కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నల్లధనాన్ని వెలికితీస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మడికొండలో బుధవారం జరిగిన పార్టీ మహాసభలో ఆయన మాట్లాడారు.
-
సీపీఐ జాతీయ సమితి సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి
మడికొండ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే నల్లధనాన్ని వెలికితీస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మడికొండలో బుధవారం జరిగిన పార్టీ మహాసభలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోదీ జన్‌ధన్ పేరుతో జీరో ఖాతాలను తెరిపించి పేదలను మోసం చేస్తున్నారని, బడా పెట్టుబడిదారులకు, కోట్ల రూపాయల పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కార్యదర్శి టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో మోyì ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలలో ఏ ఒక్కటి అమలు పరచలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుంచి పీజీ విద్యపై కేసీఆర్ చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయని విమర్శించారు. సీపీఐ గ్రామశాఖ కార్యదర్శి మాలోతు శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు మేకల రవి, గోలి రాజిరెడ్డి, మద్దెల ఎల్లేష్, మడ్డి రాజారాం, సమ్మయ్య, నర్సింగం, మద్దెల వెంకటస్వామి, మణెమ్మ, రజిత, జ్యోతి, రమ్య, వెంకటేష్ పాల్గొన్నారు.