CPI National Council
-
గవర్నర్ వ్యవస్థతో అణచివేతకు పాల్పడుతున్న కేంద్రం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. కేంద్రం గవర్నర్ వ్యవçస్థతో అణచివేతకు పాల్పడుతోందని, ప్రభుత్వాలను కూలదోసే ప్రయత్నాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ గవర్నర్ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం సిగ్గుచేటని, గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు. మహబూబ్‌నగర్‌లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాటా్లడారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని, అధికారం ఉందని కేంద్రం అడ్డదారులు తొక్కడం సమంజసం కాదన్నారు. బీజేపీకి చెక్ పెట్టడమే ధ్యేయంగా ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు దేశవ్యాప్తంగా ప్రజల వద్దకు సీపీఐ పేరుతో లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష పార్టీలతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు చాడ వెల్లడించారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రంలో సీపీఐ సమరశంఖం పూరిస్తుందని చాడ హెచ్చరించారు. -
బీజేపీ, టీఆర్ఎస్లకు నార్కో టెస్టులు చేయాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలనే అంశంలో బీజేపీ, టీఆర్ఎస్లకు చిత్తశుద్ధి లేదని, ఈ విషయంలో ఆ రెండు పార్టీలకు నార్కో పరీక్షలు చేయించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషాతో కలసి హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో బుధవారం మీడియాతో నారాయణ మాట్లాడారు. విజయవాడలో జాతీయ మహాసభ అక్టోబర్ 3 నుంచి 4 వరకు ఢిల్లీలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించనున్నట్లు నారాయణ తెలిపారు. జాతీయ మహాసభను విజయవాడలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మోదీకి పరిపాలించే నైతిక హక్కు లేదని, మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 19 రాజకీయ పార్టీలు ఈ నెల 27న భారత్ బంద్ చేపడుతున్నాయన్నారు. -
టీఆర్ఎస్ నుంచి నాకు ప్రాణహాని ఉంది
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తనకు భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అధికార టీఆర్ఎస్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. తనకు గతంలో ఉన్న 1+1 భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపే అవకాశముంది. నా భర్తకు ప్రాణహాని హైకోర్టును ఆశ్రయించిన న్యూడెమోక్రసీ నేత మధు భార్య పద్మ సాక్షి, హైదరాబాద్: పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న తన భర్త సీపీఐ–ఎంఎల్ (న్యూడెమోక్రసీ) ప్రాంతీయ కార్యదర్శి ఎ.నారాయణస్వామి అలియాస్ మధుకు ప్రాణహాని ఉందని, వెంటనే కోర్టులో హాజరుపరిచేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన భార్య పద్మ హైకోర్టును ఆశ్రయించారు. పద్మ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ విషయంపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. -
మీడియాపై దాడులను నిరసిస్తూ ధర్నా
విజయవాడ (గాంధీనగర్) : సమాచార, ప్రసార మాధ్యమాలపై మోదీ ప్రభుత్వం చేస్తున్న దాడులను నిరసిస్తూ సీపీఐ (ఎంఎల్ ) లిబరేషన్ ఆధ్వర్యంలో బుధవారం లెనిన్‌సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. న్యూస్‌చానళ్లు, పత్రికలపై నిషేధం ఎత్తివేయాలని, వాక్ స్వాతంత్య్రంపై దాడులు ఆపాలని నినాదాలు చేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్.మూర్తి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వ మార్కు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించేవారిపై దాడులు జరుగుతున్నాయని, ప్రజలు అభద్రతభావంతో బతుకుతున్నారని పేర్కొన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వం సాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్న మీడియాపై, విలేకరులు, యాజమాన్యాలపై కేసులు బనాయిస్తున్నారన్నారు. రాష్ట్ర కార్యదర్శి బి.బంగార్రాజు, సభ్యులు హరినాథ్, గోడుగు సత్యనారాయణ, ఆర్.నాగమణి, ఎం.కుమారి, ప్రసాద్ పాల్గొన్నారు. -
నల్లధనం వెలికితీతలో విఫలం
సీపీఐ జాతీయ సమితి సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి మడికొండ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నల్లధనాన్ని వెలికితీస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మడికొండలో బుధవారం జరిగిన పార్టీ మహాసభలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోదీ జన్‌ధన్ పేరుతో జీరో ఖాతాలను తెరిపించి పేదలను మోసం చేస్తున్నారని, బడా పెట్టుబడిదారులకు, కోట్ల రూపాయల పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కార్యదర్శి టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో మోyì ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలలో ఏ ఒక్కటి అమలు పరచలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుంచి పీజీ విద్యపై కేసీఆర్ చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయని విమర్శించారు. సీపీఐ గ్రామశాఖ కార్యదర్శి మాలోతు శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు మేకల రవి, గోలి రాజిరెడ్డి, మద్దెల ఎల్లేష్, మడ్డి రాజారాం, సమ్మయ్య, నర్సింగం, మద్దెల వెంకటస్వామి, మణెమ్మ, రజిత, జ్యోతి, రమ్య, వెంకటేష్ పాల్గొన్నారు. -
పొరుగుదేశంలో రాజకీయ సంక్షోభం
ఖాట్మాండు: పొరుగుదేశం నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నేపాల్ సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక భాగస్వామి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) మద్దతు ఉపసంహరించుకుంది. మంత్రి పదవుల నుంచి వైదొలగాల్సిందిగా తమ పార్టీ నేతలను ఆదేశించింది. సీపీఎన్ (ఎంసీ) చైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ మంగళవారం ఈ మేరకు ప్రకటించారు. దీంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి ప్రభుత్వం మైనార్టీలో పడింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్), సీపీఎన్ (ఎంసీ) కూటమి తరపున తొమ్మిది నెలల క్రితం నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఒలి బాధ్యతలు చేపట్టారు. సంకీర్ణ కూటమిలో సీపీఎన్ (ఎంసీ) రెండో పెద్ద పార్టీ. కాగా గత మేలో కుదుర్చుకున్న తొమ్మిది అంశాలతో కూడిన ఒప్పందాన్ని అమలు చేయనందుకు నిరసనగా సీపీఎన్ (ఎంసీ) ఒలి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకుంది. -
కన్హయ్య భద్రతపై సీపీఐ ఆందోళన
పట్నా/ముంబై/న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యను చంపితే, నాలుకను కొస్తే బహుమతులు ఇస్తామన్న వార్తల నేపథ్యంలో అతని భద్రతపై సీపీఐ ఆందోళన వ్యక్తం చేసింది. జేఎన్‌యూలో కన్హయ్య భద్రంగా ఉన్నా, బయటకొస్తే ప్రాణభయం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్జీత్ కౌర్ పట్నాలో విలేకరులతో చెప్పారు. కేంద్రంలో బీజేపీ పాలన హిట్లర్ నియంతృత్వాన్ని గుర్తుకుతెచ్చేలా ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు హిందూత్వ అజెండాను అమలు చేసేందుకే జాతీయవాదంపై చర్చ లేవనెత్తుతున్నాయని విమర్శించారు. ఇదిలావుంటే.. కన్హయ్యపై రాజద్రోహ నేరాన్ని తప్పుపడుతూ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షులు ముందుకొచ్చారు. వర్సిటీని దేశ వ్యతిరేక నిలయంగా చిత్రీకరించే ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తామని మాజీ అధ్యక్షులైన సుచేత డే, రోహిత్ , అశుతోష్ కుమార్ తదితరులు అన్నారు. కాగా.. వర్సిటీలో ఫిబ్రవరి 9 నాటి సమావేశానికి అనుమతి రద్దుపై కన్హయ్య అభ్యంతరం తెలిపాడని ఉన్నత స్థాయి కమిటీకి రిజిస్ట్రార్ భూపిందర్ జుట్షీ తెలిపారు. ఏబీవీపీ ప్రోద్బలంతో వేధిస్తున్నారు అలహాబాద్: ఏబీవీపీ ప్రోద్బలంతో అలహాబాద్ యూనివర్సిటీ అధికారులు తనను వేధిస్తున్నారని వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు రిచాసింగ్ ఆరోపించటంతో మరో వివాదం రాజుకుంది. -
'ఈ దేశం ఎవడబ్బ సొత్తు?'
- నిజమైన దేశ భక్తులం మేమే - బి.జె.పి కార్పొరేట్ల కోసం పని చేసే పార్టీ - దేశాన్ని కాషాయీకరణ చేయడమే భాజపా లక్ష్యం - వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థులను జాతి ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు - సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ధ్వజం హైదరాబాద్ : 'ఈ దేశం ఎవడబ్బ సొత్తు.. స్వాతంత్ర పోరాటం చేసింది మా పార్టీయే, తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగం చేశారు, నిజమైన దేశ భక్తులం మేమే' అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయం మఖ్దూమ్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. బ్రిటిష్ తొత్తులను పార్టీలో చేర్చుకున్న చరిత్ర బీజేపీదని విమర్శించారు. స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఎన్నడైనా పాల్గొందా అని ప్రశ్నించారు. జర్మనీ నియంత హిట్లర్ స్వస్తిక్ గుర్తుతో సంఘ పరివార్ పని చేస్తోంది. ప్రధాని తన ప్రభుత్వాన్ని దింపడానికి కుట్రలు చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోదీ చాయ్ వాలా కాదు..చాయ్ హోటల్ యజమాని కొడుకు అని చెప్పారు. బీజేపీ కార్పొరేట్ల కోసం పని చేసే పార్టీ, వీరికి రూ.10 లక్షల కోట్లు లబ్ధి చేకూర్చారని విమర్శించారు. అస్సాంలో కుట్ర చేసి ప్రభుత్వాన్ని దింపింది బీజేపీయేనని, మత పరమైన విభజనతో అధికారంలోకి వచ్చి దేశాన్ని కాషాయీకరణ చేస్తోందని సురవరం ఆరోపించారు. జేఎన్‌యూలో జాతి వ్యతిరేక వ్యాఖ్యల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారన్నారు. జేఎన్‌యూ విద్యార్థులను మొత్తం జాతి ద్రోహులుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని, బీజేపీ మరో ఐదేళ్లు అధికారంలో ఉండాలంటే ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని హితవు పలికారు. 30 శాతం ఓట్లు తెచ్చుకుని 70 శాతం ప్రజల మీద స్వారీ చేయాలంటే కుదరదని స్పష్టం చేశారు. మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామన్నారు. 10 నుంచి 11 బహిష్కృత విద్యార్థి సంఘాల నేతలు చేసిన నినాదాలు వామపక్ష విద్యార్థుల మీద రుద్దడం దారుణమన్నారు. సమాచార కమిషనర్‌గా పదోన్నతి పొందడం కోసమే ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టి సర్కార్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మా పార్టీ విద్యార్థి సంఘం నేతలు బయట తిరగలేని అభద్రతా వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించిందన్నారు. అఫ్జల్ గురు సంతాప సభ కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాలు నిర్వహించలేదని తెలిపారు. నినాదాలు చేసినవారు ఎవరో సర్కారు గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. మరాఠాలు, జాట్లు, కాపులకు రిజర్వేషన్ల కోసం డిమాండ్లు వస్తున్నాయి. ఉద్యోగ, విద్యా విధానాల్లో సర్కారు సరైన అవకాశాలు కల్పించకపోవడం వల్లనే ఇలాంటి డిమాండ్లు పుట్టుకొస్తున్నాయని ఆయన విమర్శించారు. -
'ఎన్కౌంటర్ల పేరుతో తుదముట్టించడమే టీఆర్ఎస్ ఎజెండా'
తొర్రూరు: వరంగల్ జిల్లాలోని తడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి, అజ్ఞాతనేత కామ్రేడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కామ్రేడ్ శృతి, విద్యాసాగర్‌రెడ్డిలను ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపడాన్ని న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నక్సలైట్ల ఏజెండానే మా ఏజెండా అని ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారై ఎంపీ కవిత అనేకసార్లు ప్రకటించిందన్నారు. నక్సలైట్లను బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో తుదముట్టించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ఏజెండానా అని ప్రశ్నించారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులు రాకుండా బూటకపు ఎన్కౌంటర్లతో బంగారు తెలంగాణ ఏలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పౌర హక్కుల గురించి మాట్లాడిన కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత పౌర హక్కులను హరించేవిధంగా పని చేయాడం దుర్మార్గమన్నారు. -
నరేంద్రమోదీ ఆత్మగా వెంకయ్య
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే నారాయణ సూళ్లూరుపేట : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మగా కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే నారాయణ ఆరోపించారు. గురువారం సాయంత్రం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా రాకపోవడానికి ఈ ఇద్దరు నాయుళ్లే కారణమన్నారు. వీరిద్దరికీ చిత్తశుద్ధి ఉంటే టీడీపీ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలన్నారు. అదేవిధంగా వెంకయ్యనాయుడు తన మంత్రి పదవిని వదులుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోడీ భిక్షాందేహి అని అడుక్కుంటూ రాష్ట్ర ప్రజలను సిగ్గుతో తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో సుమారు గంటపాటు మాట్లాడిన వెంకయ్య నాయుడుకు పదవి రాగానే నోరు పడిపోయిందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అంటిపెట్టుకుని ఉన్న చంద్రబాబునాయుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆనాడు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ కాపాడితే ఇప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారన్నారు. అందుకే ప్రత్యేక హోదా కోసం సీపీఐ పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పారు. వీరిద్దరిలో ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే తాము చేసే పోరాటానికి మద్దతివ్వాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మతోన్మాద పరిపాలన చేస్తున్నారని, చివరకు న్యాయవ్యవస్థను సైతం శాసిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసు నుంచి బయటకు వస్తే ఆమెను ప్రధానమంత్రి అభినందించడం చూస్తుంటే ఆయన న్యాయవ్యవస్థను ఏ విధంగా శాసిస్తున్నారో అర్థమవుతుందన్నారు. స్థానిక నాయకులు మోదుగుల పార్థసారథి, రమణయ్య, ఆనంద్, సుధాకర్ పాల్గొన్నారు. -
ఎర్రపూల సౌరభం
♦ ఘనంగా ప్రారంభమైన సీపీఎం 21వ మహాసభలు ♦ ఆతిరథులతో కళకళాలడిన పోర్టు స్టేడియం ♦ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మండిపాటు ఉద్యమాల పురిట గడ్డ మరోసారి ఎరుపెక్కింది... అభ్యుదయ, విప్లవ సాహిత్యాలు మొగ్గతొడిగిన నేలపై మరోసారి ఎర్రపూలు పూశాయి... ప్రజాపోరాటలకు వేదికైన విశాఖ యవనిక మీద ఎర్రదండు కదం తొక్కింది.... విప్లవోద్యమాలకు లాల్‌సలాం చేస్తూ విశాఖపట్నంలో సీపీఎం 21వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజనానంతరం నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఓ పార్టీ జాతీయమహాసభలకు ఆతిథ్యం ఇస్తుండటంతో విశాఖ అందరి దృష్టిని ఆకర్షించింది. వర్తమాన రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కసరత్తు చేస్తున్న సీపీఎం జాతీయ మహాసభలు కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ జాతీయ మహాసభలను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందుకోసం కొన్ని నెలలుగా సన్నాహాలు చేస్తూ వచ్చింది. మహాసభలను ఘనంగా ప్రారభించింది. వీటికి వామపక్ష పార్టీల కీలక నేతలు, సీపీఎం ప్రతినిధుల రాకతో విశాఖలోని పోర్టు కళావాణి ఇండోర్ స్టేడియం కళకళలాడింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిళ్లై, సీతారాం ఏచూరి, బిమల్ బోస్, మాణిక్‌సర్కార్, బృందా కారత్, బీవీరాఘవులు, పి.విజయన్, కె.వరదరాజన్, కె.బాలకృష్ణన్, ఎం.ఎ.బేబీ, సూర్యకాంత్ మిశ్రా, ఏకే పద్మనాభన్ తదితర ప్రముఖులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖలో పోర్టు కళావాణి ఆడిటోరియంలో మంగళవారం సీపీఎం జాతీయ మహాసభల ప్రారంభసూచికగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. సీనియర్ కార్మికోద్యమనేత మహ్మద్ అమీన్ జెండాను ఆవిష్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం అక్కడే స్థూపం వద్ద మృతవీరులకు నివాళులు అర్పించారు. కనుమూసిన వీరులారా... మీ త్యాగం వృథాపోదు’అని ప్రజానాట్యమండలి కళాకారులు గేయాలతో విప్లవజోహార్లు అర్పించారు. కార్మికోద్యమ నేత సమన్ ముఖర్జీ, మిల్లు కార్మికుల ఉద్యమ నేత ఎన్.వరదరాజన్, స్వాతంత్య్ర సమరయోథుడు, కార్మికోద్యమ నేత ఆర్.ఉమాపతి, నేతాజీ ఆజాద్హింద్ఫౌజ్ కెప్టెన్ లక్ష్మీసెహగల్, ఐద్వా మాజీ అధ్యక్షురాలు శ్యామిలీ గుప్తా, గోవా విముక్తి ఉద్యమ నేత కేఎల్ బజాజ్ తదితరులకు విప్లవజోహార్లు అర్పించారు. బీజేపీ, టీడీపీ విధానాలను మండిపాటు వర్తమాన రాజకీయ పరిణామాలపై లోతైన చర్చకు పోర్టుకళావాణి ఇండోర్ స్టేడియం వేదికైంది. సీపీఎంతోసహా వామపక్ష పార్టీల నేతలు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై వక్తలు మండిపడ్డారు. రైతులు, సామాన్యులను కొల్లగొట్టి కార్పొరేట్పెద్దలకు ప్రయోజనం కలిగిస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రకాష్ కారత్, సూరవరం సుధాకర్‌రెడ్డి, కవితా కృష్ణన్, బిమల్ బోస్, పి.మధు తదితరులు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల కార్పోరేట్ అనుకూల విధానాలను ఎండగట్టారు. భూసేకరణ ఆర్డినెన్స్, రాష్ట్ర ప్రభుత్వ ల్యాండ్‌బ్యాంక్ విధానాలను దుయ్యబట్టారు. కార్పొరేట్ పెద్దలకు భూపందేరం కోసమే రాష్ట్రంలో ఏకంగా 75వేల ఎకరాలతోల్యాండ్బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయించారని విమర్శించారు. సీపీఎంతోసహా వామపక్ష పార్టీలన్నీ ఏకతాటి మీదకు రావల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విశాఖ ఉద్యమస్ఫూర్తికి జోహార్ విశాఖపట్నంతోసహా ఉత్తరాంధ్ర విప్లవోద్యమ స్ఫూర్తిని సీపీఎం మహాసభలు ప్రతిఫలించాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారత్ తన ప్రసంగంలో విశాఖపట్నం విప్లవోద్యమ చరిత్రను ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్టీల్‌ప్లాంట్, హిందుస్థాన్ షిప్‌యార్డ్, బీహెచ్ఈఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు వందలాది చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు ఉన్న విశాఖ కార్మికోద్యమాలకు వేదికగా నిలుస్తోంది. కార్మిక పక్షాలు ఏకమై విజయవంతంగా ఉద్యమాలు నడిపిన చరిత్ర విశాఖకు ఉంది. మరోసారి అలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఏర్పడింది’అని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కూడా తన ప్రసంగంలో అల్లూరి మన్యం పోరాటం, శ్రీకాకుళం రైతాంగ పోరాటాలను ప్రస్తుతించారు. గురజాడ, గిడుగు, రావిశాస్త్రి, శ్రీశ్రీ తదితరుల అభ్యుదయ, విప్లవ రచనలు ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయని ప్రస్తుతించారు. సీపీఎం మహాసభల సందర్భంగా నిర్వహించిన కళాప్రదర్శలను ఆద్యంతం ఆకట్టుకున్నాయి. -
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం
పుదుచ్ఛేరి: సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు గురుదాస్ గుప్తా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పుదుచ్చేరిలో జరుగుతున్న సీపీఐ 22వ జాతీయ సమావేశాల్లో భాగంగా ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి, జాతీయ కార్యదర్శి వర్గం సహా పలు కమిటీలను ఎన్నుకున్నట్లు పార్టీ జాతీయ కౌన్సిల్ కార్యదర్శి షమీమ్ ఫైజీ తెలిపారు. డి.రాజా, షమీమ్ ఫౌజీ, అమర్ జీత్ కౌర్, అతుల్ కుమార్ అంజాన్, రామేంద్రకుమార్, పన్నియన్ రవీంద్రన్, డాక్టర్ కె.నారాయణ తదితరులకు జాతీయ కార్యదర్శివర్గంలో చోటు దక్కింది. రెండోసారి జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన సురవరం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంపై పోరు కొనసాగిస్తామన్నారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మే 15న దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. సమాజంలోని అట్టడుగు వర్గాల్లో కమ్యూనిస్ట్ పార్టీలకు చిరకాలం స్థానముంటుందని అన్నారు. -
వర్గ పోరాటాలు చేస్తాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలోసీపీఐ సారథి సురవరం సంక్షోభంలో ఉన్నా ఎదుగుతాం మతతత్వ శక్తుల ఆట కట్టిస్తాం అటడుగు వర్గాల సమస్యలే ప్రధానం రేపటి నుంచి సీపీఐ జాతీయ మహాసభలు సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయ ముఖ చిత్రంలో వచ్చిన అనూహ్య మార్పులతోపాటు ఆర్థిక, సామాజిక అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను స్వీకరిస్తున్నట్టు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. పాలకుల అండతో పేట్రేగిపోతున్న హిందూ మతోన్మాద శక్తుల ఆట కట్టించడం వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతోనే సాధ్యమవుతుందన్నారు. స్థానిక అవసరాలు, సమస్యలే ప్రాతిపదికగా వర్గ పోరు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. పార్టీ 22వ జాతీయ మహాసభలు బుధవారం నుంచి పుదుచ్ఛేరిలో నిర్వహిస్తున్న సందర్భంగా సురవరం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. వాస్తవాల్ని ప్రజలకు వివరించలేకే... వామపక్షాల్లో సంక్షోభం నిజమే. ఇది తాత్కాలికమే. తప్పు చేయడం క్షమాపణలు చెప్పుకోవడం అలవాటేననడంలో వాస్తవం లేదు. ఎన్నికల్లో గెలుపోటముల్ని, ప్రజా ఉద్యమాలను ఒకే గాటన కట్టలేం. ప్రాంతీయ పార్టీలతో, బూర్జువా పార్టీలతో పొత్తులనేవి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సహజం. పొత్తుల వెనకున్న వాస్తవాన్ని ప్రజలకు వివరించడంలో విఫలమయ్యాం. బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక రచయితలు, మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయి. గతానికి భిన్నంగా పాలకవర్గాలే హిందూత్వ శక్తులకు అండగా నిలుస్తున్నాయి. 17, 18వ శతాబ్దాల నాటి భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. దీన్ని నిలువరించకపోతే రచయితలకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సే విగ్రహాలు వాడవాడలా వెలుస్తాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. కమ్యూనిస్టుల పునరేకీకరణే లక్ష్యం.. కమ్యూనిస్టులు చీలిన నాటికి, నేటికీ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. విభేదాలు తగ్గిపోయాయి. ఐక్య కార్యాచరణ పెరిగింది. కొందరి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ప్రజాభీష్టానికి అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణకు సీపీఐ కృషి చేస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. కానీ రాజకీయ అవసరం, కీలకాంశం. అందుకే ప్రజల ముందుంచాం. రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది గనుకే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. భూ సేకరణ చట్ట సవరణ ఆర్డినెన్స్‌పై గళం విప్పిందే లెఫ్ట్. రైతులకు ఎలా లబ్ధి చేకూరుతుందో చెప్పడానికి బదులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అబద్ధాలు చెబుతున్నారు. గ్రామీణ పరిశ్రమలు వేరు, గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలు పెట్టడం వేరు. రైతులకు పరిహారం ఇవ్వడం చట్టంలో భాగమే. ప్రభుత్వానికి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే లాభాల్లో వాటా ఇప్పించేలా చూడాలి. అది చెప్పడానికి బదులు మోదీ ఇతర రాజకీయ పక్షాలపై అహంకారపూరిత దాడి చేస్తున్నారు. సంక్షోభాలు చాలా చూశాం.. నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో మా పార్టీలోనూ పెత్తందారి ధోరణి, ముఠాతత్వం, అహంకారం ప్రబలాయి. వీటిని కప్పిపుచ్చుకునేందుకు కొందరు తెలివిగా సైద్ధాంతిక, రాజకీయ ఎత్తుగడలను వాడుకుంటున్నారు. వీటిని ఇకపై సహించం. పార్టీలోకి చొరబడే అన్యవర్గ ధోరణులు, క్రమశిక్షణా రాహిత్యంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. దేశంలో కమ్యూనిస్టుల పనైపోయినట్టు, ఇక తిరిగి పుంజుకోవడం అసాధ్యమన్నట్టు కొందరు మాట్లాడుతున్నారు. ఇలాంటి సంక్షోభాలు చాలా చూశాం. కోటి ఆశలు, కొత్త ఆకాంక్షలతో పార్టీని తిరిగి నిర్మిస్తాం. అట్టడగు వర్గాల సమస్యలే ప్రాతిపదికగా పని చేస్తాం. స్థానిక సమస్యలపై పోరా డుతాం. వర్గ పోరాటాలు చేస్తాం. సొంత కాళ్లపై ఎదుగుతాం. మేం ఎదిగినప్పుడే మిగతా పార్టీలు మా మాట వింటాయి. అంతర్మథనంతో పార్టీకి దశాదిశ నిర్దేశించేలా 22వ జాతీయ మహాసభల్ని నిర్వహిస్తాం. ప్రజాసమస్యలకు పరిష్కార మార్గాల ను అన్వేషించడమే ఈ మహాసభల లక్ష్యం. -
పింజ తక్కువట.. తేమ ఎక్కువట!
పత్తిరైతు చిత్తు మే వరకూ మార్కెట్లకుపత్తి వచ్చే అవకాశం మార్చి రెండో వారం నాటికే కొనుగోళ్లు నిలిపివేసిన సీసీఐ సీసీఐ కేంద్రాల మూతతో వ్యాపారుల ఇష్టారాజ్యం క్వింటాల్‌కు రూ. 400 వరకూ తగ్గింపు పత్తిరైతు నిలువునా దోపిడికీ గురవుతున్నాడు.. మార్కెట్ మాయాజాలంలో ఘోరంగా ఓడిపోతున్నాడు.. కొనుగోళ్లు చేసినంతకాలం ఏదో ఒక నిబంధన పేరుతో రైతులకు చుక్కలు చూపిన సీసీఐ.. మార్కెట్‌కు పత్తి రావడం ఇంకా ఆగిపోకముందే దుకాణం కట్టేసింది.. వ్యాపారులు, దళారులకు తలుపులు బార్లా తెరిచి, రైతన్న నోట మట్టి కొట్టేసింది. ఇదే అదనుగా వ్యాపారులు దగా దందా మొదలుపెట్టేశారు. క్వింటాల్ పత్తికి రూ. ఐదారు వందల వరకూ తక్కువ చెల్లిస్తూ నిలువునా దోపిడీ చేస్తున్నారు. దిక్కుతోచని రైతులు ఆవేదనలో మునిగిపోతున్నారు. కన్నీళ్లతోనే వచ్చినకాడికి అమ్ముకుంటున్నారు. - సాక్షి, హైదరాబాద్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో... రాష్ట్రంలో పత్తి ధరలు భారీగా పడిపోయాయి. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,050 కాగా.. వ్యాపారులు రూ. 3,600 నుంచి రూ. 3,700కు మించి చెల్లించడం లేదు. తక్కువ ధర వస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సాధారణంగా రైతులు మే నెల వరకు పత్తి విక్రయాలు చేస్తూనే ఉంటారు. ఈ లెక్కన కనీసం ఏప్రిల్ 15వ తేదీ వరకైనా సీసీఐ కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి మార్చిలోనే సీసీఐ కేంద్రాలను ఎత్తివేయడం.. అసలే కరువుతో అల్లాడుతున్న రైతులకు శరాఘాతంగా మారింది. సింహభాగం పత్తిదే రాష్ట్రంలో పత్తిసాగు అధికం. ఈ ఖరీఫ్‌లో 8.173 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా.. పత్తిని ఏకంగా 16.763 లక్షల హెక్టార్లలో సాగుచేశారు. ఖరీఫ్‌లో ఆహారధాన్యాల సాగు 83 శాతానికి తగ్గగా... పత్తి సాగు 109 శాతానికి పెరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పత్తిసాగు ఎక్కువ. సాధారణంగా పత్తి ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాలి. కానీ వర్షాలు సరిగా కురవక.. పత్తి దిగుబడి 3 నుంచి 7 క్వింటాళ్లకు పడిపోయింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 35 లక్షల టన్నుల వరకు పత్తిని రైతులు విక్రయించారు. మరో 10 లక్షల టన్నుల వరకు పత్తిని నిల్వ ఉంచారు. గత సీజన్లో ఇలా నిల్వ ఉంచిన రైతులకు కనీస మద్దతు ధరకు మించి క్వింటాల్‌కు రూ. 5,200 వరకు ధర పలికింది. ఈ సారి కూడా అలా జరుగుతుందని ఆశించారు. కానీ వారి ఆశలపై సీసీఐ నీళ్లు చల్లుతూ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసింది. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడంతో ధరలు తగ్గాయంటూ వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా రైతులు తమ పత్తిని మహారాష్ట్రకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. పింజ పొడవు సాకు.. రైతులు పత్తి తీతను దాదాపు పూర్తిచేశారు. కానీ ధర ఎక్కువ వస్తుందన్న ఆశతో నిలువ ఉంచారు. కానీ పింజ పొడవు తక్కువగా ఉం దని పేర్కొంటూ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా పింజ పొడవు 29.5 మిల్లీమీటర్ల నుంచి 30.5 మిల్లీమీటర్ల వరకు ఉన్న పత్తికి పూర్తిస్థాయి ధర చెల్లిస్తారు. కానీ పత్తి తీత పూర్తయిన తర్వాత వస్తున్న సరుకుకావడంతో... పూర్తి నాణ్యంగా ఉన్నా కూడా పింజ పొడవు తక్కువ ఉందం టూ వ్యాపారులు సాకులు చెబుతున్నారు. దీని కి తోడు తేమ శాతం పేరిట తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఈ విషయంలో సీసీఐ వ్యాపారుల తో కుమ్మక్కు అయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగానే కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసిందనే వాదన వినిపిస్తోంది. మేమేమీ ఆదేశాలు ఇవ్వలేదు ‘‘సీసీఐ కొనుగోలు కేంద్రాలను నిలిపివేయాలని మేం ఆదేశాలు ఇవ్వలేదు. సీసీఐ నేరుగా అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు. ఈ విషయం నాకు తెలియదు.’’ - ప్రియదర్శిని, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ -
అంత భూమి ఎవరికోసం బాబూ?
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు నిలదీత * కొత్త రాజధానికి 1,561 ఎకరాలు చాలు * మిగతాది క్విడ్ ప్రోకో కోసమా? సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమి అవసరం లేదని, కేవలం 1,561 ఎకరాలు సరిపోతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణం జరుగుతుందని సీఎం చెబుతున్నారని, ఆ లెక్కన 1,561 ఎకరాలు చాలన్నారు. సింగపూర్, జపాన్ దేశాలకు వత్తాసు పలుకుతూ అక్కడి పారిశ్రామికవేత్తల చంకల్లో ఉన్న ఇక్కడి పెద్దమనుషులకు ఉపయోగపడేలా చంద్రబాబు భూమిని సేకరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మూడు రోజులుగా ఇక్కడ జరుగుతున్న సీపీఎం కేంద్రకమిటీ సమావేశాల ముగింపు సందర్భంగా రాఘవులు బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజధానికి సరిపోగా మిగతా భూమిని క్విడ్ ప్రోకో(బదులుకు బదులుగా) కింద రియల్టర్లకు కట్టబెట్టేందుకే అంత భూమి సేకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. భూ సమీకరణకు తమ పార్టీ వ్యతిరేకమని, భూ సేకరణ చట్టం ప్రకారమే సేకరించాలని స్పష్టం చేశారు. నిరంకుశ పద్ధతిలో సారవంతమైన భూముల్ని లాగేసుకుంటామంటే సహించబోమని హెచ్చరించారు. పిల్లల్ని కనాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాఘవులు ఎద్దేవా చేశారు. ‘‘తన హయాంలో జనాభాను 1.3 శాతం మేరకు తగ్గించగలిగానని మీసాలు మెలేసుకుని చెప్పుకున్న బాబుకు ముందు చూపు పోయి వెనకచూపు వచ్చినట్టుంది. సంతానాన్ని తగ్గించినందుకు తనను ప్రపంచ బ్యాంకు ప్రశంసించిందని ఘనంగా చెప్పుకున్న పెద్దమనిషి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారో మరి! పిల్లల్ని కనాలా వద్దా అనేది వ్యక్తులకు,భార్యాభర్తలకు వదలండి.. అందు లో సీఎం జోక్యం అక్కర్లేదు’’ అని రాఘవులు అన్నారు. ‘‘జార్జ్ బుష్(అమెరికా మాజీ అధ్యక్షుడు)ను, ఉల్ఫెన్సన్(ప్రపంచ బ్యాంకు మాజీ అధ్యక్షుడు)ను రప్పించి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకువెళతామన్నారు? వాళ్లు వచ్చినప్పుడు వార్లు పోసి కాళ్లకు మొక్కి భజన్లు చేశారు.. చివరకు ఏమైంది? వచ్చినవాళ్లు దోచుకుపోయారు. ఇప్పుడు ఒబామా వస్తున్నదీ అందుకే..’’ అని ఆయన అన్నారు. ఉద్యమాల ప్రాతిపదికనే ఫ్రంట్లు.. విశాఖలో జరిగే పార్టీ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టే రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని కేంద్ర కమిటీ ఆమోదించినట్టు రాఘవులు తెలిపారు. గతంలో తాము పెట్టిన ఫ్రంట్లు ఎన్నికలకే పరిమితమయ్యేవని, ఇకపై పోరాటాలు, ఉద్యమాల ప్రాతిపదికన ఫ్రంట్లుంటాయని స్పష్టం చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలతోపాటు మతతత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాల్లో తమతో కలిసి వచ్చేవారితోనే జట్టు కడతామని, ఎన్నికల్లోనూ ఇదే పద్ధతి అనుసరిస్తామని తెలిపారు. ‘‘బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ముంచుకొచ్చింది. హిందూమతోన్మాదులతో ఏకీభవించని వారిని అణచివేసే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. వీటిపై పోరాడాల్సి ఉంది. అందుకోసం సీపీఎంగా మేము బలపడాల్సి ఉంది’’ అని ఆయన అన్నారు. -
న్యూడెమోక్రసీ సభ్యుల అరెస్ట్
-
11 మంది సీపిఐఎమ్‌ఎల్ న్యూడెమోక్రసీ సభ్యుల అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం పడమర రేగులకుంటలో 11 మంది సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జల్లేరు వాగు వద్ద సమావేశమయ్యారనే సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరి నుంచి 8 తుపాకులు,బుల్లెట్లు ,మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు చంద్రన్న ,అశోక్ వర్గాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిని జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
నల్లధనాన్ని స్వాధీనం చేసుకోవాలి
సీపీఐ జాతీయ కార్యవర్గం డిమాండ్ ఆ ధనాన్ని పేదరిక నిర్మూలనకు వినియోగించాలి నల్లధనాన్ని దాచినవారి పేర్లు తెలుసుకునే హక్కు ప్రజలకుంది హైదరాబాద్: నల్లధనాన్ని స్వాధీనం చేసుకుని, దేశంలో పేదరిక నిర్మూలనకు దానిని ఉపయోగించాలని సీపీఐ జాతీయ కార్యవర్గం డిమాండ్చేసింది. విదేశాల్లో అక్రమ ఖాతాలున్న వారితో పాటు, వీరినుంచి నిధులు అందుకుంటున్న రాజకీయపార్టీలపై కఠినచర్యలు తీసుకోవాలని పేర్కొంది. సీపీఐ రెండురోజుల జాతీయ కార్యవర్గభేటీ బుధవారం మఖ్దూంభవన్‌లో ప్రారంభమైంది, విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్న వారందరి పేర్లను తెలుసుకునే హక్కు దేశప్రజలకు ఉందని ఈ సమావేశం పేర్కొంది. ఈ అంశంపై విచారణను నిర్వహించి ఈ సంపదను విదేశాలకు ఎలా తరలించారు, ఎందుకు వినియోగించారన్న దానిని తేల్చాలని డిమాండ్‌చేస్తూ తీర్మానాన్ని ఆమోదించినట్లు సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నల్లధనం విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న వైఖరిని ఆహ్వానిస్తూ, విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచిన వారందరి పేర్లు, వివరాలను బయటపెట్టేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని తీర్మానంలో సీపీఐ కోరింది. కేవలం సిట్ విచారణ జరుపుతున్న కేసులకు పరిమితం కాకుండా మొత్తం సమాచారాన్ని ప్రజలకు వెల్లడించాలని కోరింది. తాజాగా కేంద్రం బయటపెట్టిన మూడుపేర్లలో ఒకరు బీజేపీ, కాంగ్రెస్‌లకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన వ్యక్తి అని తెలిపింది. యూపీఏ-2 బాటలోనే బీజేపీ ప్రభుత్వం నడుస్తోందని, నల్లధనం ఉన్న వారి పేర్లను బయటపెడితే అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించినట్లు అవుతుందంటూ పాతపాటే పాడుతోందని సీపీఐ ధ్వజమెత్తింది. నల్లధనం మొత్తాన్ని తీసుకురావాల్సిందే ‘‘విదేశీ బ్యాంకుల్లో ఉన్న మొత్తం నల్లధనాన్ని దేశానికి తీసుకురావాల్సిందే. నల్ల కుబేరుల జాబితాను పూర్తిగా బయటపెట్టాలి. ఎన్డీఏ వైఫల్యాలు, వామపక్షాల ఐక్యత తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నాం’’. - సురవరం సుధాకర్‌రెడ్డి తిమింగలాలను వదిలి చిన్నచేపల పేర్లా? ‘‘ఎన్నికలకు ముందు నల్లధనాన్ని వందరోజుల్లో తీసుకొస్తామని చెప్పిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తిమింగలాలను వదిలి చిన్న చేపల పేర్లను ప్రకటించింది. 750 మందికి పైగా ఉన్న నల్లకుబేరుల వివరాలను పూర్తిగా వెల్లడించాలి. దేశ రాజకీయాలు, విధానాలను కార్పొరేట్లు, సంఘ్పరివార్శక్తులు శాసిస్తున్నాయి’’. - సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా బూర్జువా పార్టీలకు ఇక దూరం కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు కారణంగా తెలంగాణలో పార్టీకి కలిగిన నష్టాన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గం అభిప్రాయపడింది. బూర్జువా పార్టీలతో పొత్తు వల్ల వామపక్షాలకు రాజకీయంగా నష్టం జరిగినందున ఇకపై ఈ పార్టీలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. జార్ఖండ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో 13 కంటె ఎక్కువ సీట్లలో, జమ్మూకాశ్మీర్‌లో 3 సీట్లలో పోటీచేయాలని సీపీఐ నిర్ణయించింది. గురువారం ఈ భేటీ ముగియనుంది. -
జయకు టాటా!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి సీపీఎం, సీపీఐలు పయనించాయి. అన్నాడీఎంకే సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టినా, తాము మాత్రం ఆ కూటమిలోనే ఉన్నామని వామపక్షాలు చాటుకుంటూ వచ్చా యి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను అన్నాడీఎంకే పక్కన పెట్టినా, ఎన్నికల కూటమిలోనే ఉన్నట్టు ప్రకటించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి కూట మిగా ఎదుర్కొనున్నామని ప్రకటిస్తూ వచ్చిన సీపీఎం, సీపీఐ నేతలకు చివరకు మిగిలింది భంగపాటే. సీపీఎం, సీపీఐల జాతీయ నేతలు పోమెస్ గార్డెన్ మెట్లు ఎక్కి కూటమిని ఖరారు చేసుకు వెళ్లారు.అయితే,సీట్ల పందేరంలో పొత్తు బెడిసి కొట్టింది. వామపక్షాలు తలా నాలుగేసి సీట్లకు పట్టుబట్టడంతో అన్నాడీఎంకే నిరాకిస్తూ వచ్చింది. పలు దఫాలుగా సీట్ల చర్చలు సాగాయి. చివరకు తలా రెండు సీట్లు దక్కుతాయని భావించిన వామపక్ష నేతలకు మిగిలింది నిరాశే. చెరో సీటుతో సర్దుకోవాలం టూ అన్నాడీఎంకే అధిష్టానం సూచించడంతో ఖంగు తిన్నారు. అదే సమయంలో కూటమిలోని ఆ రెండు పార్టీలకు తెలియకుండానే 40 స్థానాల బరిలో అభ్యర్థులను జయలలిత ప్రకటించారు. సీట్ల పంపకాలు కొలిక్కి వస్తే తమ అభ్యర్థులను వెనక్కు తీసుకుంటామని చెప్పారు. బెడిసి కొట్టిన చర్చ: సీట్ల పంపకాలపై రెండు రోజులుగా పలు మార్లు అన్నాడీఎంకే కమిటీతో వామపక్షాల నేతలు చర్చల్లో పాల్గొన్నారు. అన్నాడీఎంకే మెట్టు దిగకపోవడం, తాము ఆశించిన నియోజకవర్గాల్లో జయలలిత ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులను పరిచయం చేయడం సీపీఎం, సీపీఐ నేతలను విస్మయంలో పడేసింది. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశానికి రెండు పక్షాలు వేర్వేరుగా పిలుపునిచ్చాయి. అన్నాడీఎంకే తీరుపై చర్చించారు. చివరకు జాతీయ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అమ్మకు టాటా: రెండు రోజుల సమావేశాల్లో చర్చించిన అంశాలపై సీపీఎం, సీపీఐలు ఉమ్మడిగా సమీక్షించాయి. టీ నగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో సాయంత్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్‌లతో కూడిన ఇరు పార్టీల నేతల బృందం గంటన్నరకు పైగా సమీక్షించింది. అన్నాడీఎంకే తమను నిర్లక్ష్యం చేయడంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన నాయకులు చివరకు అన్నాడీఎంకే కూటమికి టాటా చెప్పేందుకు నిర్ణయించారు. ఒంటరిగా: రెండు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు రావాలని నిర్ణయించామన్నారు. ఎన్నికలను సీపీఎం, సీపీఐలు కలసి కట్టుగా ఒంటరిగా ఎదుర్కోబోతున్నట్టు ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో, ఎక్కడెక్కడ పోటీ అన్న వివరాలను కలసికట్టుగా నిర్ణయించి వెల్లడిస్తామన్నారు. అన్నాడీఎంకే కూటమి నుంచి వామపక్షాలు బయటకు రావడంతో జాతీయ స్థాయిలో మూడో కూటమి (థర్డ ఫ్రంట్) సంగతేంటో? అన్న చర్చ మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు పంచముఖ సమరానికి దారి తీసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. -
పోస్టాఫీస్ ద్వారా మరిన్ని ప్రభుత్వ పథకాలు
బంగారుతల్లి, అభయహస్తం లాంటి పథకాలను తపాల కార్యాలయాల ద్వారా లబ్ధిదారులకు అందించేందుకు యోచిస్తున్నామని తపాల శాఖ ఏపీ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ సుధాకర్ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. తపాల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలోని 14 జిల్లాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు చెల్లింపులు జరుపుతున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవలే 171 పౌరసేవలను అందించేందుకు మీ సేవను ప్రారంభించామన్నారు. దీనిని త్వరలో అన్ని తపాల కార్యాలయాలకు విస్తరిస్తామన్నారు. అదే స్ఫూర్తితో ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించే ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. తపాల శాఖ ద్వారా ఎన్నో నూతన పథకాలను ప్రవేశపెట్టామని, వాటి ద్వారా సంస్థకు మంచి ఆదాయం వస్తోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.