కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్
సాక్షి, అల్గునూర్(మానకొండూర్) : ప్రభుత్వ, ప్రైవేటు సేవలను పౌరులకు అందించేందుకు ప్రభుత్వ అనుబంధంగా ఏర్పాటు చేసిన సిటిజన్ సర్వీస్ సెంట్ విలేజ్ లెవల్ కార్యాలయం తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లో ఏర్పాటయింది. రైతులకు అవసరమైన ఎరువులను ఈ సర్వీస్ సెంటర్ ద్వారా అందించేందుకు ఏర్పాటు చేసిన గోదామును కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటురంగ సేవలు ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్ ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు. దేశంలో ఇప్పటివరకు సీఎస్‌సీ ఆధ్వర్యంలో ఒకేఒక్క ఫర్టిలైజర్ గోదాముందని, రెండోది, రాష్ట్రంలో మొట్టమొదటి గోదాం అల్గునూర్‌లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సీఎస్‌సీ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం సేవలన్నీ ఈ సెంటర్‌లో అందుబాటులో ఉంటాయని, హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ సేవలను కూడా ఇక్కడి నుంచి పొందొచ్చని తెలిపారు. రైతులకు కావాల్సిన ఎరువులన్నీ సీఎస్‌సీ కేంద్రంలో అందుబాటులో ఉంటాయ ని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా త్వరలో మరిన్ని సేవలు పౌరులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సీఎస్‌సీ హైదరాబాద్ ఇన్‌చార్జి మంజుల వీఎల్‌ఈ శానిటరీ నాప్కిన్ యూనిట్‌ను ప్రారంభించారు. సీఎస్‌సీ జిల్లా మేనేజర్ శ్రీరాం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర బ్యాధుడు శివకుమార్, సొసైటీ అధ్యక్షుడు రాజు, అల్గునూర్ సర్పంచ్ చిందం కిష్టయ్య, ఎంపీటీసీ స్వామిరెడ్డి, తహసీల్దార్ జగత్‌సింగ్, కంది రాంచంద్రారెడ్డి, చల్ల మహేందర్‌రెడ్డి, జాప శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment