సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం గడుస్తున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇంకా కొందరు నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు. సీనియర్ నేతలు కూడా పార్టీలు మారుతుండటం విశేషం. ఇక, తాజాగా మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ కీలక నేత అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు.
వివరాల ప్రకారం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతో బలమైన నేతగా పేరున్న ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి శేఖర్‌ను కేటీఆర్ ఆహ్వానించారు. ఇక, ఎర్ర శేఖర్ చేరికతో పాలమూరులో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందన్నారు.
మరోవైపు, ఎర్ర శేఖర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో తనకు అనుబంధం ఉందన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశానని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచేలా ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారని ఈ సందర్భంగా ఎర్ర శేఖర్ అన్నారు. బీఆర్‌ఎస్ చేపట్టిన కార్యక్రమాలను భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేందుకు కేసీఆర్ నాయకత్వంలో నడిచేందుకు ఈరోజు పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment