సాక్షి, నెట్‌వర్క్: ప్రకాశం జిల్లా రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ఆర్‌టీవో) కె.రాంప్రసాద్‌కు చెందిన ఆస్తులపై ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఒంగోలు, నెల్లూరు, గూడూరు, గుంటూరు, తెనాలి, వినుకొండ, బెంగళూరు ప్రాంతాల్లోని ఆర్టీవోకు చెందిన ఆస్తులతో పాటు బంధువుల ఇళ్లపై నెల్లూరు ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆదాయానికి మించి దాదాపు రూ.30 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం.
బయటపడిందిలా..: రాంప్రసాద్ కుమార్తెకు నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ఏవో వరకుమార్ కుమారుడితో వివాహమైంది. అల్లుడికి కట్నం కింద రూ. 1.50 కోట్ల నగదు, కిలో బంగారు ఆభరణాలు, ఎకరా స్థలం, ఒక ప్లాటు ఇస్తానని రాంప్రసాద్ ఒప్పందం కుదుర్చుకొన్నట్లు సమాచారం. కానీ కట్నం తక్కువ ఇచ్చాడని.. ఈ విషయమై గొడవల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆర్టీవో @ రూ.30 కోట్లు
Published Fri, Oct 7 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
Advertisement
Advertisement