
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి మార్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్ చేసినట్లు సమాచారం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీకాలం ముగిసింది. అయితే మరోసారి బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం లేదంటూ జాతీయ అధిష్టానం స్పష్టం చేయడంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేయనున్నారు. కాగా సోము వీర్రాజు 2020 జులై 27 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే.. కీలక బాధ్యతల అప్పగింత హామీని ఆయనకు అధిష్టానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక కాషాయ పార్టీకి కొత్త బాస్ రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి, జీవీఎల్, పురందేశ్వరి పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యకుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సాయంత్రం లోపు క్లారిటీ రానుంది.
Comments
Please login to add a commentAdd a comment