![muralidhar rao fires on kcr, majlis - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/4/MURALIDHAR-10.jpg.webp?itok=giZPv3UO)
ఖిలా వరంగల్: మజ్లిస్ పార్టీ నాయకులను చూస్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని, వారి ఆలోచనలనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా తూర్పు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కుసుమ సతీష్‌తో కలసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసేందుకు మాయా కూటమి తయారైందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ నాలుగేళ్ల పాలనలో ధనవంతులే లాభపడ్డారని, పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్‌ను గద్దె దింపితేనే అన్ని వర్గాలకు సంక్షేమం జరుగుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment