కావలి: కొండాపురం మండలం గానుగపెంట ఎస్సీ-బీ కాలనీకి నకిలీ పాస్‌బుక్‌లు సృష్టించి బ్యాంకులో రుణం తీసుకున్న సంఘటనపై జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ విచారణకు అదేశించారు. దీంతో దీనిపై కొండాపురం రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. ‘కాలనీని తాకట్టుపెట్టారు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు.
సమగ్ర విచారణ జరపాలంటూ తహశీల్దార్‌ను ఆదేశించారు. కొండాపురం మండలం గానుగపెంట ఎస్సీకాలనీలోని సర్వేనెంబర్ 266/2లో ప్రభుత్వం 7.58 ఎకరాలను 1997లో 60 మంది ఎస్సీలకు నివాస స్థలాలను ఇచ్చారు. అదే స్థలాన్ని రవి, హజరత్ అనే వ్యక్తులు నకిలీ పాస్‌బుక్‌లు తయారుచేసి కలిగిరి, కొండాపురం మండలంలోని పలు బ్యాంకుల్లో రూ. 6.50 లక్షల రుణాలను తీసుకున్నారు. బ్యాంకుల్లో ఆధార్‌కార్డు అనుసంధానంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని కాలనీవాసులు కావలి ఆర్డీఓ లక్ష్మీనరసింహంకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిందిగా జేసీ ఆదేశాలిచ్చారు.
జేసీ ఆదేశాలతో కొండాపురం తహశీల్దార్ ప్రమీల ఆకాలనీని పరిశీలించారు. ఆకాలనీ సర్వే నంబర్‌తో రుణం తీసుకున్న బ్యాంకులకు వివరాల కోసం రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు గురువారం వెళ్లారు. రుణం పొందేందుకు ఏయే పత్రాలు ఇచ్చారు అనేదానిపై విచారణ చేస్తున్నారు. ఆ భూమిని హజరత్, రవిల పేరున అడంగళ్ ఏ సంవత్సరంలో వచ్చింది, అందులో పాత్రధారులు ఎవరనే దానిపై వారు విచారణ చేస్తున్నారు. దీనిపై కొండాపురం తహశీల్దార్ ప్రమీల మాట్లాడుతూ జేసీ ఆదేశాలతో కాలనీ తాకట్టుపై విచారణ చేస్తున్నామని చెప్పారు. విచారణకు సంబంధించి నివేదికను ఆర్డీఓ ద్వారా జేసీకి పంపుతామన్నారు.
కాలనీ తాకట్టుపై విచారణ
Published Fri, Mar 6 2015 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM
Advertisement
Advertisement