
శ్రీనివాస్
సాక్షి, కందుకూరు: ఆర్డీఓ సంతకం ఫోర్జరీ కేసులో నాయబ్ తహసీల్దార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం తుమ్మలూరుకు చెందిన కావలి వెంకటయ్య, యశోద దంపతులకు సర్వే నంబర్ 239, 240, 250, 251లో 40 ఎకరాల భూమి ఉంది. సదరు భూమి వివాదంలో ఉండటంతో పాటు కోర్టులో కేసు నడుస్తోంది.
భూమి ఇనాం పట్టాకు సంబంధించినది కావడంతో ఓఆర్సీ తీసుకోవాల్సి ఉంది. దీంతో యాచారం మండలానికి చెందిన కేశమోని వెంకటయ్య, నోములకు చెందిన బుట్టి బాలరాజు కలిసి వెంకటయ్య, యశోద దంపతుల అనుమతితో మాడ్గుల మండలం నాయబ్ తహసీల్దార్ ఈసన్నగారి శ్రీనివాస్(42) సహకారంతో ఓఆర్సీ పత్రాలను ఆర్డీఓ సంతకంతో ఫోర్జరీ చేశారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న కందుకూరు ఆర్డీఓ రవీందర్‌రెడ్డి సెప్టెంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 14న కేశమోని వెంకటయ్య, బుట్టి బాలరాజు, వెంకటయ్య, యశోదను అరెస్టు చేశారు. గురువారం నాయబ్ తహసీల్దార్‌ను రిమాండుకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment