అభివృద్ధి చేసి చిత్తశుద్ధి నిరూపించుకుంటాం
భూదాన్‌పోచంపల్లి : భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చిత్తశుద్ధి నిరూపించుకుం టామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పద్మశాలి వేదిక వద్ద ఏర్పాటు చేసిన అభినందన బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలి పారు. నవ తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం అదృష్టమని, ఆయన ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రి అభివృద్ధికి రూ.60 కోట్లు కేటాయించామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్దాలు చెప్పారని, వాస్తవానికి రూ.4కోట్లు కూడా లే వని అన్నారు. నిమ్స్, నియోజకవర్గంలోని బునాదిగాని, పిలాయిపల్లి కాలువలను వెంటనే పూర్తిచేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చేనేత రుణమాఫీతోపాటు, బ్యాంకుల ద్వారా కొత్తరుణాలు ఇప్పించే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. బీబీనగర్ నిమ్స్‌ను ఆది వారం ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య సందర్శించనున్నారని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ సర్పంచ్‌లు...
దంతూర్, ఇంద్రియాల, గౌస్‌కొండ, జూలూరు, దోతిగూడెం గ్రామాల టీడీపీ సర్పంచ్‌లు బత్తుల శ్రీశైలం, బండి కృష్ణ, రమావత్ లక్ష్మయ్య, గోదాసు విజయలక్ష్మిపాండు, బాలెం మల్లేష్‌లతోపాటు ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే పోచంపల్లి2, జూలూరు స్వతంత్ర ఎంపీటీసీలు కర్నాటి రవీందర్, బండారు లలిత కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.
పార్టీ కార్యాలయం ప్రారంభం.....
మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డితో కలిసి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ప్రారంభించారు. అనంతరం మార్కేండేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చేనేత సహకార సంఘం ఆవరణలో ఉన్న దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయిచంద్ కళాబృందంచే నిర్వహించిన తెలంగాణ ధూం.. ధాం అలరించింది. కళాకారులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే సైతం డ్యాన్స్ చేసి ఆక ర్షించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కోట మల్లారెడ్డి, కందాడి భూపాల్‌రెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, చంద్రం, భిక్షపతి, రామాంజనేయులు, కందాడి రఘుమారెడ్డి, పొనమోని శ్రీశైలం, ఐలయ్య, సిలువేరు బాలు, ఆర్ల వెంకటేశం, ఎంపీటీసీలు పాల్గొన్నారు.