
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర చంద్రశేఖర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పేరిట ఒక నోట్ విడుదలైంది. అనివార్య కారణాల వల్ల తాను జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు శేఖర్ అందులో పేర్కొన్నారు. తనే స్వయంగా మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి ఈ విషయం వెల్లడించారు. రాజీనామాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మహబూబ్ నగర్ పర్యటనలోనే ఉన్నారు. చదవండి: మీ స్థాయెంత.. మీ లెక్కెంత..?
రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా పర్యటనలో ఉండగా జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఎర్ర శేఖర్ నిర్ణయం వెనక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా పర్యటన కారణమన్న ప్రచారం జరుగుతోంది. రాజకీనామాకు కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో అల్పాహార విందుకు ఎర్ర శేఖర్ హాజరైనట్టుగా సమాచారం. ఆ తర్వాతే ఆయన తన రాజీనామాను ప్రకటించారు. అయితే శేఖర్ రాజీనామా వెనక గల కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: కేసీఆర్ ఫాంహౌజ్‌ను చెక్ చేయాలి: బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment