- ‘సాక్షి’ కథనానికి వైద్య, ఆరోగ్యశాఖ స్పందన
- సీఎంకు ఆగమేఘాల మీద ఫైలు పంపిన అధికారులు
- వారం, పది రోజుల్లో అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. పేద రోగులు చనిపోతే మృతదేహాలను స్వస్థ లాలకు ఉచితంగా తరలించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ నడుం బిగించింది. ‘పేదల శవానికి వాహనం దొరకదు’ శీర్షికన సోమ వారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి స్పందిం చారు. ఇప్పటికే మూలనపడి ఉన్న 50 శవాల తరలింపు వాహనాలను వెంటనే ఉప యోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన అనుమతి కోసం సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫైలు పంపించినట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపారుు.
సీఎం నుంచి ఆమోదం లభించిన వెంటనే ప్రస్తుతమున్న 50 వాహనాలను పేదల శవాల తరలింపునకు ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు. వారం, పది రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వాహనాల నిర్వహణ బాధ్యతను తాత్కాలికంగా జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థకు అప్పగిస్తామన్నారు. తర్వాత టెండర్లను ఆహ్వానించి పీపీపీ పద్ధతిలో అప్పగిస్తామని వెల్లడించారు. ప్రస్తుతమున్న వాహనాలను హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రధాన ఆసుపత్రుల వద్ద సిద్ధంగా ఉంచుతారు. ఈ వాహనాలు అవసరమున్న వారు ‘108’కు ఫోన్ చేస్తే అరగంటలో వాహనాన్ని సిద్ధం చేస్తారు.
పేదల శవాల తరలింపునకు వాహనాలు
Published Tue, Nov 8 2016 2:55 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement