బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు నార్కో టెస్టులు చేయాలి  | CPI National Council Meeting In Delhi From October 3: Narayana | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు నార్కో టెస్టులు చేయాలి 

Published Thu, Sep 9 2021 3:13 AM | Last Updated on Thu, Sep 9 2021 8:38 AM

CPI National Council Meeting In Delhi From October 3: Narayana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలనే అంశంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు చిత్తశుద్ధి లేదని, ఈ విషయంలో ఆ రెండు పార్టీలకు నార్కో పరీక్షలు చేయించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషాతో కలసి హైదరాబాద్‌ మఖ్దూంభవన్‌లో బుధవారం మీడియాతో నారాయణ మాట్లాడారు.

విజయవాడలో జాతీయ మహాసభ 
అక్టోబర్‌ 3 నుంచి 4 వరకు ఢిల్లీలో సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహించనున్నట్లు నారాయణ తెలిపారు. జాతీయ మహాసభను విజయవాడలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మోదీకి పరిపాలించే నైతిక హక్కు లేదని, మోదీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ 19 రాజకీయ పార్టీలు ఈ నెల 27న భారత్‌ బంద్‌ చేపడుతున్నాయన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement