
సమస్యలు వింటున్న ఆర్డీవో నరేందర్
రాయికల్(జగిత్యాల): పట్టాదారు పాస్‌బుక్‌లను జారీ చేసేందుకు డిజిటల్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీవో నరేందర్ అన్నారు. రాయికల్‌లోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రైతులంతా తమ పట్టాదారు పాస్‌బుక్‌లను ఆధార్‌తో అనుసంధాన ప్రక్రియ దాదాపు పూర్తయిందని, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోందని తెలిపారు. రైతులు తమ ఆధార్‌ను పట్టాదారు పాస్‌బుక్‌లకు అనుసంధానం చేయకపోతే వెంటనే వీఆర్వోలకు అందించాలని కోరారు. తద్వారానే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతాయని పేర్కొన్నారు. తమ భూములను సర్వే చేయించాలని దావన్‌పల్లి గ్రామస్తులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ హన్మంతరెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment