సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. కేంద్రం గవర్నర్ వ్యవçస్థతో అణచివేతకు పాల్పడుతోందని, ప్రభుత్వాలను కూలదోసే ప్రయత్నాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ గవర్నర్ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం సిగ్గుచేటని, గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు.
మహబూబ్‌నగర్‌లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాటా్లడారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని, అధికారం ఉందని కేంద్రం అడ్డదారులు తొక్కడం సమంజసం కాదన్నారు. బీజేపీకి చెక్ పెట్టడమే ధ్యేయంగా ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు దేశవ్యాప్తంగా ప్రజల వద్దకు సీపీఐ పేరుతో లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష పార్టీలతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు చాడ వెల్లడించారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రంలో సీపీఐ సమరశంఖం పూరిస్తుందని చాడ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment