erra shekhar
-
కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్లోకి సీనియర్ నేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం గడుస్తున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇంకా కొందరు నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు. సీనియర్ నేతలు కూడా పార్టీలు మారుతుండటం విశేషం. ఇక, తాజాగా మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ కీలక నేత అధికార బీఆర్ఎస్లో చేరారు. వివరాల ప్రకారం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతో బలమైన నేతగా పేరున్న ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి శేఖర్‌ను కేటీఆర్ ఆహ్వానించారు. ఇక, ఎర్ర శేఖర్ చేరికతో పాలమూరులో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందన్నారు. మరోవైపు, ఎర్ర శేఖర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో తనకు అనుబంధం ఉందన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కలిసి పనిచేశానని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచేలా ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారని ఈ సందర్భంగా ఎర్ర శేఖర్ అన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలను భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేందుకు కేసీఆర్ నాయకత్వంలో నడిచేందుకు ఈరోజు పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
కాంగ్రెస్‌లో ముసలం: ‘కోమటిరెడ్డి’ బాటలోనే అనిరుధ్‌రెడ్డి
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కాంగ్రెస్‌లో ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. ‘నేర చరిత్ర కలిగిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌తో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేను.. ఆయనతో కలిసి వేదికను పంచుకోలేను’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు గురువారం జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ రాయడం కలకలం సృష్టించింది. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సొంత పార్టీ నాయకులు విమర్శలు గుప్పించడం.. దీటుగా ఆయన స్పందించడం.. ఆ తర్వాత పార్టీలో క్రమక్రమంగా అసమ్మతి సెగలు రాజుకోవడం వంటి తదితర పరిణామాలతో పాటు టీఆర్ఎస్, బీజేపీ దూకుడు పెంచడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి విధేయుడిగా ఉన్న అనిరుధ్‌రెడ్డి లేఖ సంధించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఏడాదికిపైగా అనిశ్చితి.. మాజీ ఎమ్మెల్యే మరాఠి చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ గతేడాది జూలైలో బీజేపీని వీడారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన క్రమంలో ఆయనను కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జడ్చర్ల కాంగ్రెస్‌లో విభేదాలు గుప్పుమన్నాయి. నేరచరిత్ర కలిగిన ఎర్రశేఖర్‌ను పార్టీకి ఎలా చేర్చుకుంటారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధిష్టానానికి అప్పట్లో లేఖ రాయడంతో దుమారం చెలరేగింది. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో గతేడాది అక్టోబర్ 12న జరిగిన బహిరంగసభలో రేవంత్ సమక్షంలో చేరాల్సి ఉన్నప్పటికీ.. వాయిదా పడింది. చదవండి: (మర్రి శశిధర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. స్పందించిన మాణిక్యం ఠాగూర్) అనంతర కాలంలో శేఖర్‌పై ఉన్న కేసును కోర్టు కొట్టివేయడంతో కాంగ్రెస్‌లో చేరిక ఖాయమైంది. ఈ ఏడాది జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో రేవంత్‌రెడ్డి తదితర నేతల సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. ఆ తర్వాత అటు అనిరుధ్‌రెడ్డి, ఇటు ఎర్రశేఖర్ వేర్వేరుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపట్టిన దీక్షలో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క గత నెల 22న మహబూబ్‌నగర్‌కు వచ్చినప్పుడు ఆ ఇద్దరు వేర్వేరుగానే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా సుమారు ఏడాదికి పైగా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అనిశ్చితి నెలకొంది. సయోధ్య కుదిరినట్లేనని భావించినా.. తొలి నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలు కోమటిరెడ్డి ద్వారా ఎర్రశేఖర్ రాకను అనిరుధ్‌రెడ్డి అడ్డుకున్నారు. అయితే ఆ తర్వాత కాలంలో రెండు నెలల క్రితం అమెరికాలో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) సభలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డితో పాటు అనిరుధ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య చర్చలు జరిగాయని.. సయోధ్య కుదిరినట్లేనని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అనిరుధ్‌రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాయడంతో మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. చదవండి: (కాంగ్రెస్‌లోకి కొత్తకోట దంపతులు?) టీడీపీ వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నారంటూ.. ‘పార్టీకి ఎవరూ అండగా లేని రోజుల్లో తాను శ్రమించానని.. కాంగ్రెస్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీలోకి దించి గెలిపించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించానని.. కానీ తన అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎర్రశేఖర్‌ను పార్టీలోకి తీసుకున్నారు.’ అని లేఖలో అనిరుధ్‌రెడ్డి ప్రస్తావించినట్లు తెలిసింది. అదేవిధంగా టీడీపీ నుంచి వచ్చే వాళ్లకు ప్రాభవం లేకున్నా ప్రాధాన్యం ఇస్తున్నారని.. సీత దయాకర్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరుతున్నారని.. మొదటి నుంచి ఉన్న మాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సమంజసం కాదని.. తాను స్థానికుడిని అని ఏదిఏమైనా కాంగ్రెస్‌లోనే ఉండి పోరాడుతానని, పార్టీ టికెట్ రాకున్నా పోటీలో ఉంటానని’ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘కోమటిరెడ్డి’ బాటలోనే అనిరుధ్‌రెడ్డి నడుస్తారా అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అనిరుధ్‌రెడ్డి లేఖపై కాంగ్రెస్‌లోని పలువురు నేతలు మండిపడుతున్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి బంగ్ల రవి, ఎంపీటీసీల సంఘం నాయకుడు రాంచంద్రయ్య, నాయకులు రాజేశ్ తదితరులు నవాబ్‌పేటలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన తీరును ఖండించారు. అనతి కాలంలోనే ప్రజలకు చేరువ కావడంతోనే జీర్ణించుకోక ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరింతగా భగ్గుమనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మరో హుజురాబాద్ అవుతుంది.. రేవంత్‌కు హస్తం నేత స్వీట్ వార్నింగ్
సాక్షి, జడ్చర్ల: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ముసలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జిల్లాలో నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. జడ్చర్ల ఇంచార్జ్ అనిరుధ్.. మాణిక్యం ఠాగూర్‌కు ఘాటుగా లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని అనిరుధ్ రెడ్డి వ్యతిరేకించారు. ఆయన చేరికపై అనిరుధ్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సొంత తమ్ముడినే హత్య చేసిన వ్యక్తి ఎర్ర శేఖర్ అనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. 9 మర్డర్ కేసుల్లో సంబంధం ఉన్న ఎర్రశేఖర్‌తో స్టేజ్ పంచుకోలేను. కోమటిరెడ్డి అనుచరుడిని కాబట్టే నన్ను డిస్టర్జ్ చేస్తున్నారు. నేను ఇక్కడ పోటీలో ఉంటే అది కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుంది. లేదంటే మరో హుజురాబాద్ అవుతుందని ఘాటుగా స్పందించారు. టీడీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు నన్ను పనులు చేసుకోకుండా అడ్డుకుంటున్నారు. నా కేడర్ వారికి తగిన బుద్ది చెబుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. కాగా, బుధవారం జరిగిన సమీక్షా సమావేశం మధ్యలోనే మహేశ్వర్ రెడ్డి వెళ్లిపోయారు. దీంతో ఏఐసీసీ సెక్రటరీ జావిద్.. మహేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీంతో, మహేశ్వర్ రెడ్డి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: మర్రి శశిధర్ రెడ్డికి కౌంటర్ -
ఆది నుంచీ అంతే: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో జోష్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీకి జిల్లాలో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరాఠి చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ మంగళవారం తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయిన అనంతరం ఈ విషయాన్ని ఎర్రశేఖరే స్వయంగా వెల్లడించారు. త్వరలో ‘హస్తం’ గూటికి చేరనున్నట్లు ప్రకటించడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన గతంలో జడ్చర్ల నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మారిన రాజకీయ పరిణామ క్రమంలో బీజేపీలో చేరినప్పటికీ.. అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించడం.. ఎర్రశేఖర్ కాంగ్రెస్‌లో చేరుతుండడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ నేపథ్యం.. 1994లో ధన్వాడ ఎంపీపీగా ఎర్రశేఖర్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పటికే ఆయన సోదరుడు టీడీపీకి చెందిన ఎర్రసత్యం జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. 1995 ఆగస్టులో ఆయన హత్యకు గురికావడంతో 96లో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రెండోసారి విజయం సాధించారు. 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి లక్ష్మారెడ్డి గెలుపొందగా.. టీడీపీ నుంచి బరిలో ఉన్న ఎర్రశేఖర్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ మద్దతు ఉపసంహరించుకోవడం.. ‘గులాబీ’ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయడంతో 2008లో ఉపఎన్నికలు వచ్చాయి. ఇందులో జడ్చర్లలో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డితో పాటు టీడీపీ నుంచి పోటీ చేసిన ఎర్రశేఖర్ ఓటమి పాలయ్యారు. 2009లో టీడీపీ, టీఆర్ఎస్ కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా.. ఎర్రశేఖర్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2014లో జడ్చర్ల, 2018లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరారు. కొందరి నేతల్లో మాత్రం ఆందోళన కాంగ్రెస్‌లో మారుతున్న రాజకీయాలతో ఆ పార్టీలోని కొందరు నాయకుల్లో తమ భవిష్యత్‌పై ఒకింత ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రశేఖర్ కాంగ్రెస్‌లో చేరుతుండడంతో అటు జడ్చర్లతో పాటు ఇటు మహబూబ్‌నగర్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న నేతలు ఆయనకు ఏ హామీ లభించిందోనని ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీ స్థాయిలో అండదండలున్న వారు తమకేం ఇబ్బంది లేదని అనుచరులతో అన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి గట్టి నేతలు ఎవరూ లేరని.. బీసీ వర్గం అందులోనూ ముదిరాజ్ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండి పట్టున్న నేత కావడంతో ఎర్రశేఖర్‌కు అక్కడ అవకాశం ఇస్తారనే ఊహాగానాలు ‘హస్తం’ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. మొదటి నుంచీ పొసగకనే.. బీజేపీలో చేరిన సుమారు ఏడాదిన్నర తర్వాత ఎర్రశేఖర్‌కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. పార్టీ తరఫున రెండు, మూడు కార్యక్రమాలు నిర్వహించిన క్రమంలో కొందరు నేతలతో ఆయనకు పొసగలేదు. ఇంతలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో తనకు తగిన ప్రాధా న్యం లభించలేదని మనస్తాపానికి గురైన వెంటనే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో అదే రోజు పార్టీ ప్రముఖులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ఉపసంహరించుకున్నారు. కానీ.. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కొన్ని నెలల్లోపే అధ్యక్ష బాధ్యతలను నిర్వహించలేనంటూ రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి పంపగా ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించినా ఆ తర్వాత మిన్నకుండిపోయారు. కాంగీ‘రేసు’లో జోష్.. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ జిల్లా శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం పెరిగిన పెట్రో ధరలపై నిరసన తెలపాలని పిలుపునివ్వగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఐదు జిల్లాల పరిధిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా ఎడ్లబండ్లు, సైకిళ్లపై తరలివచ్చారు. మహబూబ్‌నగర్‌లో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, వనపర్తిలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, నారాయణపేటలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పరిశీలకుడు వేణుగోపాల్‌రావు, నాగర్ కర్నూల్లో టీపీసీసీ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ జగన్‌లాల్ నాయక్, జోగుళాంబ గద్వాల జిల్లాలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవితో పాటు ఆయా జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నాయి. ఇదేక్రమంలో ‘హస్తం’ బలోపేతం దిశగా నేతల చేరికలపై రేవంత్‌రెడ్డి దృష్టి సారించడంతో మంచిరోజులు వస్తాయని భావిస్తున్న శ్రేణుల్లో జోష్ నెలకొంది. -
బీజేపీకి షాక్.. జిల్లా అధ్యక్షుడి రాజీనామా!
