Former Telangana BJP President Bandi Sanjay Appointed As National General Secretary Of BJP - Sakshi
Sakshi News home page

BJP National General Secretary: బండి సంజయ్‌, డీకే అరుణకు కీలక పదవులు..

Published Sat, Jul 29 2023 10:24 AM | Last Updated on Sat, Jul 29 2023 11:27 AM

Bandi Sanjay Appointed As National General Secretary Of BJP - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మాజీ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌కు హైకమాండ్‌ కీలక పదవిని అప్పగించింది. బీజేపీ జాతీయ నాయకత్వంలో చోటు కల్పించింది.ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు.

- ఇదే సమయంలో తెలంగాణ నుంచి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతుండగా.. ఏపీ నుంచి సత్యకుమార్‌ బీజేపీ జాతీయ కార్యద‍ర్శిగా కొనసాగనున్నారు. 

- అయితే, ఏదైనా ఒక రాష్ట్రానికి బండి సంజయ్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

- మరోవైపు.. తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి, డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు ఈటల రాజేందర్‌ ఢిల్లీకి బయలుదేరనున్నారు. 

- అయితే, తెలంగాణలో ఇటీవలే అధ్యక్ష పదవి నుంచి బీజేపీ హైకమాండ్‌ బండి సంజయ్‌ను తప్పించిన విషయం తెలిసిందే. అనంతరం, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి తెలంగా బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌కు ఎలాంటి పదవి ఇస్తారనేది ఆసక్తికరంగా మారిన తరుణంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, బీజేపీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని తగ్గేందుకే సంజయ్‌కు కీలక పదవి ఇచ్చినట్టు పొలిటికల్‌ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు జడ్పీ ఛైర్మన్లు కారు దిగితే కష్టమే.. రేవంత్‌ టీమ్‌ ప్లాన్‌ వర్కౌవుట్‌ అవుతుందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement