సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో వ్యవసా య శాఖ చేపట్టిన పంటల నమోదు ప్రక్రియ తర హాలో దేశవ్యాప్తంగా డిజటల్ సర్వేకు కేంద్ర ప్రభు త్వం సన్నాహాలు మొదలుపెట్టింది. అన్ని రాష్ట్రాల్లో పంటల నమోదును ఒకేరీతిన పక్కాగా చేపట్టేందుకు సరికొత్త యాప్‌ను రూపొందించి, ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏ సర్వే నంబర్‌లో, ఏ రైతు, ఎంత విస్తీ ర్ణంలో ఏ పంట సాగు చేశారన్న కచి్చతమైన వివరాలను ఫొటోలతో సహా నిక్షిప్తం చేయనున్నారు.
12 రాష్ట్రాల్లో ఒక్కో గ్రామం చొప్పున
ప్రస్తుత ఖరీఫ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 12 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద పంటల డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పీఓసీ) కింద నమూనా సర్వే కోసం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. మనరాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా వెంకటాపూర్ గ్రామం ఎంపికైంది. ఈ మేరకు ఇటీవల నలుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఆ గ్రామంలో పర్యటించి నమూనా సర్వే నిర్వహించింది. టెక్నికల్ బృందం సీనియర్ మేనేజర్ సరిత, రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్ నుంచి డీడీ గోవింద్, శైలజ, జేడీఏ విజయగౌరితో పాటు డీఏఓ వెంకటేష్ తదితరులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో అనుసంధానం
ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం స్థానిక వ్యవసాయాధికారులతో కలసి వెంకటాపూర్‌లోని పంట పొలాల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించింది. కేంద్రం ప్రభుత్వం రూపొందించిన అప్లికేషన్ ప్రకారం.. భూరికార్డులకు అనుగుణంగా రైతులు వేసిన పంటలను ఫొటోలు తీశారు. ఏ సర్వే నంబర్‌లో ఏ రైతుకు ఎంత భూమి ఉంది, ఎక్కడ ఉంది, ఆ రైతులు ఏ పంటలు వేశారనే సమాచారాన్ని ఫొటోలతో సహా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో అనుసంధానం చేశారు. ఇలా ఈ ఖరీఫ్‌లోపు 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 20శాతం గ్రామాల్లో సర్వే పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు.
రైతులకు ప్రయోజనకరంగా..
తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో పంటలను నమోదు చేసిన యాప్, నిక్షిప్తం చేసిన వివరాలు, వాటి క్రోడీకరణను పూర్తిస్థాయిలో పరిశీలించనున్నారు. లోటుపాట్లేమైనా ఉంటే సరిదిద్ది అవసరమైన మార్పు చేర్పులు చేస్తారు. తర్వాత ఈ యాప్‌ను అన్ని రాష్ట్రాలు నేరుగా వినియోగించుకోవచ్చని.. ఇదివరకే పంటల నమోదు చేస్తున్న రాష్ట్రాల్లో యాప్‌లో మార్పులు, చేర్పులు చేసుకుని వాడుకునే అవకాశం ఉందని కేంద్రం బృందం వెల్లడించింది. గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు పంటల సర్వే పక్కాగా జరగాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని.. దీని ద్వారా రైతులకు నేరుగా, పారదర్శకంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో నష్టపరిహారం, బీమా, రాయితీపై ఎరువుల సరఫరా వంటివాటికి ఈ యాప్ తోడ్పడుతుందని వివరించింది.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌లో సీట్ల కేటాయింపుపై సస్పెన్స్..
Comments
Please login to add a commentAdd a comment