనగిరి శివారులో ఉన్న మారుతి కారు షోరూం వద్దకు రాగానే డ్రైవర్ అజాగ్రత్తాగా నడపడం వల్ల శ్రీనివాస్ ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11.20 నిమిషాలకు మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి బంధువు మండల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ మంజునా«ద్‌రెడ్డి తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
మిర్యాలగూడ రూరల్:
దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన దైద హుస్సేన్(35) పని నిమిత్తం మిర్యాలగూడ శివారు కొత్తగూడెం వద్దకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వెళుతున్నాడు. ఆక్రమంలో అద్దంకి–నార్కెట్‌ల్లి రహదారిపై కొత్తగూడెం శివారు నూకలవారిగూడెం సమీపంలో రోడ్డు దాటు తుండగా గుర్తుతెలియని వాహనం ఢీనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సమాచారం మేరకు ఎస్‌ఐ సర్ధార్‌నాయక్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలింఆచరు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుచున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Advertisement
Advertisement