- సర్కారు లెక్కల్లో వింత సంగతులు
- ధ్రువీకరణ లేకపోవడమే కారణం
- పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ
- భగభగ మండుతున్న సూరీడు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎండలు మండుతున్నాయి. ఎండా కాలానికి ఈసారి కొత్త నిర్వచనం చెబుతున్నాయి. సూర్యుడు ఉదయిస్తూనే భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నంలోపే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలకుతోడు వేడిగాలులు ప్రాణాలు తీస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎండ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బతో మే 19న నలుగురు, 20న 11 మంది, 21న 22 మంది, 22న 54 మంది, 23న(శనివారం) 63 మంది చనిపోయారు. వేసవి కాలం మొదలైన ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 150 మందికిపైగా చనిపోయూరు. సాంకేతికంగా చూస్తే మృతుల లెక్కలు వంద శాతం కరెక్టు కాకపోవచ్చు.
అయినా ఎంతో కొంత మేరకు ఉంటుంది. ప్రభుత్వ లెక్కలు చూస్తే మాత్రం విచిత్రంగానే కనిపిస్తోంది. ప్రస్తుత వేసవి సీజనులో ఒక్కరు కూడా వడదెబ్బతో మృతి చెందిన దాఖలాలు లేవని ప్రభుత్వ నివేదిక చెబుతోంది. గతంలో ఎప్పుడూ లేనంత తీవ్ర స్థాయిలో ఎండలు ఉన్నా.. వడదెబ్బకు ఒక్కరూ చనిపోలేదని జిల్లా యంత్రాంగం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత సీజనులో వడదెబ్బ కారణంగా మృతి చెందిన కేసు ఒక్కటి నమోదు కాలేదని జిల్లా రెవెన్యూ అధికారి శోభ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారిక సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సకాలంలో స్పందించని అధికారులు
వడదెబ్బకు సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి పరిగణలోకి తీసుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి మే 10 వరకు 60 మం ది వడదెబ్బతో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖకు సమాచా రం ఉంది. పరిశీలన తర్వాత వచ్చిన తుది నివేదిక దీనికి విరుద్ధంగా ఉంది. మృతి చెందిన 60 మందిలో ఏ ఒక్కరి మరణానికి వడదెబ్బ కారణం కాదని పేర్కొంది. పైగా వేర్వేరు కారణాలతో వీరు మృతి చెందినట్లు నివేదించింది. ఎండలు తీవ్రత పెరిగిన మే 10 నుంచి మే 18 వరకు 88 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు వచ్చిన సమాచారం మేరకు పరిశీలన జరుగుతోంది. ఈ మృతులకు సంబంధించిన కారణాలు వెల్లడికావాల్సి ఉంది. వడదెబ్బ మృతులకు సంబంధించి అధికారులు సకాలంలో స్పందించడం లేదు. దీంతో మృతుల లెక్కలు నమోదు కావడం లేదు. ముఖ్యంగా వైద్యఆరోగ్య శాఖ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజల అవగాహన లేమితో ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యం బయటికిరావడం లేదు.
తేలితే.. ఆపద్బంధు సాయం
వడదెబ్బ మృతులకు సంబంధించి.. దహన సంస్కారాలకు ముందే అధికారికంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇతర అకాల మరణాలలాగే.. వడదెబ్బ మృతుల విషయంలోనూ అధికారులు నివేదిక రూపొందించాలి. మృతి విషయం తెలిసిన వెంటనే స్థానిక వీఆర్‌వో.. తహసీల్దారుకు, పోలీసులకు చెప్పాలి. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌తో కలిసి వీరు సంఘటన స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేస్తారు. పోస్టుమార్టం చేయాల్సి ఉంటుంది. పంచనామా, పోలీసు శాఖ ఎఫ్‌ఐఆర్ కాపీ, పోస్టుమార్టం నివేదికల ఆధారంగా మృతికి కారణం వడదెబ్బ అని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇలా నిర్ధారణ చేసిన తర్వాత.. తహసీల్దారు, ఆర్డీవో ల ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమాచారం వస్తుంది. ప్రభుత్వానికి ఈ విషయాన్ని నివేదిస్తారు.
వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేస్తారు. ఆపద్బంధు పథకం కింద ఈ ఆర్థిక సహాయం ఇస్తున్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం వడదెబ్బ మృతులకు ప్రత్యేకంగా ఆర్థిక సహాయం ఏమీ లేదు. రాష్ట్ర స్థాయిలోని ఆపద్బంధు పథకమే అమలువుతుంది. రోడ్డుప్రమాదాలు, పాముకాటు, కరెంటు షాక్, అగ్నిప్రమాదాల మృతుల కేటగిరీలోనే వడదెబ్బ మృతులకు సహాయం అందజేస్తున్నారు. అధికార యంత్రాంగం మాత్రం వడదెబ్బ మృతులను గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహిస్తోంది.
ఆర్డీవోకు వడదెబ్బ
నర్సంపేట : ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ఇతర సామాజిక కార్యక్రమాలతో కొన్ని రోజులుగా తీరిక లేకుండా ఉంటున్న న ర్సంపేట రెవెన్యూ డివిజనల్ అధికారి రామకృష్ణారెడ్డికి వడదె బ్బ తగిలింది. వుూడు రోజుల క్రితం రెవెన్యూ శాఖ ఆధ్వర్యం లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయువంతం చేయుడం కోసం ఆర్డీవో మండే ఎండలోనూ బిజీ గా పని చేశారు. ఆ రోజు ఎండ ప్రభావంతో ఆర్డీవో అస్వస్తతకు గురయ్యారు. రెండో రోజులుగా చికిత్స పొందుతున్నారు. వడదెబ్బతో అనారోగ్యానికి గురైన ఆర్డీవో రామకృష్ణారెడ్డి ప్రజలకు పలు సూచనలు చేశారు. ‘ఎండలో ఎక్కువ సవుయుం గడపొ ద్దు. రోడ్లపై ఎక్కువ సవూయూన్ని కేటారుుస్తే వడదెబ్బకు గురి కావాల్సి వస్తుంది. వడదెబ్బకు గురైనవారికి చికిత్స కోసం ఆస్పత్రుల్లో తగిన వుందులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆర్డీవో చెప్పారు.
జిల్లాలో వడదెబ్బ మృతులు లేరు
Published Sun, May 24 2015 5:10 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement