kishtapuram
-
సీఎంతో ముఖాముఖికి కిష్టాపూర్ విద్యార్థి..
మంచిర్యాల: పదో తరగతి ఫలితాల్లో పది జీపీఏ సాధించిన మండలంలోని కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి రాథోడ్ ఈశ్వర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ముఖాముఖి కార్యక్రమానికి ఎంపికయ్యాడు. ఈ నెల 9న హైదరబాద్‌లోని రవీంద్రభారతీలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడని పాఠశాల హెచ్ఎం గుండ రాజన్న తెలిపారు.కార్యక్రమం అనంతరం విద్యార్థిని, తల్లిదండ్రులను ముఖ్యమంత్రి సన్మానిస్తారని తెలిపారు. ఈ నెల 10న హరిహర కళాభవన్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి విద్యార్థి, ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రులను సత్కరిస్తారని పేర్కొన్నారు. వందేమాతరం, విద్యాదాత పురస్కారాలు అందజేస్తారని తెలిపారు. విద్యార్థిని శుక్రవారం ఎంఈవో విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు దాముక కమలాకర్, కమిటీ చైర్మన్ మంగ, ఉపాధ్యాయులు అభినందించారు. -
పుష్కర ఘాట్‌ను పరిశీలించిన ఆర్డీఓ
కిష్టాపురం (మేళ్లచెర్వు): మండలంలోని కిష్టాపురం వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను సోమవారం సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇన్చార్జి తహసీల్దార్ శ్రీదేవి, ఐబీ డీఈ స్వామి, ఏఈఈ పిచ్చయ్య, పాండునాయక్, ఆర్ఐ వీరయ్య, జిలానీ ఉన్నారు. -
గ్రామంలో విషజ్వరాలు: 50 మంది ఆస్పత్రి పాలు
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి మండలం కిష్టాపురం గ్రామంలో విష జ్వరాలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 50 మంది జ్వరాలతో బాధపడుతూ దర్శి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. నాలుగు గంటలకోసారి జ్వరం వచ్చిపోతున్నట్టు వారు చెబుతున్నారు. మలేరియా లక్షణాలు లేకపోవడంతో వైరల్ జ్వరాలుగా వైద్యులు పరిగణించి చికిత్స ప్రారంభించారు.