రైతుల సమస్యలను విస్మరించిన ప్రభుత్వం
రైతుల సమస్యలను విస్మరించిన ప్రభుత్వం
Published Sun, Sep 18 2016 9:53 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
సూర్యాపేట : టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎంతో చేస్తామని మాయమాటలుచెప్పి అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. మాటలు తప్ప చేతలు లేవన్నారు. రాష్ట్రం వస్తే ఎంతో మేలు జరుగుతుందని మాయమాటలు చెప్పి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో రైతు రుణమాఫి చేస్తామని చెప్పి నేటికి మూడో దపా రుణమాఫి కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. మూసీ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీరు ఉన్నప్పటికీ పంట పొలాలకు నీరందించకపోవడం బాధాకరమన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేనప్పుడు కాలువలు మరమ్మతులు చేసుకుంటారు కానీ, నిండుకుండలా నీళ్లు ఉన్నప్పుడు మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయడంలో అర్థం లేదన్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేశారన్నారు. వంద రోజుల్లో సూర్యాపేటకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని ప్రగల్బాలు పలికిన వారు నేడు నీటి సమస్యను తీర్చడంలో విఫమలయ్యారని విమర్శించారు. సూర్యాపేటకు టూటౌన్ పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈద్గా రోడ్డులో డివైడర్ వేయడంలో అర్థం లేదన్నారు. ఇరుకు రోడ్లలో డివైడర్ వేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలేత్తేలా చేశారని మండిపడ్డారు. కలెక్టరేట్‌ను జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పోతు భాస్కర్, చకిలం రాజేశ్వర్‌రావు, ముదిరెడ్డి రమణారెడ్డి, అంజద్‌అలీ, అయూబ్‌ఖాన్, చెంచల శ్రీను, బొల్లె జానయ్య,
Advertisement