ప్రభుత్వ కార్యాలయాల భవనాల పరిశీలన
ప్రభుత్వ కార్యాలయాల భవనాల పరిశీలన
Published Fri, Aug 26 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
సూర్యాపేట : సూర్యాపేటలోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలను శుక్రవారం సూర్యాపేట ఆర్డీఓ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేట ఎంపీడీఓ, స్త్రీశక్తి భవనం, పాత మున్సిపల్ , సహకార బ్యాంకు కార్యాలయం, మున్సిపల్ కాంప్లెక్స్ భవనాలను పరిశీలించారు. ఈ భవనాల్లో జిల్లా కార్యాలయాలు అనువుగా నెలకొల్పిందేందుకు వీలుగా ఉన్నాయా.. లేవా.. అని చూశారు. భవనాల పరిస్థితి, వాటి అంచనాలను రికార్డుల్లో నమోదు చేయించారు. ఆయన వెంట తహసీల్దార్ మహమూద్ అలీ, ఆర్‌ఐలు ప్రభుకుమార్, సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement