తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ | Theft in house | Sakshi
Sakshi News home page

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

Aug 19 2016 12:00 AM | Updated on Aug 21 2018 5:54 PM

భువనగిరి అర్బన్‌ : తాళం వేసి ఉన్న ఇంట్లో బంగారు నగలు, నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటన మండలంలోని వీరవెల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

భువనగిరి అర్బన్‌ : తాళం వేసి ఉన్న ఇంట్లో బంగారు నగలు, నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటన మండలంలోని వీరవెల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వీరవెల్లి గ్రామ పరిధిలోని పొలిశెట్టి జోజప్ప వ్యవసాయం చేసుకుంటూ, తనకున్న ట్యాక్సీ కారును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఇంట్లో తనతో పాటు భార్య మరియమ్మ ఉంటారు. రోజులాగే భార్యభర్తలు రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి ఇంటి ముందు నిద్రించారు. ఇది గమనించి గుర్తు తెలియని వ్యక్తులు తాళం తీసి ఇంట్లోకి వెళ్లారు. బీరువా తలుపులు తీసి అందులో ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలు, 14 తులాల వెండీ, రూ.20 వేల నగదును అపహరించుకుపోయారు. తెల్లవారుజామున లేచి చూడగానే తలుపులు తీసి, లైట్లు వేసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువ తెరచి ఉంది. అందులో ఉన్న నగలు, నగదు కనబడక పోవడంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులు, గ్రామస్తులకు సమచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇంటి పరిసరాలను పరిశీలించారు. అనంతరం నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీంను రప్పించి ఇంటి పరిసరాలను, చుట్టు పక్కల ఇళ్లను పరిశీలించారు. జోజప్ప ఫిర్యాదుతో కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ సాజిదుల్లా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement