న్యూఢిల్లీ: డిజిటల్ వ్యవస్థలను ఆధునీకరించడంలో భాగంగా చాట్‌జీపీటీ ఆధారిత చాట్‌బాట్‌ను ఉపయోగించనున్నట్లు టాటా గ్రూప్ ప్రమోట్ చేస్తున్న విమానయాన రంగ సంస్థ ఎయిర్ ఇండియా సోమవారం తెలిపింది. ఇందుకోసం రూ.1,640 కోట్లు ప్రారంభ పెట్టుబడి చేసినట్టు ప్రకటించింది.
డిజిటల్ ఇంజనీరింగ్ సేవలు, డిజిటల్ నిపుణులను తీర్చిదిద్దేందుకు సైతం ఈ మొత్తాన్ని వెచ్చించినట్టు పేర్కొంది. విహాన్.ఏఐ పరివర్తన కార్యక్రమంలో భాగంగా డిజిటల్ వ్యవస్థను ఆధునీకరించే ప్రయత్నాలలో గణనీయ పురోగతి సాధించామని వివరించింది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు పూర్తయ్యాయని, అలాగే మరెన్నో పురోగతిలో ఉన్నాయని ఎయిర్ ఇండియా చీఫ్ డిజిటల్, టెక్నాలజీ ఆఫీసర్ సత్య రామస్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment