
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం
పుదుచ్ఛేరి: సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు గురుదాస్ గుప్తా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పుదుచ్చేరిలో జరుగుతున్న సీపీఐ 22వ జాతీయ సమావేశాల్లో భాగంగా ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి, జాతీయ కార్యదర్శి వర్గం సహా పలు కమిటీలను ఎన్నుకున్నట్లు పార్టీ జాతీయ కౌన్సిల్ కార్యదర్శి షమీమ్ ఫైజీ తెలిపారు. డి.రాజా, షమీమ్ ఫౌజీ, అమర్ జీత్ కౌర్, అతుల్ కుమార్ అంజాన్, రామేంద్రకుమార్, పన్నియన్ రవీంద్రన్, డాక్టర్ కె.నారాయణ తదితరులకు జాతీయ కార్యదర్శివర్గంలో చోటు దక్కింది.
రెండోసారి జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన సురవరం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంపై పోరు కొనసాగిస్తామన్నారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మే 15న దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. సమాజంలోని అట్టడుగు వర్గాల్లో కమ్యూనిస్ట్ పార్టీలకు చిరకాలం స్థానముంటుందని అన్నారు.