పుష్కర ఘాట్‌ను పరిశీలించిన ఆర్డీఓ
పుష్కర ఘాట్‌ను పరిశీలించిన ఆర్డీఓ
Published Tue, Jul 26 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
కిష్టాపురం (మేళ్లచెర్వు): మండలంలోని కిష్టాపురం వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను సోమవారం సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇన్‌చార్జి తహసీల్దార్ శ్రీదేవి, ఐబీ డీఈ స్వామి, ఏఈఈ పిచ్చయ్య, పాండునాయక్, ఆర్‌ఐ వీరయ్య, జిలానీ ఉన్నారు.
Advertisement
Advertisement