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర చంద్రశేఖర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పేరిట ఒక నోట్ విడుదలైంది. అనివార్య కారణాల వల్ల తాను జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు శేఖర్ అందులో పేర్కొన్నారు. తనే స్వయంగా మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి ఈ విషయం వెల్లడించారు. రాజీనామాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మహబూబ్ నగర్ పర్యటనలోనే ఉన్నారు. చదవండి: మీ స్థాయెంత.. మీ లెక్కెంత..? రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా పర్యటనలో ఉండగా జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఎర్ర శేఖర్ నిర్ణయం వెనక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా పర్యటన కారణమన్న ప్రచారం జరుగుతోంది. రాజకీనామాకు కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో అల్పాహార విందుకు ఎర్ర శేఖర్ హాజరైనట్టుగా సమాచారం. ఆ తర్వాతే ఆయన తన రాజీనామాను ప్రకటించారు. అయితే శేఖర్ రాజీనామా వెనక గల కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: కేసీఆర్ ఫాంహౌజ్‌ను చెక్ చేయాలి: బండి సంజయ్ -
ఇది తాగుబోతుల సినిమా కాదు
‘‘కొందరు ప్రేక్షకులకు కుటుంబకథా చిత్రాలు నచ్చుతాయి. మరికొందరికి యాక్షన్, ఇంకొందరికి థ్రిల్లర్.. ఇలా డిఫరెంట్ జానర్ ఆడియన్స్ ఉంటారు. అన్ని రకాల పేక్షకులను సంతృప్తిపరచేలా సినిమా తీయడం చాలా కష్టం. కానీ ఈ విషయంలో నా ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటాను’’ అన్నారు శేఖర్‌రెడ్డి. కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శేఖర్ చెప్పిన విశేషాలు. ► నేను నల్గొండ జిల్లా లింగరాజుపల్లిలో పుట్టాను.. హైదరాబాద్‌లో పెరిగాను. ఆసక్తితో సినిమా రంగంవైపు వచ్చాను. చంద్రమహేశ్‌గారి దగ్గర అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశాను. కొన్ని సినిమాలకు రచయితగా కూడా ఉన్నాను. నాలో డైరెక్షన్, రైటింగ్ ఇలా రెండు స్కిల్స్ ఉన్నాయి. ► ‘90ఎంఎల్’ దర్శకునిగా నా తొలి సినిమా. టైటిల్ వినగానే ఇది లిక్కర్ నేపథ్యంలో సాగే చిత్రం అని కొందరు ఊహించుకుంటారు. కానే కాదు. ఇది తాగుబోతుల సినిమా కాదు. భావోద్వేగ అంశాలకు వాణిజ్యపరమైన అంశాలు జోడించి ఈ సినిమాను తెరకెక్కించాం. మంచి వినోదాత్మకంగా ఉంటుంది. ► తన పిల్లాడికి పాలు ఇవ్వాల్సిన తల్లికి.. లిక్కర్ ఇవ్వాల్సి వస్తే ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుందో సినిమాలో చూపించాం. అంతేకానీ మందు సీన్లు పెట్టలేదు. మందు తాగమని ప్రోత్సహించే సన్నివేశాలను తెరకెక్కించలేదు. ► మందు తాగకపోతే బతకలేని ఓ డిజార్డర్ ఉన్న వ్యక్తి దేవదాసు పాత్రలో కార్తికేయ నటించారు. అసలు లిక్కర్ వాసన అంటేనే పడని ఓ కుటుంబంలోని అమ్మాయితో దేవదాసు ప్రేమలో పడతాడు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయన్న అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ► తమిళంలో మా సినిమా టైటిల్‌తోనే ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాకు, మా సినిమాకు ఏ సంబంధం లేదు. అలాగే మా ‘90 ఎంఎల్’ చిత్రంపై ‘ఆర్ఎక్స్ 100’ సినిమా ప్రభావం పడదు. టైటిల్ వల్ల మా సినిమాకు ప్రేక్షకులు దూరంగా ఉంటారు అంటే నేను కాదనే అంటాను. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ షో పడగానే కథ, సినిమా టాక్ బయటకు వచ్చేస్తుంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. ► నిర్మాత అశోక్రెడ్డిగారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. నా నెక్ట్స్ సినిమా గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. -
అలా కుదిర్చారు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల నడుమ బలవంతపు పొత్తు కుదిరినా ఎవరు ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత రావడం లేదు. తెలంగాణలో ఎనిమిది లోక్‌సభ స్థానాలు, 47 అసెంబ్లీ స్థానాలకు బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది. జిల్లాలో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంతో పాటు మరో ఆరు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా వున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానాల పరిధిలో మూడేసి సీట్ల చొప్పున కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేస్తోంది. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలో నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్ స్థానాలపై ఇరు పార్టీలు దాదాపు అంగీకారానికి వచ్చాయి. అయితే జడ్చర్లలో తమ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఉన్నందున మరో సీటు ఇస్తామంటూ టీడీపీ మెలిక పెడుతోంది. గద్వాల అసెంబ్లీ స్థానాన్ని కేటాయించేందుకు తెలుగుదేశం సుముఖత చూపుతోంది. బీజేపీ మాత్రం మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో మహబూబ్‌నగర్, నారాయణపేట, షాద్‌నగర్, మక్తల్ స్థానాల కోసం పట్టుపడుతోంది. నారాయణపేట స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి తెగేసి చెప్తున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డి ఇప్పటికే నారాయణపేట నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డిని పక్కన పెట్టి మరీ రాజేందర్‌రెడ్డి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఎల్లారెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. కాగా ఇటీవల మహబూబ్‌నగర్‌లో టీడీపీ నిర్వహించిన ప్రజాగర్జన నిర్వహణ వ్యయాన్ని రాజేందర్‌రెడ్డి భరించినట్లు సమాచారం. దీంతో నారాయణపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించేందుకు చంద్రబాబు ససేమిరా అంటున్నారు. నారాయణపేట, మక్తల్, కొడంగల్ స్థానాల్లో కనీసం రెండు కేటాయిస్తే తప్ప రెండు పార్టీల పొత్తుల కసరత్తు ఫలప్రదమయ్యే సూచన కనిపించడం లేదు. -
జిల్లా జైలుకు ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తరలింపు
ఆత్మకూరు : సోదరుడి హత్య కేసులో లొంగిపోయిన జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌కు న్యాయస్థానం 14రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆత్మకూరు సివిల్ జడ్జి ఎమ్మెల్యేకు రెండువారాల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. దాంతో పోలీసులు ఆయన్ని జిల్లా జైలుకు తరలించారు. జూలై17న దేవరకద్రలో హత్యకు గురైన ఎర్ర జగన్మోహన్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ సోమవారం తన నలుగురు అనుచరులతో కలిసి జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ ఎదుట లొంగి పోయిన విషయం తెలిసిందే. -
సోదరుడి హత్య కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే
మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సోదరుడు జగన్మోహన్ హత్యకేసు చిక్కుముడి వీడింది. జూలై17న దేవరకద్రలో హత్యకు గురైన ఎర్ర జగన్మోహన్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ సోమవారం తన నలుగురు అనుచరులతో కలిసి జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ ఎదుట లొంగి పోయారు. ఈ సందర్భంగా ఎస్పీ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. దేవరకద్ర మండలం సీసీకుంట సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎర్రశేఖర్ భార్య భవాని, తమ్ముడు జగన్మోహన్ భార్య అశ్రీత పోటీపడ్డారు. దీంతో ఆశ్రీతను పోటీ నుంచి తప్పించాలని ఎర్రశేఖర్ సోదరుడిని కోరాడు. అందుకు అతడు రూ.రెండులక్షలు, వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ టికెట్ ఇప్పించాలని డిమాండ్ చేశాడు. అంగీకరించిన ఎమ్మెల్యే.. జగన్మోహన్తోపాటు తన అనుచరులు తిమ్మన్న, రాములు, నర్సింహులు, సూర్యనారాయణ, రాజులను నామినేషన్ ఉపసంహరణకు కారులో దేవరకద్రకు పంపాడు. అప్పటికే ఉపసంహరణకు సమయం మించిపోయింది. ఆగ్రహానికి గురైన ఎర్రశేఖర్.. వారందరినీ అక్కడే ఉండమని చెప్పి మహబూబ్‌నగర్ నుంచి ఒక్కడే దేవరకద్రకు వెళ్లాడు. అక్కడ ఓ హోటల్ వద్ద ఉన్న సోదరుడిపై తుపాకీతో మూడురౌండ్లు కాల్పులు జరపగా.. జగన్మోహన్ ప్రాణాలు విడిచాడు. అనంతరం ఎర్రశేఖర్ తన అనుచరులతో కలిసి పారిపోయాడు. కాగా, ఆదివారం ఎమ్మెల్యే అనుచరులు టి.తిమ్మన్న, దండు నర్సింహులు, టి.రాములు, బోనావత్ రమేష్ బాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య తామే చేశామని నిందితులు అంగీకరించారని ఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన పిస్తోల్, ఎమ్మెల్యే వాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. -
ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
జడ్చర్ల : సోదరుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ జడ్చర్ల ఎమ్మెల్యే (ఏ.చంద్రశేఖర్) ఎర్ర శేఖర్ సోమవారం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఆయన గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. సోదరుడి హత్య కేసులో ఎర్రశేఖర్ ప్రధాన నిందితుడు. ఎమ్మెల్యే సోదరుడు జగన్మోహన్(41) దేవరకద్ర పాత బస్టాండ్ సమీపంలో జూలై17న హత్యకు గురైన సంగతి తెలిసిందే. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తన భర్తను ఆయన సోదరుడు, ఎమ్మెల్యే ఎర్ర శేఖరే హత్య చేయించారని జగన్మోహన్ భార్య ఆశ్రిత అప్పట్లో ఆరోపించారు. కాగా కొద్దిరోజుల క్రితం ఎర్ర శేఖర్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దాంతో ఆయన ఈరోజు ఉదయం ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు.