Digital System
-
డిజిటల్ సేవలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది: గౌతం రెడ్డి
-
పంటల లెక్కపై కేంద్రం కొత్త యాప్.. జీపీఎస్, ఫొటోలతో..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో వ్యవసా య శాఖ చేపట్టిన పంటల నమోదు ప్రక్రియ తర హాలో దేశవ్యాప్తంగా డిజటల్ సర్వేకు కేంద్ర ప్రభు త్వం సన్నాహాలు మొదలుపెట్టింది. అన్ని రాష్ట్రాల్లో పంటల నమోదును ఒకేరీతిన పక్కాగా చేపట్టేందుకు సరికొత్త యాప్‌ను రూపొందించి, ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏ సర్వే నంబర్లో, ఏ రైతు, ఎంత విస్తీ ర్ణంలో ఏ పంట సాగు చేశారన్న కచి్చతమైన వివరాలను ఫొటోలతో సహా నిక్షిప్తం చేయనున్నారు. 12 రాష్ట్రాల్లో ఒక్కో గ్రామం చొప్పున ప్రస్తుత ఖరీఫ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 12 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద పంటల డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పీఓసీ) కింద నమూనా సర్వే కోసం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. మనరాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా వెంకటాపూర్ గ్రామం ఎంపికైంది. ఈ మేరకు ఇటీవల నలుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఆ గ్రామంలో పర్యటించి నమూనా సర్వే నిర్వహించింది. టెక్నికల్ బృందం సీనియర్ మేనేజర్ సరిత, రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి డీడీ గోవింద్, శైలజ, జేడీఏ విజయగౌరితో పాటు డీఏఓ వెంకటేష్ తదితరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో అనుసంధానం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం స్థానిక వ్యవసాయాధికారులతో కలసి వెంకటాపూర్‌లోని పంట పొలాల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించింది. కేంద్రం ప్రభుత్వం రూపొందించిన అప్లికేషన్ ప్రకారం.. భూరికార్డులకు అనుగుణంగా రైతులు వేసిన పంటలను ఫొటోలు తీశారు. ఏ సర్వే నంబర్లో ఏ రైతుకు ఎంత భూమి ఉంది, ఎక్కడ ఉంది, ఆ రైతులు ఏ పంటలు వేశారనే సమాచారాన్ని ఫొటోలతో సహా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో అనుసంధానం చేశారు. ఇలా ఈ ఖరీఫ్‌లోపు 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 20శాతం గ్రామాల్లో సర్వే పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. రైతులకు ప్రయోజనకరంగా.. తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో పంటలను నమోదు చేసిన యాప్, నిక్షిప్తం చేసిన వివరాలు, వాటి క్రోడీకరణను పూర్తిస్థాయిలో పరిశీలించనున్నారు. లోటుపాట్లేమైనా ఉంటే సరిదిద్ది అవసరమైన మార్పు చేర్పులు చేస్తారు. తర్వాత ఈ యాప్‌ను అన్ని రాష్ట్రాలు నేరుగా వినియోగించుకోవచ్చని.. ఇదివరకే పంటల నమోదు చేస్తున్న రాష్ట్రాల్లో యాప్‌లో మార్పులు, చేర్పులు చేసుకుని వాడుకునే అవకాశం ఉందని కేంద్రం బృందం వెల్లడించింది. గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు పంటల సర్వే పక్కాగా జరగాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని.. దీని ద్వారా రైతులకు నేరుగా, పారదర్శకంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో నష్టపరిహారం, బీమా, రాయితీపై ఎరువుల సరఫరా వంటివాటికి ఈ యాప్ తోడ్పడుతుందని వివరించింది. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్.. -
డిజిటల్ బాటలో ఎయిర్ ఇండియా - భారీ పెట్టుబడి..
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యవస్థలను ఆధునీకరించడంలో భాగంగా చాట్‌జీపీటీ ఆధారిత చాట్‌బాట్‌ను ఉపయోగించనున్నట్లు టాటా గ్రూప్ ప్రమోట్ చేస్తున్న విమానయాన రంగ సంస్థ ఎయిర్ ఇండియా సోమవారం తెలిపింది. ఇందుకోసం రూ.1,640 కోట్లు ప్రారంభ పెట్టుబడి చేసినట్టు ప్రకటించింది. డిజిటల్ ఇంజనీరింగ్ సేవలు, డిజిటల్ నిపుణులను తీర్చిదిద్దేందుకు సైతం ఈ మొత్తాన్ని వెచ్చించినట్టు పేర్కొంది. విహాన్.ఏఐ పరివర్తన కార్యక్రమంలో భాగంగా డిజిటల్ వ్యవస్థను ఆధునీకరించే ప్రయత్నాలలో గణనీయ పురోగతి సాధించామని వివరించింది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు పూర్తయ్యాయని, అలాగే మరెన్నో పురోగతిలో ఉన్నాయని ఎయిర్ ఇండియా చీఫ్ డిజిటల్, టెక్నాలజీ ఆఫీసర్ సత్య రామస్వామి తెలిపారు. -
5జీకి భారత్ సారథ్యం
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి సాధనలో ఏ దేశానికైనా పటిష్టమైన డిజిటల్ వ్యవస్థ అత్యంత కీలకంగా ఉంటోందని అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈవోలు తెలిపారు. ఇందుకు ఊతమిచ్చే 5జీ సేవల విస్తరణ విషయంలో మిగతా దేశాలకు భారత్ సారథ్యం వహించగలదని వారు అభిప్రాయపడ్డారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సందర్భంగా వారు ఈ విషయాలు తెలిపారు. భారత్ ఒక క్రమపద్ధతిలో డిజిటల్ వ్యవస్థను రూపొందించుకుంటోందని నోకియా కార్పొరేషన్ ప్రెసిడెంట్ పెకా లుండ్‌మార్క్ తెలిపారు. భారత్ తమకు ఇప్పుడు రెండో అతి పెద్ద మార్కెట్ అని, ఇక్కడి నుంచి 5జీ బేస్ స్టేషన్లను తాము ఎగుమతి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికా, చైనాలో ఫేస్బుక్, టెన్సెంట్ వంటి డిజిటల్ కంపెనీల అభివృద్ధిలో 4జీ కీలకపాత్ర పోషించిందని ఎరిక్సన్ ప్రెసిడెంట్ బోర్జే ఎకోమ్ తెలిపారు. దేశీయంగా 5జీ సేవల వేగవంతమైన విస్తరణతో భారత్‌లో అత్యంత ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ చౌకగా లభించేలా అంతర్జాతీయ స్థాయిలో నిర్దిష్ట ప్రమాణాలు రూపొందించాల్సిన అవసరం ఉందని నోకియా, ఎరిక్సన్ చీఫ్‌లు అభిప్రాయపడ్డారు. లేకపోతే గ్రామీణ ప్రజానీకం, అంతర్జాతీయ ఎకానమీని డిజిటల్‌గా అనుసంధానం చేయడం కష్టమవుతుందని పేర్కొన్నారు. 100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు .. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్ దేశాల్లో ఒకటిగా భారత్ ఉంటోందని జనరల్ అట్లాంటిక్ (ఇండియా) ఎండీ సందీప్ నాయక్ తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే పదేళ్లలో భారత్‌లోకి 100 బిలియన్ డాలర్ల పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లోకి వెల్లువెత్తుతున్న ప్రైవేట్ పెట్టుబడులను బట్టి చూస్తే ఇవి ఒక మోస్తరు అంచనాలు మాత్రమేనని నాయక్ వివరించారు. మొబైల్స్ భద్రత కోసం కొత్త నిబంధనలు పరిశ్రమ వర్గాలతో కేంద్రం సంప్రదింపులు యూజర్ల డేటా దుర్వినియోగం, ప్రీ–ఇన్స్టాల్డ్ నిఘా యాప్‌లపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్ల భద్రతా ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చడంపై కేంద్రం దృష్టి సారించింది. దీనికి సంబంధించి కొత్త నిబంధనల రూపకల్పనపై పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఒక ట్వీట్లో ఈ విషయాలు వెల్లడించింది. ‘అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్ సరఫరా వ్యవస్థలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్లు, యాప్‌ల భద్రత చాలా కీలకంగా ఉండబోతోంది. అందుకే తగు స్థాయిలో భద్రతా ప్రమాణాలను రూపొందించేందుకు పరిశ్రమ వర్గాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది‘ అని పేర్కొంది. మరోవైపు, డేటా దుర్వినియోగాన్ని అరికట్టే విషయంలో తాము కూడా ప్రభుత్వ పక్షానే ఉన్నామని మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థలు తెలిపాయి. అయితే, ఈ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పడితే కొత్త హ్యాండ్‌సెట్స్‌ను ప్రవేశపెట్టడంలో జాప్యం జరుగుతుందని, అలాగే ప్రీ–ఇన్స్టాల్డ్ (ముందుగానే ఇన్స్టాల్ చేసిన) యాప్స్ ద్వారా వచ్చే ఆదాయంపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. -
‘డిజిటల్’ స్థాయికి విద్యా రంగం
సాక్షి, అమరావతి: ఆధునిక ఆలోచనలు, పిల్లల భవిష్యత్తు పట్ల నిబద్ధత ఉన్న ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రంలో విద్యారంగం ఎంత ఆధునికతను సంతరించుకుంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెబుతుంది. ఆధునిక భావాలు, అధునాతన విద్యా విధానాలపై అవగాహన ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో విద్యారంగం తీరుతెన్నులు మరాయి. ఓ వైపు ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలను మెరుగు పరుస్తూనే, మరోవైపు ఆధునిక విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో 2022లో విద్యా రంగం మరో ముందడుగు వేసింది. చిన్నారులకు పునాది స్థాయి నుంచే అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు సాంకేతికతను, డిజిటల్ సాధనాలను సమర్థంగా వినియోగించుకొనేందుకు ప్రభుత్వం డిజిటల్ విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్ది వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకొనేలా చర్యలు తీసుకుంది. ట్యాబులు, స్మార్ట్ టీవీలు, వాల్టాప్ కంప్యూటర్లు రాష్ట్రంలో శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్ల నుంచి ఉన్నత పాఠశాలల వరకు అధునాతన పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. స్మార్ట్ టీవీలు, వాల్టాప్ కంప్యూటర్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ), ప్రొజెక్టర్ బేస్డ్ డీసీఆర్లను నెలకొల్పుతోంది. 50 వేలకు పైగా శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, హైస్కూల్, హైస్కూల్‌ప్లస్ స్కూళ్లలో ఈ డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. తరగతి గదులను డిజిటలీకరణ చేస్తున్నారు. విద్యార్థులను అత్యున్నత సామర్థ్యాలతో తీర్చిదిద్దేందుకు సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలో 1,000 స్కూళ్లకు సీబీఎస్ఈ గుర్తింపు కూడా వచ్చింది. మిగతా స్కూళ్లకూ గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టారు. డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయించి ఆధునిక ఈ–కంటెంట్ ద్వారా బోధన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10 వ తరగతి వరకు దాదాపు 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ సంస్థ ఈ–కంటెంట్‌ను కూడా ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్లలో బైజూస్ యాప్ ద్వారా ఈ– కంటెంట్‌ను డౌన్లోడ్ చేయించింది. దీనివల్ల స్కూళ్లలోనే కాకుండా ఇంటి వద్ద కూడా బాలలు వాటిని చదివేలా చేస్తున్నారు. ఏవైనా సందేహాలున్నా తిరిగి వెనక్కి వెళ్లి ఈ–కంటెంట్‌ను చూసుకొనే వెసులుబాటు ఉండటంతో విద్యార్థులు కూడా ఉత్సాహంగా చదువుకోగలుగుతున్నారు. విద్యార్థులు, టీచర్లకు ట్యాబుల పంపిణీ సీబీఎస్ఈ విధానం, డిజిటల్ విద్యలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 5.18 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు, ఆ తరగతి టీచర్లకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబులను ప్రభుత్వం ఉచితంగా అందించింది. ఒక్కో ట్యాబు ఖరీదు రూ.16 వేలు కాగా బైజూస్ కంటెంట్‌కు ఆ సంస్థ బయటి మార్కెట్లో ధర ఒక్కో విద్యార్థికి రూ.16 వేలు అవుతుంది. ఈలెక్కన ఒక్కో విద్యార్థికీ రూ.32 వేలు విలువైన ట్యాబు, కంటెంట్ ఉచితంగా ప్రభుత్వం అందించింది. డిసెంబర్ 21న బాపట్ల జిల్లా యడ్లపల్లి జడ్పీ హైస్కూలులో సీఎం వైఎస్ జగన్ ఈ ట్యాబుల పంపిణీ ప్రారంభించారు. డిజిటల్ విద్యా విధానంతో ఎన్నో ప్రయోజనాలు ► బోధనాభ్యసన ప్రక్రియల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారు ► సంప్రదాయ అభ్యసన విధానంలో విద్యార్థి ఏదైనా ఒక రోజు దాన్ని కోల్పోతే మరునాటి నుంచి అభ్యసనంలో వెనుకబడతాడు. డిజిటల్ విద్యా విధానంలో ఎక్కడి నుంచైనా ఆయా అభ్యాసాలను నేర్చుకోవచ్చు ► డిజిటల్ విద్యాభ్యాసంలో విద్యార్థుల అభ్యసన వేగం, సామర్థ్యాలకు అనుగుణంగా స్టడీ మెటీరియల్‌ను సరళీకరించడానికి ఉపాధ్యాయులకు అవకాశమిస్తుంది ► విద్యార్థులు తెలివిని పెంచుకోగలుగుతారు. ► వారంతట వారే కొత్త అంశాలను డిజిటల్ విధానంలో నేర్చుకోగలుగుతారు. ► వారికి అవసరమైన అంశాలను ఆన్లైన్లో వనరులను శోధించడం, అధ్యయనం చేయడం ద్వారా అభివృద్ధి సాధిస్తారు. ► సంప్రదాయ విద్యా విధానంలో ఉండే పుస్తకాల బరువు డిజిటల్ విధానంలో ఉండదు ► పాఠ్యాంశాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి ► విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా రూపుదిద్దుకుంటారు. భవిష్యత్తులో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నతావకాశాలను పొందుతారు. -
రిజిస్ట్రేషన్లలో సరికొత్త శకం.. ఏపీలో సేవలు మరింత చేరువ
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ విధానంలో సమూల మార్పులను తీసుకొచ్చి డిజిటల్ స్టాంపుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నాన్–జ్యుడిషియల్ స్టాంపు పేపర్ల విక్రయాలు, రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, అవకతవకలకు ఈ విధానంతో తెర పడనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే డిజిటల్ స్టాంపులను అందుబాటులోకి తేవడంతోపాటు డిజిటల్ చెల్లింపులన్నీ అక్కడి నుంచే పూర్తి చేసే వ్యవస్థకు శ్రీకారం చుడుతుండడంతో వినియోగదారులకు రిజిస్ట్రేషన్ల సేవలు మరింత చేరువ కానున్నాయి. చదవండి: AP: రూ.100 కోట్లతో ల్యాబ్‌లు బలోపేతం తరలింపులో పలు సమస్యలు.. ప్రస్తుతం 90 శాతం నాన్–జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల విక్రయాలు స్టాంపు వెండార్ల ద్వారానే జరుగుతున్నాయి. అవసరాన్ని బట్టి రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంప్ పేపర్లను ఆర్డర్ ఇచ్చి నాసిక్‌లోని కేంద్ర ముద్రణ సంస్థ నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ తెప్పిస్తోంది. వాటిని రాష్ట్రానికి తరలించడం, భద్రపరచడం, జిల్లా రిజిస్ట్రార్లకు పంపడం, అక్కడ నుంచి స్టాంపు వెండార్లకు సరఫరా చేయడం కష్టతరంగా మారింది. స్టాంపు పేపర్లకు ఆర్డర్ ఇవ్వడం నుంచి వెండార్ల ద్వారా విక్రయించడం వరకు పలు సమస్యలు, వ్యయ ప్రయాసలు ఎదురవుతున్నాయి. పాత తేదీలతో స్టాంపుల విక్రయాలు లాంటి అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోంది. రవాణా, నిల్వ, సరఫరా కోసం రూ.కోట్లలో ఖర్చు కావడంతోపాటు పని భారం పెరుగుతోంది. డిజిటల్ స్టాంపులతో ఈ సమస్యలన్నింటికీ తెర పడుతుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలూ అక్కడే.. డిజిటల్ స్టాంపుల విక్రయాలు జరిగే కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్ చార్జీలు, యూజర్ చార్జీలు, స్టాంప్ డ్యూటీని ఆన్లైన్ ద్వారా చెల్లించే సౌలభ్యం తెస్తున్నారు. ప్రస్తుతం ఈ చార్జీలను వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా బ్యాంకు చలానాల రూపంలో చెల్లిస్తున్నారు. ఈ చలానాలను తీసుకునే వద్ద ఇటీవల భారీ కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. చలానాలు దుర్వినియోగం కాకుండా చెల్లింపుల్లో పారదర్శకత తెస్తూ ఎస్‌హెచ్íసీఐఎల్ కేంద్రాల్లోనే ఆన్లైన్లో చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిద్వారా వినియోగదారులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ఈ కేంద్రాల వద్ద ఆన్లైన్లో డిజిటల్ స్టాంపులను కొనుగోలు చేసి అక్కడే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారు స్టాంప్ పేపర్లను కొనకుండా నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారానే ఆ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. స్టాంప్ డ్యూటీని ఆన్లైన్లోనే చెల్లించి రిజిస్టర్ అయిన డాక్యుమెంట్‌ను నేరుగా డిజిటల్‌గా పొందవచ్చు. దీనివల్ల రిజిస్ట్రేషన్ల శాఖకు ఖర్చు, పని భారం తగ్గడంతోపాటు వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది. అవకతవకలు, మధ్యవర్తుల ప్రమేయానికి తెర పడుతుంది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఈ విధానాన్ని తీసుకురావాలని గతంలో చాలా ప్రభుత్వాలు ప్రతిపాదించినా అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దీన్ని సాకారం చేస్తూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దుతోంది. ఎస్‌హెచ్‌సీఐఎల్‌తో ఒప్పందం.. దేశంలో డిజిటల్ స్టాంపుల వ్యవస్థ అమలు బాధ్యతను కేంద్ర ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు(ఎస్‌హెచ్‌సీఐఎల్) అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంస్థ ద్వారానే డిజిటల్ స్టాంపుల విక్రయాల కోసం ఎంవోయూ కుదుర్చుకుంది. దీని ప్రకారం ఈ సంస్థ గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, స్టాంప్ వెండార్లతో ఎక్కడికక్కడ ఒప్పందాలు చేసుకుని డిజిటల్ స్టాంపుల విక్రయాలను నిర్వహిస్తుంది. ఇందుకోసం ఇంటర్ మీడియట్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోసుమారు 3 వేల కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లకు వీటి విక్రయాల బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే 37 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు డిజిటల్ స్టాంపులను వినియోగదారులు అక్కడే ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. త్వరలో అందుబాటులోకి... డిజిటల్ స్టాంపుల వ్యవస్థ చాలా సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఎస్‌హెచ్‌సీఐఎల్‌తో ఒప్పందం చేసుకున్నాం. 10 రోజుల్లో ఆ సంస్థ రాష్ట్రంలో పని ప్రారంభిస్తుంది. త్వరలో డిజిటల్ స్టాంపుల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల పూర్తిస్థాయి పారదర్శకత ఏర్పడుతుంది. వి.రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్
న్యూఢిల్లీ/ముంబై: గడిచిన రెండేళ్లుగా ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ సేవల్లో పదే పదే అంతరాయాలు కలుగుతుండటంపై రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా స్పందించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా, కొత్త డిజిటల్ కార్యకలాపాలేమీ ప్రకటించకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ గురువారం అసాధారణ ఆదేశాలు ఇచ్చింది. సాంకేతిక సమస్యలను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంపై బ్యాంకు బోర్డు దృష్టి పెట్టాలని సూచించింది. ‘డిజిటల్ 2.0 (ఇంకా ఆవిష్కరించాల్సి ఉంది) కింద కొత్త డిజిటల్ వ్యాపార లావాదేవీలు, ఇతరత్రా ఐటీ యాప్‌ల ద్వారా ప్రతిపాదిత లావాదేవీలు, కొత్త క్రెడిట్ కార్డుల జారీ వంటివన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ సూచించింది‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంక్ తెలియజేసింది. బ్యాంక్ నూతన సీఈవోగా ఇటీవలే (అక్టోబర్ చివర్లో) పగ్గాలు చేపట్టిన శశిధర్ జగదీశన్‌కు ఈ పరిస్థితిని చక్కదిద్దడం తొలి సవాలు కానుంది. దేశీయంగా క్రెడిట్ కార్డుల జారీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అతి పెద్ద సంస్థ. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం 1.49 కోట్ల మంది క్రెడిట్ కార్డు యూజర్లు, 3.38 కోట్ల డెబిట్ కార్డు యూజర్లు ఉన్నారు. ప్రస్తుత యూజర్లకు యథాప్రకారం సర్వీసులు కొనసాగుతాయని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ ఆదేశాలు ఎప్పటివరకూ అమల్లో ఉంటాయన్న వివరాలు వెల్లడి కాలేదు. సాధారణంగా బ్యాంకుల సేవా లోపాలకు సంబంధించి జరిమానాల వంటి వాటితో సరిపెట్టే ఆర్బీఐ ఇలాంటి చర్యలు తీసుకోవడం అసాధారణమని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం.. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు బ్యాంక్ కొత్త సీఈవో శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్‌ను మెరుగుపర్చుకునేందుకు బయట నిపుణుల సహా యం కూడా తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వివరించారు. మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో కొత్తగా మరిన్ని మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టడంలో జాప్యం జరగవచ్చని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల నుంచీ .. 2018 డిసెంబర్లో బ్యాంక్ కొత్తగా ఆవిష్కరించిన మొబైల్ యాప్ కొద్ది గంటల్లోనే క్రాష్ అయ్యింది. భారీ ట్రాఫిక్‌ను సర్వర్లు హ్యాండిల్ చేయలేకపోవడం ఇందుకు కారణం. ఏడాది తర్వాత సరిగ్గా జీతాల సమయంలో ఆన్లైన్ సేవలన్నింటిలోనూ అంతరాయం కలిగింది. దీంతో ఈ సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇక తాజాగా నవంబర్ 21న మరోసారి ఇలాంటి సమస్యలే తలెత్తాయి. తమ ప్రాథమిక డేటా సెంటర్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలే ఇందుకు కారణమంటూ సంస్థ వివరణ ఇచ్చినప్పటికీ.. బ్యాంక్‌పై కస్టమర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ తాజా చర్యలు ప్రకటించింది. కొన్నాళ్లుగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆన్లైన్ మాధ్యమం వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో పాటు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ సహా పలు బ్యాంకులు ఇలాంటి సాంకేతిక సమస్యలే ఎదుర్కొంటున్నాయి. దీనితో ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2 శాతం క్షీణించి రూ. 1,377 వద్ద క్లోజయ్యింది. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ సుమారు రూ. 16,056 కోట్లు కరిగిపోయి రూ. 7,58,287 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో 7.36 లక్షలు, ఎన్ఎస్ఈలో 1.89 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఎస్బీఐ యోనో యాప్ డౌన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆన్లైన్ సర్వీసుల్లో కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తరహాలోనే సమస్యలు తలెత్తుతున్నాయి. సిస్టమ్ వైఫల్యం కారణంగా తమ యోనో మొబైల్ యాప్ సర్వీసుల్లో అంతరాయం కలిగినట్లు ఎస్బీఐ గురువారం వెల్లడించింది. సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈలోగా లావాదేవీల కోసం నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ యాప్‌ను వినియోగించాలని కస్టమర్లను కోరింది. అటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) డిజిటల్ సేవల్లో కూడా అంతరాయం ఏర్పడింది. ఇటీవల విలీనం చేసుకున్న బ్యాంకుల ఐటీ ఇన్ఫ్రాను అనుసంధానం చేసే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని బ్యాంకు వర్గాలు తెలిపాయి. -
గ్రామీణ మహిళలకు డిజిటల్ నైపుణ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రామీణ మహిళల ఉపాధికి అవసరమైన డిజిటల్ నైపుణ్యం కల్పించేందుకు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నడుం బిగించింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో (ఎన్ఎస్డీసీ) చేతులు కలిపింది. ఇందులో భాగంగా 10 నెలల్లో దేశవ్యాప్తంగా ఒక లక్ష మంది మహిళలకు డిజిటల్ నైపుణ్యం కల్పిస్తారు. డిజిటల్ అక్షరాస్యత, ఉపాధికి అవసరమైన నైపుణ్యం పెంపు, స్వయం ఉపాధి, సమాచార నైపుణ్యం వంటి అంశాల్లో 70 గంటలకుపైగా కోర్సు కంటెంట్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ కమ్యూనిటీ ట్రైనింగ్ వేదికగా ఆన్లైన్లో లైవ్ క్లాసులు నిర్వహిస్తారు. తొలిసారి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న, అలాగే కోవిడ్–19 కారణంగా ఉపాధి కోల్పోయిన గ్రామీణ యువతులు, మహిళలకు అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు. స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా ఒక లక్ష మంది యువతకు డిజిటల్ నైపుణ్యం కల్పించేందుకు ఇప్పటికే ఇరు సంస్థలు చేతులు కలిపాయి. కాగా, ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా 20,000 మంది యువతులను ఎంపిక చేసి ఎస్ఎస్డీసీ ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. -
ఇంట్లోనే చదువు!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ప్రభావంతో విద్యాసంస్థలను మూసివేసిన కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పాఠాలు, ఆన్లైన్ చదువులు అందించేందుకు ఆదేశాలు జారీ చేసింది. అధ్యాపకులంతా వర్క్ ఫ్రమ్ హోం చేయడంతోపాటు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీలు, పాఠశాలల విద్యార్థులకు అవసరమైన బోధనను ఆన్లైన్ ద్వారా అందించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) కార్యదర్శి అమిత్‌ఖరే ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యనందించే యూనివర్సిటీలు సహా ఇతర విద్యాసంస్థలన్నీ ఆన్లైన్ బాటపట్టాలని కేంద్రం సూచించింది. అన్ని విద్యాసంస్థలకు వర్తింపు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, ఎంహెచ్ఆర్డీ పరిధిలోని, వాటికి అనుబంధంగా ఉన్న విద్యాసంస్థలు ఈ నెల 31 వరకు వర్క్ ఫ్రమ్ హోంతోపాటు డిజిటల్, ఆన్లైన్ పాఠాలు అందించేలా చర్యలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. అధ్యాపకులు, టీచర్లు ఆన్లైన్ కంటెంట్, ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ మూల్యాంకనం అభివృద్ధి చేయాలని పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం, తదుపరి సెమిస్టర్ లెస్సన్ ప్లాన్స్, బోధన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, క్వశ్చన్ బ్యాంక్స్ రూపొందించాలని తెలిపింది. ఆన్లైన్లో వేలల్లో పుస్తకాలు ఎంహెచ్ఆర్డీ రూపొందించిన దీక్ష, ఈ–పాఠశాల వంటి ఆన్లైన్ వ్యవస్థలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కేంద్రం పేర్కొంది. సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ 1 నుంచి 12వ తరగతి వరకు రూపొందించిన 80 వేల పుస్తకాలు దీక్ష పోర్టల్లోనూ, ఈ–పాఠశాలలో 2 వేలకుపైగా ఆడియో, వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. వీలుంటే ఇళ్లకు వెళ్లిపోండి హాస్టళ్లలో ఉండే విద్యార్థులు వీలైనంత వరకు ఇళ్లకు వెళ్లిపోవాలని ఎంహెచ్ఆర్డీ స్పష్టంచేసింది. యూనివర్సిటీ హాస్టళ్లలో ఉండే విదేశీ విద్యార్థులతోపాటు ఇళ్లకు వెళ్లని విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గుంపులుగా ఉండకుండా, హాస్టల్ గదుల్లోనే ఉండాలని, హాస్టళ్లలో హై శానిటైజేషన్ చర్యలు చేపట్టాలని వెల్లడించింది. -
లీకేజీకి డిజిటల్ ప్రశ్న పత్రాలతో చెక్
న్యూఢిల్లీ: ప్రశ్న పత్రాల లీకేజీ ఇటీవలి కాలంలో పెద్ద సమస్యగా పరిణమించింది. హైస్కూలు స్థాయి నుంచి ఎంసెట్ వంటి ప్రవేశపరీక్షలు, పోటీ పరీక్షల వరకు ప్రశ్న పత్రాలు ముందుగానే బయటకు రావడం, దాంతో ఆ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం సంబంధిత విభాగాలకు తలనొప్పిగా మారింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఈ ఏడాది నిర్వహించిన పది, పన్నెండు తరగతులకు సంబంధించిన గణితం, ఎకనామిక్స్ ప్రశ్న పత్రాలు లీకవడంతో ఆ పరీక్షలను మళ్లీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమస్యను అధిగమించడం కోసం సీబీఎస్ఈ మైక్రోసాఫ్ట్‌తో కలిసి డిజిటల్ ప్రశ్న పత్రాలను రూపొందించే ప్రక్రియను అభివృద్ధి చేసింది. మూడు నెలల్లో ఈ డిజిటల్ ప్రశ్నపత్రం తయారవడం విశేషం. పరీక్షకు ముందే ప్రశ్న పత్రం బయటకు తేవడానికి వీల్లేని విధంగా,ఒకవేళ తెచ్చిన ఏ సెంటర్ నుంచి తెచ్చారో వెంటనే తెలిసిపోయే విధంగా ఈ డిజిటల్ ప్రశ్న పత్రాన్ని రూపొందించారు.గత జులైలో సీబీఎస్ఈ ప్రయోగాత్మకంగా 487 కేంద్రాల్లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను ఈ డిజిటల్ ప్రశ్న పత్రాలతో విజయవంతంగా నిర్వహించింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ పది,పన్నెండో తరగతుల పరీక్షలన్నింటినీ ఈ డిజిటల్ విధానంలోనే నిర్వహిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. అమలు చేసేదిలా.. విండోస్10, ఆఫీస్ 365లలో ఉన్న సాఫ్ట్వేర్ ఆధారంగా ఈ డిజిటల్ ప్రశ్నపత్రాలను రూపొందించారు. మొత్తం డిజిటల్ ప్రశ్న పత్రాలన్నీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పర్యవేక్షణలో ఉంటాయి. అక్కడ నుంచే వివిధ పరీక్షా కేంద్రాలకు డౌన్లోడ్ అవుతాయి. ఈ ప్రశ్న పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధిత పరీక్షా కేంద్రం అధికారి రెండు రకాల ధ్రువీకరణలను ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీ ద్వారా లేదా బయోమెట్రిక్ ద్వారా ఆ అధికారి తన గుర్తింపును ధ్రువీకరించాలి. ఆధార్ ద్వారా కూడా ఈ పని చేయవచ్చు. గుర్తింపు పొందిన అధికారికి కంట్రోలర్ ప్రశ్న పత్రాలను ఈ–మెయిల్ ద్వారా పంపుతారు. కంట్రోలర్ పంపే కోడ్ సహాయంతో పరీక్షా కేంద్రం అధికారి ప్రశ్న పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. తర్వాత అవసరమైనన్ని కాపీలు ముద్రించి అభ్యర్ధులకు అందజేస్తారు. ఇదంతా పరీక్ష ప్రారంభం కావడానికి కేవలం అరగంట ముందు మాత్రమే జరుగుతుంది. పరీక్షా కేంద్రాల వారీగా డిజిటల్ ప్రశ్న పత్రాలపై వేర్వేరు వాటర్ మార్క్‌లను ముద్రిస్తారు. దానివల్ల ఒకవేళ ప్రశ్నపత్రం లీకయితే అది ఏ సెంటర్లో జరిగిందో వెంటనే తెలుసుకోవచ్చు. ఈ డిజిటల్ ప్రశ్నపత్రాల కోసం ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యుత్, కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్లు తప్పనిసరిగా ఉండాలి. కరెంటు లేని చోట జనరేటర్లను ఏర్పాటు చేయాలని, ఇంటర్నెట్ సదుపాయం లేని కేంద్రాలకు సీడీలను పంపాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. -
రాష్ట్రంలో అత్యాధునిక పాలన!
సాక్షి, హైదరాబాద్: పరిపాలనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వేగంగా, పారదర్శకంగా పాలన సాగించేందుకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ డిజిటల్ (ఈడీ) పరిపాలనను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని ప్రభుత్వ వ్యవహారాలను ఆన్లైన్లో అనుసంధానించడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. ప్రజల ఫిర్యాదులను స్వీకరించే ప్రజావాణి నుంచి ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతి వరకు అన్నింటినీ హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి పరిశీలించి అవసరమైన సూచనలు చేసేలా కొత్త వ్యవస్థ ఏర్పాటు కానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సూచనలకు అనుగుణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ పనులు చేస్తోంది. ఫైబర్ గ్రిడ్ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రాగానే గ్రామస్థాయి నుంచి ప్రత్యక్షంగా అన్ని పర్యవేక్షించే వీలు కలుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు క్షేత్రస్థాయి స్థితిగతులను హైదరాబాద్ నుంచి ప్రత్యక్షంగా పరిశీలించేలా సచివాలయంలో, ప్రగతిభవన్‌లో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో కొత్త వ్యవస్థను అమల్లోకి తెస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ జరిగినా ముఖ్యమంత్రి, సీఎస్ కార్యాలయాల్లో ప్రత్యక్షంగా చూసేలా డిజిటల్ స్క్రీన్లు ఉంటాయి. హైదరాబాద్‌లోని కార్యాలయాల నుంచే అవసరమైన సూచనలు చేయొచ్చు. వీడియో కాన్ఫరెన్స్‌కు మించి.. వేగంగా నిర్ణయాలను అమలు చేసేందుకు వీలుగా ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అధికారిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దారు కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ ఇప్పటికే ఉంది. ఎలక్ట్రానిక్ డిజిటల్ వ్యవస్థ దీని కంటే ఇంకా మెరుగ్గా ఉండనుంది. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ ఉన్న ప్రదేశం నుంచే మాట్లాడుకునే అవకాశముంది. అయితే ఈడీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు. దీని సాయంతో అధికారులు ఎక్కడున్నా శాటిలైట్ వీడియో నెట్‌వర్క్‌ను వినియోగించొచ్చు. ప్రతి అధికారికి ప్రభుత్వం మొబైల్ నంబర్‌ను కేటాయిస్తుంది. అధికారులు స్మార్ట్ ఫోన్ సాయంతో వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం కల్పిస్తారు. దీనిపై అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పిస్తారు. జిల్లాల అభివృద్ధిపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిర్వహించే సమీక్షలను ఉన్నతస్థాయి అధికారులు నేరుగా పరిశీలించి వెంటనే నిర్ణయాలు తీసుకునేలా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
డిజిటల్ ప్రక్రియను వేగవంతం చేయాలి
రాయికల్(జగిత్యాల): పట్టాదారు పాస్‌బుక్‌లను జారీ చేసేందుకు డిజిటల్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీవో నరేందర్ అన్నారు. రాయికల్‌లోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రైతులంతా తమ పట్టాదారు పాస్‌బుక్‌లను ఆధార్‌తో అనుసంధాన ప్రక్రియ దాదాపు పూర్తయిందని, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోందని తెలిపారు. రైతులు తమ ఆధార్‌ను పట్టాదారు పాస్‌బుక్‌లకు అనుసంధానం చేయకపోతే వెంటనే వీఆర్వోలకు అందించాలని కోరారు. తద్వారానే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతాయని పేర్కొన్నారు. తమ భూములను సర్వే చేయించాలని దావన్‌పల్లి గ్రామస్తులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ హన్మంతరెడ్డి ఉన్నారు. -
ఐటీ @10 లక్షల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం దూకుడుగా ముందుకెళుతోంది. వార్షికాదాయం ఏకంగా రూ.10 లక్షల కోట్లను మించిపోయింది. ఎగుమతుల్లో 24 శాతం వాటాతో దేశానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతోంది. దేశంలో ఐటీ రంగం పురోగతిపై ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్)’రూపొందించిన నివేదికను మంగళవారం ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వేదికపై విడుదల చేసింది. దేశ ఐటీ రంగం 2015–16లో 143 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.28 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించగా.. 2016–17లో 154 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.98 లక్షల కోట్లు)కు పెంచుకుందని నాస్కామ్ తెలిపింది. ఇది 2017–18లో 167 బిలియన్ డాలర్ల (10.8 లక్షల కోట్లు)కు పెరుగుతుందని అంచనా వేసింది. డిజిటల్, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, బీపీఎం వంటి ప్రధాన సేవలు సహా మొత్తంగా ఐటీ రంగానికి ఈ ఆదాయం సమకూరిందని తెలిపింది. లక్షకుపైగా కొత్త ఉద్యోగాలు వచ్చాయని పేర్కొంది. 2017–18లో ఐటీ రంగ వృద్ధి సూచీలివీ.. - విదేశీ ఎగుమతుల ఆదాయంలో 13 బిలియన్ డాలర్ల (7.8 శాతం) వృద్ధి. - ఐటీ ఉత్పత్తుల ఆదాయంలో 20 శాతం (22–25 బిలియన్ డాలర్ల మేర) వృద్ధి. ఏటా 30 శాతం వృద్ధి రేటు నమోదు. - ఈ–కామర్స్‌లో 17 శాతం వృద్ధి. ఆన్లైన్లో హోటల్ బుకింగ్, కిరాణా సరుకులు, ఆహార కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్. - దేశీయంగా సాంకేతిక సేవల వినియోగంలో 10 శాతానికి పైగా పెరుగుదల. ఇవీ ప్రతికూల పరిస్థితులు - స్వదేశీ వస్తు రక్షణ విధానం (ప్రొటెక్షనిజం), బ్రెగ్జిట్, కార్మికుల వలస సమస్యలతో ఐటీ రంగంపై ప్రభావం. - అమెరికా పన్నుల సంస్కరణలతో అస్థిరత - అమెరికా బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వృద్ధి క్షీణత - స్మార్ట్ సిటీలు, ప్రొక్యూర్మెంట్ సంస్కరణలు వంటి ప్రభుత్వ డిజిటల్ కార్యక్రమాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉండటం. - సరైన సాంకేతిక పరిజ్ఞానం లేక ఈ–కామర్స్ రంగం కేవలం ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకే పరిమితం కావడం. కొత్త శకంలో ఐటీ రంగం - దేశంలో స్టార్టప్ ఐటీ పరిశ్రమలు 5,200. - 2017లో కొత్తగా ఏర్పాటైన ఐటీ స్టార్టప్‌లు 1000కిపైగానే.. - స్టార్టప్‌ల విలువ 4000 కోట్ల డాలర్లు (సుమారు రూ. 2.59 లక్షల కోట్లు) - దేశంలో ఈ–కామర్స్ విలువ 3,850 కోట్ల డాలర్లు (సుమారురూ.2.49 లక్షల కోట్లు). ఈ రంగంలో ఏటా 17 శాతం వృద్ధి.. 700 కోట్ల డాలర్ల (సుమారు రూ.45 వేల కోట్లు) ఆదాయం. పెట్టుబడులు 180 శాతం పెరిగాయి. - డిజిటల్ చెల్లింపులు 14,500 కోట్ల డాలర్లు (సుమారు రూ.9.41 లక్షల కోట్లు). ఇది జీడీపీలో 6 శాతం - మొబైల్ వ్యాలెట్ చెల్లింపులు రూ.53,200 కోట్ల నుంచి రూ.79,300 కోట్లకు పెరిగాయి. - 90 శాతానికి పైగా భారతీయ ఐటీ పరిశ్రమలు విదేశాల్లో విక్రయాలు జరుపుతున్నాయి. - 50 శాతానికిపైగా ఐటీ పరిశ్రమలు తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)ను వినియోగిస్తున్నాయి. - దేశంలో 700కిపైగా ఐటీ స్టార్టప్‌లు 25–30 శాతం వృద్ధి సాధించాయి. - హెల్త్ టెక్, ఫైనాన్షియల్ టెక్ రంగాలు, కృత్రిమ మేధస్సు, బ్లాక్ చైన్ సాంకేతికత శరవేగంగా వృద్ధి సాధిస్తున్నాయి. వేళ్లూనుకుంటున్న డిజిటల్ వ్యవస్థ - ప్రపంచవ్యాప్తంగా 320 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులుండగా.. దేశంలో 46.5 కోట్ల మంది ఉన్నారు. దేశంలో ఇంటర్నెట్ వినియోగం 8 శాతం వృద్ధి సాధించింది. - ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 330 కోట్లుకాగా.. దేశంలో 30 కోట్లకుపైగా ఉన్నారు. 2020 నాటికి 80 కోట్లకు చేరుతారని అంచనా. - దేశంలో మొబైల్ డేటా వినియోగం గత ఏడాదిన్నరలో ఏడు రెట్లు పెరిగింది. స్థానిక భాషల్లో డేటా వినియోగం 10 రెట్లు పెరిగింది. ప్రతి నెలా 22.5 కోట్ల మంది యూట్యూబ్‌లో వీడియోలు వీక్షిస్తున్నారు. గూగుల్ ప్లే నుంచి యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది. -
డిజిటల్ టీటీడీ
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) ధార్మిక సంస్థ డిజిటల్ వ్యవస్థలోకి మారుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యంతోపాటు పరిపాలన పరంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తూ సేవల్ని మరింత విసృతం చేస్తోంది. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటోంది. సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు చేరువైన టీటీడీ సౌకర్యాలు.. ♦ ఆన్లైన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో సౌకర్యాలు సులభతరం అయ్యాయి. ఇంటెర్నెట్ ద్వారా ఇంటి వద్ద నుండే భక్తులు టీటీడీలోని అన్ని సౌకర్యాలు సులభంగా పొందుతున్నారు. ♦ తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో 20 నుండి 40శాతం ఇంటెర్నెట్ అడ్వాన్స్ రిజర్వేషన్ ద్వారా కేటాయిస్తున్నారు. ♦ 2010లో కరెంట్ బుకింగ్‌తో ప్రారంభించిన రూ.300 శీఘ్రదర్శన టికెట్లను 2013 నుండి పూర్తి స్థాయి ఆన్లైన్ పద్ధతి ద్వారా కేటాయిస్తున్నారు. రద్దీని బట్టి 15వేల నుండి 25వేలవరకు టికెట్లు కేటాయిస్తున్నారు. ♦ టీటీడీ పరిధిలో మొత్తం 9 ట్రస్టులు, ఒక స్కీము ఉంది. రూ.లక్ష నుండి రూ.కోట్లలో విరాళాలు సమర్పించిన సుమారు 47 వేల మంది దాతల వివరాలు పూర్తిస్థాయిలో డిజిటల్ చేశారు. ఈ పాస్‌బుక్ కింద దాతలకు శ్రీవారి దర్శనం, తిరుమలలో బస సౌకర్యాలన్నీ ఆన్లైన్లో ముందస్తుగా రిజర్వు చేసుకునే అవకాశం కలిగింది. ♦ తిరుమల శ్రీవారు కూడా స్టాక్ మార్కెట్లో వాటాదారుగా చేరారు. స్టాక్ హోల్డింగ్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్)లో శ్రీవేంకటేశ్వర స్వామివారి పేరుతో డీమ్యాట్ ఖాతా తెరిచారు. దీనిద్వారా భక్తులు షేర్లను సర్టిఫికెట్ల రూపంలో హుండీలో సమర్పిస్తుంటారు. ♦ రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత తిరుమలకు వచ్చే భక్తుల ద్వారా డిజిటల్ చెల్లింపుల్ని టీటీడీ పెంచింది. గదులు, దర్శన టికెట్ల కేంద్రాల్లో ఇప్పటికే పీవోఎస్ యంత్రాలు అమర్చి నగదు రహిత వ్యవహారాలు చేయిస్తున్నారు. ♦ టీటీడీ ముద్రించిన ఆథ్యాత్మి, ధార్మిక, సాహిత్య పరమైన ప్రచురణలు సుమారు 2500కిపైగా డిజిటల్ చేశారు. భక్తులు సులభంగా, ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్యాప్తోనూ అందుబాటులో అన్ని సౌకర్యాలు చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు శ్రీవారి రూ.300 దర్శనం, అన్ని రకాల ఆర్జిత సేవలు, గదుల బుకింగ్ చేసుకోవచ్చు. ఇక హుండీకి కూడా సెల్ఫోన్ద్వారానే కానుకలు బదలాయించ వచ్చు. ఒకే అప్లికేషన్ ద్వారానే టీటీడీ పద్దులు రూ.2858 కోట్ల (2017–2018) బడ్జెట్‌తో కూడిన ధార్మిక సంస్థలో పద్దుల వ్యవహారాలు కీలకం. వీటిని కూడా టీటీడీ టీసీఎస్ సంస్థ సాయంతో డిజిటల్ చేసింది. ఫలితంగా పద్దుల నిర్వహణలో బాధ్యత, భద్రత పెరిగింది. ఈ–ఫైలింగ్‌కు శ్రీకారం చుట్టిన టీటీడీ సుమారు 90 విభాగాధిపతుల అధీనంలోని అన్ని వ్యవహారాలను ఈ–ఫైలింగ్ చేయాలని సంకల్పించారు. ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ కంప్యూటర్ విభాగం పరిధిలో దేవస్థానంలోని ఐదు విభాగాలు ఈ–ఫైలింగ్‌లో నడుస్తున్నాయి. కొత్తగా మరో 12 విభాగాల్లోనూ శ్రీకారం చుట్టారు. 2018 మార్చినాటికి ఈ–ఫైలింగ్ వ్యవస్థ పూర్తి చేయాలనే లక్ష్యంతో టీటీడీ ఉంది. తెలుగు, కన్నడలో టీటీడీ వెబ్సైట్లు, త్వరలో తమిళం, హిందీలోనూ.. శ్రీవారి దర్శనం దేశ విదేశాల నుండి భక్తులు వస్తుంటారు. టీటీడీ సమాచారం, కల్పిస్తున్న సౌకర్యాలన్నీ భక్తులందరికీ చేరువయ్యేలా తాజా సమాచారాన్ని దేవస్థానం వెబ్సైట్లలో పొందుపరుస్తున్నారు. వీటిని రీజినల్ భాషల్లోనూ ప్రవేశ పెట్టారు. ఇటీవల తెలుగు, కన్నడ వెర్షన్లో ప్రారంభించారు. త్వరలో తమిళం, హిందీలోనూ ప్రారంభించనున్నారు. ఈ– వ్యవస్థతో మరింత పారదర్శకత శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుమలలో బస, దర్శనం, ఈ హుండీ, ఈ–డొనేషన్ వంటివి ఇంటి నుండి సులభంగా పొందే చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దీనివల్ల నగదు వ్యవహారాల్లో పారదర్శకత మరింత పెరిగిందన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ ద్వారా భక్తులు సులభంగా టీటీడీ సదుపాయాలు పొందే ఏర్పాట్లు చేశామన్నారు. పరిపాలన పరంగా ఈఫైలింగ్, ఈఆర్పీ వ్యవస్థను మరింత పక్కాగా అమలు చేస్తామన్నారు. – టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ -
ఇదీ జీ‘వనం’..!
సీతంపేట: అంతా హైటెక్. అన్నీ టెక్నాలజీతోనే. వేలి ముద్రలు, కంటి చూపుతో రేషను, పింఛన్లు ఇస్తున్న సర్కారుకు ఇక్కడి బతుకులు పట్టడం లేదు. నిత్యం సాంకేతిక మంత్రం జపిస్తున్న అధికార పార్టీ నాయకులను ఇక్కడి చావులు కూడా కదిలించడం లేదు. డిజిటల్ వ్యవస్థ విశ్వరూపం చూపిస్తున్న పరిస్థితుల్లో జిల్లాలోని 300 ఏజెన్సీ గ్రామాలు కనీసం ఫోన్ కాల్‌కు నోచుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు పది నుంచి 20 కిలోమీటర్ల దూరం వచ్చి ప్రయత్నిస్తే గానీ 108కు సమాచారం అందించలేరంటే నమ్మాల్సిందే. సీతంపేట చుట్టుపక్కల.. సీతంపేట ఏజెన్సీలో సుమారు 24 పంచాయతీల్లో 500కుపైగా గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 300 గ్రామాల ప్రజలు నిత్యం బతుకు యుద్ధం చేస్తున్నారు. దాదాపు సగం గ్రామాల్లో పూర్తిగా నెట్వర్క్ సేవలు లేవు. సెల్‌ఫోన్ వంటి సౌకర్యం లేకపోవడంతో దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులు, స్నేహితులు, మైదాన ప్రాంతాల్లో చదువుతున్న తమ పిల్ల లతో మాట్లాడడానికి గిరిజనులకు వీల్లేకుండా పోతోంది. అత్యవసర సమయాల్లో గర్భిణు లు, రోగులను సీతంపేట, పాలకొండ, వీరఘట్టం, కొత్తూరు తదితర ప్రాంతాల ఆస్పత్రులకు తరలించాలన్నా ఇబ్బందే. నెట్వర్క్ లేకపోవడంతో 108కు కూడా వీరు ఫోన్ చేయలేకపోతున్నారు. రాత్రిపూట ఎక్కడో సిగ్నల్ ఉన్న ప్రాం తానికి వచ్చి ఫోన్ చేయాల్సి వస్తోందని గిరిజనులు చెబుతున్నారు. ఈ లోగా ఇబ్బం దులు పడాల్సి వస్తోంది. పింఛన్‌దారుల పాట్లు అయితే వర్ణాణాతీతం, వికలాంగులు, వృద్ధు లు, వితంతువుల వేలి ముద్రలు పడాలి.. కానీ నెట్వర్క్ పనిచేయక వీరికి ప్రతి నెలా ఇబ్బం దులు తప్పడం లేదు. 20 నుంచి 25 కిలో మీటర్ల దూరంలో నెట్వర్క్ ఉన్న చోటకు కొండలపై నడుచుకుంటూ వచ్చి పింఛన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మైదాన ప్రాంతాలకు రావాలంటే పల్లెవెలుగు బస్సుల సౌకర్యం అరకొరగా ఉండడంతో ప్రైవేటు వాహనాలపైనే గిరిజనులు ఆధారపడుతున్నారు. కమ్యూనికేషన్ కరువు మండలంలోని దోనుబాయి, పుబ్బాడ, దారపాడు, సామరెల్లి, పుబ్బాడ, కిల్లాడ, కుడ్డపల్లి, టిటుకుపాయి పంచాయితీల పరిధిలో పూర్తిగా కమ్యూనికేషన్ లేదు. దోనుబాయిలో బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ ఉన్నా సాంకేతిక పరమైన లో పాలు ఉండడంతో టవర్‌ను ప్రారంభించలేదు. పూతికవలస, కొండాడ, శంబాం, హడ్డుబంగి, కోడిశ, కుశిమి, పులిపుట్టి, హడ్డుబంగి పంచాయతీల పరిధిలోని కొన్ని గ్రామాల్లో అరకొర సమాచార వ్యవస్థతో ప్రజలు నెట్టుకొస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కళావతి ఎంత కృషి చేస్తున్నా సర్కారు సహకారం లేకపోవడంతో వీరి బతుకులు బాగు పడడం లేదు. ఈ గ్రామాల్లో కనీసం బ్యాంకులు అందుబాటులో లేవు. మహిళా సంఘాలు, రైతులు, ఇతరులు బ్యాంకు పనిమీద సీతంపేటకు రావాల్సిందే. గతంలో దోనుబాయిలో ఆంధ్రాబ్యాం కు ఉండేది. దాన్ని ఎత్తివేశారు. బ్యాంకు పనుల కోసం సీతంపేటలో ఉన్న బ్యాంకులకు రావాల్సి వస్తోందని గిరిజనులు చెబుతున్నారు. దోనుబాయి, పొల్ల ప్రాంతంలో ఒక బ్యాంకు ఏర్పాటు చేస్తే సమస్యలు తీరుతాయని కోరుతున్నారు. పట్టించుకోవడం లేదు ఇన్ని సమస్యలు ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ముం దుగా కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తే బా గుంటుంది. ఎక్కడకు వెళ్లాలన్నా రవాణా వ్యవస్థ కూడా అరకొరగా ఉంది. మా పంచాయతీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. – గేదెల కోటేశ్వరరావు, దోనుబాయి సర్పంచ్ -
ఇక స్పష్టంగా ఇంటి నెంబర్లు
► డిజిటల్ సిస్టమ్‌కు శ్రీకారం ► లొకాలిటీ తెలిసేలా జాగ్రత్తలు ► అక్షరాలు, అంకెలు కలిసి మొత్తం 8 డిజిట్లు ► కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ లేనివారి కోసం టోల్‌ఫ్రీ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో ఇళ్ల నెంబర్లను కనుక్కోవడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో ఇప్పటికే పలు కథలు..విమర్శలు ప్రచారంలో ఉండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటి నెంబర్ల గజిబిజికి స్వస్తి చెప్పేందుకు జీహెచ్ఎంసీ అధికారులు తీవ్ర కసరత్తు చేశారు. ఇప్పటికే రెండుమూడు రకాల ప్రణాళికలు రూపొందించి, కొంతమేర పనులు కూడా చేశారు. ఒక దశలో లొకాలిటీ, వీధి నెంబరు, ఇంటినెంబర్లతోనే సులభంగా కనుక్కునేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రెండు సర్కిళ్లలో ఇంటినెంబర్ల ప్లేట్లు కూడా బిగించారు. అనంతరం, మారుతున్న ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా జిప్పర్ కోడ్‌ను అమలు చేయాలని భావించారు. గగన్‌మహల్‌లో ప్రయోగాత్మకంగా దానిని ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా అటు డిజిటల్‌గా ఉండేలా, ఇటు డిజిటల్ వినియోగం తెలియని వారికి సైతం తెలిసేలా ఉభయతారకంగా కొత్త విధానాన్ని అమలు చేయాలని భావించారు. ఈ కొత్త విధానం ద్వారా ఆన్లైన్ సదుపాయం కలిగిన వారు ఏ చిరునామాను కనుక్కోవాలన్నా తాము ఎక్కడ ఉన్నది తెలియజేస్తే చాలు ఎక్కడి నుంచి ఎటు వెళ్లాలి.. రమారమి ఎంత దూరం ఉంటుంది.. ఎంత సమయంలో చేరుకోవచ్చు వంటి వివరాలను గూగుల్‌మ్యాప్స్ తరహాలో ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. దీంతోపాటు జీఐఎస్ నేవిగేషన్ కూడా ఉంటుంది. కంప్యూటర్లో కానీ, స్మార్ట్‌ఫోన్‌లో కానీ సంబంధిత చిరునామాను ఎంటర్ చేస్తే ఈ వివరాలు తెలుస్తాయి. ఈ పరిజ్ఞానం లేని వారిని కూడా దృష్టిలో ఉంచుకొని టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా కూడా సేవలందించాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు తాము వెళ్లాల్సిన చిరునామా తెలియజేస్తే ఫోన్లో సవివరంగా తెలియజేస్తారు. తద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. కేవలం అంకెలే కాకుండా ప్రధాన రహదారి, సెగ్మెంట్ తెలిసేలా పొడి అక్షరాలు కూడా ఉండటంతో లొకాలిటీ కూడా తెలుస్తుంది. చాలామందికి నగరంలోని ఆయా ప్రాంతాల పేర్లు తప్ప, స్ట్రీట్నెంబర్లు, రోడ్ నెంబర్లు తెలియవు. ఈ విధానం ద్వారా అందరికీ ఉపయుక్తంగా బాగుంటుందని భావిస్తున్నారు. కొత్త ఇంటినెంబర్లకు సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత వచ్చేందుకు దాదాపు నెలరోజులు పడుతుందని, స్పష్టత రాగానే పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్‌రెడ్డి తెలిపారు. గ్రేటర్లో ప్రజా సదుపాయాలైన పబ్లిక్ టాయ్లెట్లు, బస్షెల్టర్లు, ఇంటినెంబర్లపై తగిన సహకారమందించాల్సిందిగా మంత్రి కేటీఆర్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా( అస్కి)ని కోరిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఇంటినెంబర్లకు సంబంధించి వారితో చర్చించారు. ఈ విధానం అన్ని రకాలుగా బాగుంటుందనే అభిప్రాయాలు వెలువడటంతో దీన్ని ఖరారు చేశారు. ఈ విధానంలో నగరంలో ప్రతి వందమీటర్ల దూరాన్ని ఒక సెగ్మెంట్‌గా గుర్తిస్తారు. మొత్తం ఎనిమిది డిజిట్లలో ఉండే ఇంటి చిరునామాలో ప్రతి రెండు డిజిట్లు దిగువ వివరాల్ని తెలుపుతాయి. మొదటి రెండు డిజిట్లు : ప్రధాన రహదారి పేరు పొడి అక్షరాల్లో తర్వాతి రెండు డిజిట్లు : సెగ్మెంట్ పేరు పొడి అక్షరాల్లో మలి రెండు డిజిట్లు : భవనం/ అపార్ట్మెంట్ నెంబరు చివరి రెండు డిజిట్లు : యూనిట్ (ఇంటి) నెంబరు – ఇండిపెండెంట్ ఇళ్ల చిరునామాలో భవనం/అపార్ట్మెంట్ స్థానంలో జీరోలుగా పేర్కొంటారు.