national General Secretary
-
బండి బలమేంటో కమలానికి తెలిసొచ్చిందా?
కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ విషయంలో బీజేపీ అధిష్టానం వేసిన అంచనా ఘోరంగా తప్పిందా?. తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుంచి తొలగించడమనే పెను మార్పు బెడిసి కొట్టిందా?. బీజేపీ స్టేట్ కేడర్ మాత్రమే కాదు.. చిన్నాచితకా పదవుల్లో ఉన్న వాళ్లు.. సంజయ్ ఫ్యాన్స్‌తో పాటు హార్డ్‌కోర్ బీజేపీ అభిమానుల నుంచి కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి ఎదుర్కొంది అధిష్టానం. ఈ తరుణంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం కమలాధిష్టానం తాజా నిర్ణయం తీసుకుందనే విశ్లేషణ నడుస్తోంది. అందుకు కారణాలను గమనిస్తే.. మాజీ తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి(మొత్తం ఎనిమిది మందిలో ఆయనొకరు) దక్కింది. ఆయన్ని బుజ్జగించే క్రమంలోనే ఈ ‘ప్రమోషన్’ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన వ్యవహరించింది. అటు బండితో పాటు ఇటు ఆయన్ని తప్పించడంపై అసంతృప్తితో రగిలిపోతున్న వాళ్లనూ చల్లార్చినట్లయ్యింది. తద్వారా రాష్ట్రంలో పార్టీ శ్రేణుల్లో జోష్ నిండి.. ఉత్సాహాంగా పని చేయాలనే ఆలోచనగా స్పష్టమవుతోంది. ✍️ ఊహించని పరిణామం కరోనా సమయంలో బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ బండి సంజయ్ కుమార్.. కారు పార్టీని కమలంతో ఢీ కొట్టే స్థాయిలో దూకుడుగా ముందుకు నడిపించారు. ఈ క్రమంలో.. ప్రభుత్వాన్ని ఏకేసే క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చొరబడే సందు కూడా ఇవ్వలేదు ఆయన. ఛాన్స్ దొరికినప్పుడల్లా కేసీఆర్ అండ్ కోపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ.. తన అగ్రెసివ్నెస్తో బీజేపీకి ఒక ఊపు తీసుకురావడమే కాదు.. నిత్యం పొలిటికల్ చర్చల్లో ఉండేలా చేసింది కూడా ఆయనే. ఈ క్రమంలో అరెస్టయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తిని పార్టీ బలపడుతుందనుకున్న టైంలో.. అదీ ఎన్నికల ముందర తప్పించడంపై పార్టీ మెజార్టీ శాతం నుంచి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. బండిని తొలగించిన ప్రకటన వెలువడగానే.. పలుచోట్ల రాజీనామాల పర్వం కూడా కొనసాగింది. అయితే ఈ స్థాయి వ్యతిరేకతను బీజేపీ అధిష్టానం సైతం ఊహించలేదు. ✍️ వ్యూహాత్మక నిర్ణయమేనా? పాదయాత్రల ద్వారా పార్టీపై జనాల్లో ఫోకస్ పెరిగే చేయడమే కాకుండా.. పార్టీ అగ్రనేతలను తెలంగాణకు రప్పించగలిగారు బండి సంజయ్. ఆ సమయంలో ‘సాహో.. సంజయ్’ అంటూ భుజం తట్టారు బీజేపీ పెద్దలు(ప్రధాని సహా). కానీ, అవమానకర రీతిలో తొలగించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. బండి సారథ్యంలో బీజేపీ వర్గపోరుతో క్యాడర్లో అయోమయం నెలకొందనే సాకు.. పైగా చేరికలు ఆగిపోవడానికి బండినే కారణమంటూ ఇచ్చిన ‘తప్పుడు’ నివేదికలు ఆయనకు పదవిని దూరం చేశాయనే ప్రచారం ఒకటి ఉంది. అయితే.. బండిని మార్చడం ద్వారా తెలంగాణలో పూడ్చలేని అపఖ్యాతిని కాషాయం పార్టీ మూటగట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ నిర్ణయం తప్పుబడుతూ సాధారణ పౌరులు సైతం పోస్టులు చేశారు. కార్యకర్తలు, బండి అభిమానులు పార్టీలో యాక్టివ్‌గా పని చేయడం తగ్గించేశారు. ఈ నిరసన సెగ.. హస్తినకు చేరింది. ఈ తరుణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే.. క్యాడర్ చల్లబడుతుందని, పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే సమాలోచనలు జరుపుతూ వచ్చింది బీజేపీ అధిష్టానం. వీటికి తోడు.. దూకుడు మీదున్న బండి సంజయ్‌ను మార్చడం బీఆర్ఎస్కే అనుకూలిస్తుందనే సంకేతాల్ని ప్రజల్లోకి పంపినట్లు అవుతుందన్న కేడర్ అభిప్రాయంతో ఢిల్లీ పెద్దలు సైతం ఏకీభవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే మళ్లీ సాహో సంజయ్ అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణ పార్టీ చీఫ్ మార్పు-ఎంపిక విషయంలో మాత్రం స్ట్రాటజికల్గానే నిర్ణయం తీసుకున్నట్లు ఓ హస్తిన నేత చెబుతున్నారు. ✍️ బండి సేవలు అలానా? బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించినా.. అవి మీడియా కథనాలకే పరిమితం అవుతూ వచ్చాయి. అయితే.. ఈలోపే పార్టీకి జరిగిన డ్యామేజ్‌తో బండి బలమేంటో బీజేపీ అధిష్టానం గుర్తించింది. తీవ్ర మల్లాగుల్లాల తర్వాత బండి సంజయ్‌కు జాతీయ పదాధికారుల బృందంలో చోటు కల్పించింది. తెలంగాణలో కిషన్‌రెడ్డి సారథ్యంలో పని చేయాలని సూచిస్తూనే.. ఏదైనా ఒక రాష్ట్రానికి బండి సంజయ్‌ను ‘వ్యవహారాల ఇంఛార్జి’గానూ నియమించే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. రాష్ట్రాలకు పార్టీ చీఫ్‌లు, ఇన్‌ఛార్జిల నియామకాల విషయంలో బీజేపీ వ్యూహాత్మక ధోరణి ప్రదర్శిస్తోంది. కొన్ని రాష్ట్రాలకు అనుభవజ్ఞులను.. మరికొన్ని రాష్ట్రాలకు దూకుడు స్వభావం ఉన్న వాళ్లను నియమిస్తోంది. ఆ లెక్కనే బండికి ఏదైనా రాష్ట్రం అప్పగిస్తారనే టాక్ నడుస్తోంది. అయితే బండికి ‘బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి’ పదవి దక్కడమనేది ఆయన్ని అభిమానుల్ని ఖుషీ చేసేదే అయినా.. తెలంగాణ రాజకీయాలకూ ఆయన దూరం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం!. ఇదీ చదవండి: సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే సహా అంతా ఆ పార్టీలోకేనా? -
జాతీయ నాయకత్వంలో బండి సంజయ్ కు కీలక పదవి
-
బండి సంజయ్‌కు కీలక పదవి..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మాజీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు హైకమాండ్ కీలక పదవిని అప్పగించింది. బీజేపీ జాతీయ నాయకత్వంలో చోటు కల్పించింది.ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. - ఇదే సమయంలో తెలంగాణ నుంచి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతుండగా.. ఏపీ నుంచి సత్యకుమార్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగనున్నారు. - అయితే, ఏదైనా ఒక రాష్ట్రానికి బండి సంజయ్‌ను ఇన్చార్జ్గా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने निम्नलिखित केंद्रीय पदाधिकारियों के नामों की घोषणा की है- pic.twitter.com/0aaArxHF30 — BJP (@BJP4India) July 29, 2023 - మరోవైపు.. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు ఈటల రాజేందర్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. - అయితే, తెలంగాణలో ఇటీవలే అధ్యక్ష పదవి నుంచి బీజేపీ హైకమాండ్ బండి సంజయ్‌ను తప్పించిన విషయం తెలిసిందే. అనంతరం, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి తెలంగా బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌కు ఎలాంటి పదవి ఇస్తారనేది ఆసక్తికరంగా మారిన తరుణంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, బీజేపీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని తగ్గేందుకే సంజయ్‌కు కీలక పదవి ఇచ్చినట్టు పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు జడ్పీ ఛైర్మన్లు కారు దిగితే కష్టమే.. రేవంత్ టీమ్ ప్లాన్ వర్కౌవుట్ అవుతుందా? -
కర్ణాటక ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా సీఎం బొమ్మై
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలకు బీజేపీ సమాయత్తమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను నియమించింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజెను ప్రకటించింది. ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడిగా మాజీ సీఎం యెడియూరప్పను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు కమిటీలకు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన లింగాయత్, వొక్కలిగ కులాలకు చెందిన బొమ్మై, కరంద్లాజెలకు సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం సమతూకం సాధించేందుకు ప్రయత్నించింది. -
దేశ సంపద కార్పొరేట్‌కు ధారాదత్తం
సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తూ కార్పొరేటీకరణకు పెద్దపీట వేస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు జరగనున్న ఐద్వా రాష్ట్ర మూడో మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. మోదీ అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రజాజీవితం అస్తవ్యస్తంగా తయారవుతోందన్నారు. ఏడేళ్ల కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. వంట గ్యాస్‌ధర పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోనే కాక అనేక రాష్ట్రాల్లో మహిళలు, బాలికలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగి పోయాయని, వాటిని నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేక ఏడు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లక్షలాది ఎకరాల భూములను ధరణి పేరుతో భూస్వాములకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సభకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి తదితరులు సభలో పాల్గొన్నారు. -
సీపీఐ పగ్గాలు అందుకున్న రాజా
సాక్షి, న్యూఢిల్లీ: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నూతన ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు డి.రాజా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని పార్టీ జాతీయ సమితి, కార్యవర్గ సమావేశం ఆమోదించింది. సుదీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్‌రెడ్డి వయసురీత్యా వైదొలిగారు. గత మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ సమితి, కార్యవర్గ సమావేశాల్లో సురవరం రాజీనామాను ఆమోదించారు. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలిగినా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతానని సురవరం తెలిపారు. రాజా నేతృత్వంలో పార్టీ పునర్నిర్మాణం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘం నాయకుడిగా.. తమిళనాడుకు చెందిన 70 ఏళ్ల డి. రాజా యువజన ఉద్యమాల ద్వారా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 1975–80 వరకు అఖిల భారత యువజన సమాఖ్య తమిళనాడు కార్యదర్శిగా, 1985–90 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1994 నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2007 నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది.ఎంపీగా రాజా దాదాపు అన్ని శాఖల పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో పనిచేశారు. జాతీయ కార్యవర్గంలోకి కన్హయ్య జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్‌ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఇటీవల మరణించిన షమీమ్‌ఫైజీ స్థానంలో కన్హయ్యకు చోటు కల్పించారు. ఒడిశాకు చెందిన రామకృష్ణ పాండ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మనీష్ కుంజంను జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు. సమావేశాల్లో ఏపీ, తెలంగాణ కార్యదర్శులు రామకృష్ణ, చాడా వెంకట్‌రెడ్డి సహా ముప్పాళ్ల నాగేశ్వరరావు, శ్రీనివాస్‌రెడ్డి, అక్కినేని వనజా, ఓబులేసు పాల్గొన్నారు. -
‘మజ్లిస్‌ను చూస్తే కేసీఆర్‌కు వణుకు’
ఖిలా వరంగల్: మజ్లిస్ పార్టీ నాయకులను చూస్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని, వారి ఆలోచనలనే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా తూర్పు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కుసుమ సతీష్‌తో కలసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసేందుకు మాయా కూటమి తయారైందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో ధనవంతులే లాభపడ్డారని, పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్‌ను గద్దె దింపితేనే అన్ని వర్గాలకు సంక్షేమం జరుగుతుందని చెప్పారు. -
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్
-
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్
విజయవాడ : తెలుగుదేశం పార్టీ జాతీయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కమిటీలను ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలో ప్రకటించారు. 41 మందితో జాతీయ కమిటీ... 70 మందితో ఏపీ టీడీపీ కమిటీ ... అలాగే 96 మందితో టీటీడీపీ కమిటీలో చోటు కల్పించినట్లు చంద్రబాబు తెలిపారు. జాతీయ పార్టీలో పొలిట్ బ్యూరో, ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఉంటాయని... రెండు రాష్ట్రాల్లోని కమిటీలు పాత పద్దతిలోనే ఉంటాయని ఆయన వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... టీడీపీ జాతీయ అధ్యక్షుడు : ఎన్ చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు : పి.రాములు, గరికపాటి రామ్మోహనరావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, డీకె సత్యప్రభ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శులు : నారా లోకేష్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొనకళ్ల నారాయణరావు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో ఎక్స్అఫీషియో సభ్యులు : నారా లోకేష్, సుజనా చౌదరి, కె.కళా వెంకట్రావు, ఎల్ రమణ టీడీపీ కేంద్ర కమిటీలో పొలిట్ బ్యూరో సభ్యులు : యనమల రామకృష్ణుడు, పి.అశోక్ గజపతిరాజు, నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, నందమూరి హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, టి.దేవేందర్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, రమేష్ రాథోడ్, ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సీహెచ్ అయ్యన్న పాత్రుడు, ప్రతిభా భారతి, నామా నాగేశ్వరరావు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధులు : పయ్యావుల కేశవ్, ఈ పెద్దిరెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, బోండా ఉమా, కె. రామ్మోహన్నాయుడు. కేంద్ర కమిటీ కోశాధికారి : శిద్ధా రాఘవరావు టీడీపీ క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడు : ఎం.ఏ.షరీఫ్ క్రమశిక్షణా కమిటీ సభ్యులు : సోమిరెడ్డి, అరికెల మీడియా కమిటీ కో - ఆర్డినేటర్ : ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ : టీడీపీ కమిటీ అధ్యక్షుడు : కిమిడి కళా వెంకట్రావు ఉపాధ్యక్షులు : జె.ఆర్.పుష్పరాజ్, ఎం.వెంకటేశ్ చౌదరి, కరణం బలరాంమూర్తి, బండారు సత్యనారాయణ మూర్తి, మెట్ల సత్యనారాయణ. ప్రధాన కార్యదర్శులు : జి.బుచ్చియ్య చౌదరి, వర్ల రామయ్య, రెడ్డి సుబ్రహ్మణ్యం, నిమ్మల రామానాయుడు, జయ నాగేశ్వరరెడ్డి. అధికార ప్రతినిధులు : అవంతి శ్రీనివాస్, పంచుమర్తి అనురాధ, లింగారెడ్డి, జూపూడి ప్రభాకరరావు, వై.బి.రాజేంద్రప్రసాద్, డి.మాణిక్య వర ప్రసాద్, ముళ్లపూడి రేణుక. కోశాధికారి : బీసీ జనార్దన్‌రెడ్డి తెలంగాణ : టీడీపీ అధ్యక్షుడి : ఎల్ రమణ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ : రేవంత్‌రెడ్డి ఉపాధ్యక్షులు : మండవ వెంకటేశ్వరరావు, జి.సాయన్న, అన్నపూర్ణమ్మ, స్వామిగౌడ్, యూసుఫ్ అలీ, చాడ సురేష్ రెడ్డి, సి. కృష్ణయాదవ్, అరికేపూడి గాంధీ. ప్రధాన కార్యదర్శులు : సండ్ర వెంకట వీరయ్య, కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతక్క, వివేక్ గౌడ్, మల్లయ్య యాదవ్, అధికార ప్రతినిధులు : వేం నరేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, సతీష్ మాదిగ. రజనీకుమారి, అరికెల నర్సిరెడ్డి, రాజారాం యాదవ్, కోశాధికారి : ప్రేమ్ కుమార్ జైన్ మీడియా కమిటీ కన్వీనర్ : ఎం.ఎ. సలాం, సభ్యుడిగా ప్రకాశ్ రెడ్డి -
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక
-
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం
పుదుచ్ఛేరి: సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు గురుదాస్ గుప్తా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పుదుచ్చేరిలో జరుగుతున్న సీపీఐ 22వ జాతీయ సమావేశాల్లో భాగంగా ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి, జాతీయ కార్యదర్శి వర్గం సహా పలు కమిటీలను ఎన్నుకున్నట్లు పార్టీ జాతీయ కౌన్సిల్ కార్యదర్శి షమీమ్ ఫైజీ తెలిపారు. డి.రాజా, షమీమ్ ఫౌజీ, అమర్ జీత్ కౌర్, అతుల్ కుమార్ అంజాన్, రామేంద్రకుమార్, పన్నియన్ రవీంద్రన్, డాక్టర్ కె.నారాయణ తదితరులకు జాతీయ కార్యదర్శివర్గంలో చోటు దక్కింది. రెండోసారి జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన సురవరం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంపై పోరు కొనసాగిస్తామన్నారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మే 15న దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. సమాజంలోని అట్టడుగు వర్గాల్లో కమ్యూనిస్ట్ పార్టీలకు చిరకాలం స్థానముంటుందని అన్నారు.