CSC
-
కామన్ సర్వీస్ సెంటర్లుగా పీఏసీఎస్‌లు
సాక్షి, అమరావతి: ‘సహకర్ సే సమృద్ధి’ అనే నినాదంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ)గా తీర్చిదిద్దేందుకు సీఎస్సీ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. దేశవ్యాప్తంగా 30 వేల పీఏసీఎస్‌లను సీఎస్‌సీలుగా మార్చనుండగా, ఏపీలో ఇప్పటికే 1,810 పీఏసీఎస్‌లు అంగీకారం తెలియజేశాయి. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్లను నియమించింది. గ్రామస్థాయిలో 300కు పైగా పౌరసేవలు యూనివర్సల్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ ద్వారా అన్ని రకాల ఈ–సేవలను గ్రామస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య పౌరులతో పాటు రైతులకు 300కు పైగా వివిధరకాల పౌరసేవలను ఈ సీఎస్సీల ద్వారా అందించనున్నారు. రాష్ట్ర పరిధిలో 500కు పైగా పీఏసీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన పీఏసీఎస్‌ల్లో కూడా దశల వారీగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎస్‌సీలుగా మారనున్న పీఏసీఎస్‌లను పౌరులకు బ్యాంకింగ్, బీమా, పాన్ కార్డులు, రైళ్లు బస్సులు, విమానాలకు సంబంధించిన ట్రావెల్ బుకింగ్స్, ఆధార్ అప్డేట్, న్యాయ సలహాల వరకు అనేక రకాల సేవలను వన్‌స్టాప్ షాపులుగా తీర్చిదిద్దనున్నారు. పౌర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ప్రజల ముంగిటకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న సీఎస్‌సీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) సాధనాలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఎన్‌సీసీటీ ద్వారా శిక్షణ.. సీఎస్సీల్లో సేవలందించేందుకు వీలుగా పీఏసీఎస్‌ల సిబ్బందికి నేషనల్ కౌన్సిల్ ఫర్ కో ఆపరేటివ్ ట్రైనింగ్ (ఎన్‌సీసీటీ) ద్వారా ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడతల వారీగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్‌సీసీటీ ద్వారా శిక్షణ పొందిన 80 మంది మాస్టర్ ట్రైనర్స్ దేశంలోని 28 రాష్ట్రాల్లోని 570 జిల్లాల్లో ఎంపిక చేసిన పీఏసీఎస్‌ల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. 13కోట్ల మంది రైతులకు లబ్ధి ïపీఏసీఎస్‌లను దశల వారీగా సీఎస్సీలు తీర్చిదిద్దాలని కేంద్రం సంకల్పించింది. ఇప్పటికే 30వేల పీఏసీఎస్‌లను గుర్తించింది. ఈ సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇవ్వనుంది. సీఎస్సీల ద్వారా అందించే సేవలతో 13 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ మార్పుతో అదనపు ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా పీఏసీఎస్‌లు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా బలోపేతం కానున్నాయి – డాక్టర్ ఎస్ఎల్ఎన్టీ శ్రీనివాస్ స్టేట్ కో–ఆర్డినేటర్, ఎన్‌సీసీటీ -
ఊహించనివిధంగా సీఎస్సీ కటాఫ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లోనూ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ (సీఎస్సీ) కోర్సులో చేరడానికి ఎక్కువగా మొగ్గుచూపిస్తున్నారు. తాజాగా ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో జోసా నిర్వహించిన ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌లో ఇది స్పష్టమైంది. ప్రధాన ఐఐటీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల కటాఫ్ ర్యాంకులు ఊహించని విధంగా ఉన్నాయి. బాలికలకు సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయించడంతో వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఓపెన్ కేటగిరీలో కొన్ని సంస్థల్లో వందలోపు ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్లు దక్కలేదు. ముంబై, కాన్పూర్, ఢిల్లీ ఐఐటీలలో పోటీ ఈసారి తీవ్రంగా ఉంది. పాలక్కడ్, భిలాయ్ ఐఐటీల్లో 5 వేల పైన ర్యాంకు వచ్చిన వారికీ సీటు దక్కడం విద్యార్థులకు కాస్తా ఊరటనిచ్చింది. ఎన్ఐటీల్లోనూ అదే జోరు.. జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లో (ఎన్ఐటీలు) ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుకే డిమాండ్ కొనసాగింది. ఇతర బ్రాంచీలకన్నా సీఎస్సీ కోర్సులకు విద్యార్థులు 10 రెట్లు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. అందులోనూ ఎన్ఐటీలను మొదటి ఐచ్చికంగా ఎంచుకున్నారు. దీంతో వరంగల్ నిట్‌లో ఓపెన్ కేటగిరీలో బాలురకు 2 వేల లోపు ర్యాంకు వరకే సీట్లు దక్కాయి. తిరుచనాపల్లిలో వెయ్యిలోపు ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఏపీ, కాలికట్, జలంధర్, సిక్కిం, హమీర్పూర్ ఎన్ఐటీల్లో 10 వేల పైబడ్డ ర్యాంకుల వరకు సీట్లు లభించాయి. బాలికలకు కొంత మెరుగు తాజాగా ఐఐటీ, ఎన్ఐటీలలో కటాఫ్ తీరును పరిశీలిస్తే బాలురకన్నా, బాలికల పరిస్థితి కాస్తా మెరుగ్గా కనిపించింది. ఆరు రౌండ్ల సీట్ల కేటాయింపు తర్వాత ముంబై ఐఐటీలో బాలికలకు 305 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. తిరుపతిలో 5,901 వరకూ, భిలాయ్‌లో 7,176 వరకూ సీటు వచ్చింది. ఎన్ఐటీల విషయానికి వస్తే హమీర్పూర్ ఎన్ఐటీలో 18 వేల వరకూ కటాఫ్ ఉంటే, తిరుచనాపల్లిలో 1,852 బాలికల కటాఫ్‌గా ఉంది. దీంతో ఓపెన్ కేటగిరీలో బాలికలు సాధారణ పోటీతో సీట్లు దక్కించుకోవడం సాధ్యమైందని విశ్లేషకులు అంటున్నారు. కోవిడ్ తర్వాత జరిగిన జేఈఈ మెయిన్స్ పేపర్లు కఠినంగానే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ర్యాంకుల సాధనలోనూ ఈసారి పోటీ వాతావరణం కనిపించింది. -
రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌తో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల రేషన్ కార్డుకు సంబంధించిన సేవలు దేశవ్యాప్తంగా ఉన్న 3.70 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు మీరు మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) ద్వారా రేషన్ కార్డుకు సంబంధించిన అనేక సేవలను యాక్సెస్ చేసుకోవచ్చునని డిజిటల్ ఇండియా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. "డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌తో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న 3.70 లక్షల కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ భాగస్వామ్యం వల్ల దేశవ్యాప్తంగా 23.64 కోట్లకు పైగా రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని" కేంద్రం ట్విటర్ ఖాతా ద్వారా పేర్కొంది. ఈ భాగస్వామ్యం ఒప్పందం వల్ల దేశవ్యాప్తంగా 23.64 కోట్లకు పైగా రేషన్ కార్డు దారులు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా రేషన్ కార్డు సంబధించిన 6 రకాల సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు.(చదవండి: ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!) .@CSCegov_, under the @GoI_MeitY has signed a MoU with the @fooddeptgoi to enable ration card services through 3.70 Lakh CSCs across the country. The partnership is expected to benefit over 23.64 crore ration card holders across the country. pic.twitter.com/OIbutQClC3 — Digital India (@_DigitalIndia) September 16, 2021 సీఎస్‌సీలలో అందుబాటులో ఉండే 6 రకాల రేషన్ కార్డు సేవలు రేషన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయవచ్చు. మీ రేషన్ కార్డు డూప్లికేట్ ప్రింట్ పొందవచ్చు. మీ రేషన్ లభ్యత గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను చేయవచ్చు. రేషన్ కార్డు పోయినట్లయితే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి గుడ్‌న్యూస్!
విదేశాలకు వెళ్లాలని అనుకునే ప్రతి ఒక్కరూ పాస్‌పోర్టు కలిగి ఉండటం తప్పనిసరి అనే విషయం తెలిసిందే. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా పాస్‌పోర్టు సేవలను అందిస్తూ వచ్చింది. అయితే, కొత్తగా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి కేంద్రం శుభవార్త తెలిపింది. ఇండియా పోస్ట్ ఇప్పుడు భారతదేశంలోని వివిధ తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయాన్ని అందిస్తోంది. ఇక నుంచి పాస్‌పోర్టు దరఖాస్తు కోసం మీ దగ్గరలోని పోస్టాఫీసు కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్ సీ) కౌంటర్లను సందర్శించాల్సి ఉంటుంది అని పేర్కొంది. పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయం గురించి ఇండియా పోస్ట్ ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. "ఇప్పుడు మీ సమీప పోస్టాఫీసు సీఎస్ఎస్ కౌంటర్ వద్ద పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకోవడం సులభం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సమీప పోస్టాఫీసును సందర్శించండి" అని ట్వీట్ లో పేర్కొంది. పాస్‌పోర్టు కోసం ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకున్న, దరఖాస్తు చేసిన పాస్‌పోర్టు దరఖాస్తుదారులు ఇప్పుడు దరఖాస్తు ప్రింట్ రసీదు, ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు సేవా కేంద్రం లేదా పాస్‌పోర్టు సౌకర్యం గల సమీప పోస్టాఫీసుకు వెళ్ళవచ్చు. Now it’s easy to register and apply for a passport at your nearest post office CSC counter. To know more, visit the nearest post office. #AapkaDostIndiaPost — India Post (@IndiaPostOffice) July 24, 2021 ఇటీవలే ఇండియా పోస్ట్ పెన్షనర్లు, ఇతర సీనియర్ సిటిజన్లకు అందించే లైఫ్ సర్టిఫికేట్ సేవలను కూడా ప్రవేశపెట్టింది. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాల్లో ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను కూడా ప్రారంభించింది. ఇంకా, ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం డోర్ స్టెప్ సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది. -
పన్ను చెల్లింపుదారులకు పోస్ట్ ఆఫీస్ గుడ్‌న్యూస్!
దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులకు పోస్ట్ ఆఫీస్ శుభవార్త తెలిపింది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి వేతన తరగతి ప్రజలు ఇకపై చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు సమీపంలోని పోస్టాఫీసు కామన్ సర్వీసెస్ సెంటర్స్(సీఎస్ సీ) కౌంటర్ లో ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను పొందవచ్చు అని ఇండియా పోస్ట్ తెలిపింది. "ఇప్పుడు మీ ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయడానికి చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. మీరు మీ సమీప పోస్టాఫీసు సీఎస్ సీ కౌంటర్ వద్ద ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను సులభంగా పొందవచ్చు#AapkaDostIndiaPost" అని ఇండియా పోస్ట్ ట్వీట్ చేసింది. పోస్ట్ ఆఫీస్ సీఎస్ సీ కౌంటర్ వద్ద ప్రజలు పోస్టల్, బ్యాంకింగ్, బీమా సేవలతో పాటు ఇతర ప్రభుత్వ సమాచారం యాక్సెస్ చేసుకోవచ్చు అని డిజిటల్ ఇండియా వెబ్ సైట్ తెలిపింది. ప్రభుత్వం అందించే అన్ని ఈ-సేవలను, పౌరులు వారి స్థానిక తపాలా కార్యాలయాలలో పొందవచ్చు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద అందించే సేవలను వేగంగా స్వీకరించడానికి, పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడుతుంది అని డిజిటల్ ఇండియా వెబ్ సైట్ పేర్కొంది. ఇంతకు ముందు జూన్ 7న ఆదాయపు పన్ను శాఖ తన కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.inను ప్రారంభించింది. अब आयकर रिटर्न जमा करने के लिए दूर जाने की ज़रूरत नहीं है। आप अपने नज़दीकी डाकघर के सीएससी काउंटर पर आसानी से आयकर रिटर्न सेवाओं का लाभ उठा सकते हैं।#AapkaDostIndiaPost pic.twitter.com/afb1sc7GNs — India Post (@IndiaPostOffice) July 14, 2021 -
ప్రతి నెల రూ.55 పొదుపుతో.. నెల నెల రూ.3000 పెన్షన్
భవిష్యత్‌లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఎందులో పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. అసంఘటిత రంగంలోని 10 కోట్ల పెద ప్రజల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు కనుక ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. ఈ పెన్షన్ స్కీమ్ పేరు ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన. ఇందులో చేరాలంటే నెల ఆదాయ రూ.15 వేలు మించకూడదు. అలాగే, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈసీఐఎస్, ఈపీఎఫ్ ఓ వంటి వాటిలో మీ పేరు ఉండకూడదు. 18 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్న నెలకు రూ.15,000 కంటే తక్కువ ఆధాయం సంపాదించే కార్మికుడు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఈ పథకం ఎంచుకున్న వాళ్లు వారి వయస్సును(18 నుంచి 40) బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య ప్రతి నెల 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంతే మొత్తం ప్రభుత్వం తరఫున జమ అవుతుంది. ఇక మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి నెల రూ.3,000లను పెన్షన్ రూపంలో పొందవచ్చు. ఒకవేల పొదుపు పథకంలో చేరిన 10 ఏళ్ల కంటే ముందే నిష్క్రమిస్తే, చందాదారుడు జమ చేసిన మొత్తానికి వడ్డీతో కలిపి బ్యాంకులో కలిపి వేస్తారు. పదేళ్ల తర్వాత, 60 ఏళ్లకు ముందే స్కీమ్ నుంచి వైదొలిగితే ఫండ్ ద్వారా సంపాదించిన వడ్డీ లేదా పొదుపు బ్యాంకు వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే అది ఖాతాలో లబ్ధిదారుడి వాటాతో జమాచేస్తారు. పేరు నమోదు చేసుకోవడం ఎలా..? అర్హత ఉన్న చందాదారులు కామన్ సర్వీస్ సెంటర్స్(సీఎస్సీ)లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ సెంటర్ల జాబితా ఎల్ఐసీ ఇండియా శాఖల్లో లభిస్తాయి. ఈ పెన్షన్ పథకంలో చేరేందుకు పొదుపు బ్యాంకు ఖాతా/ జన్ ధన్ ఖాతా, ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. దేశవ్యాప్తంగా 3.13 లక్షల సీఎస్సీ సెంటర్లలో నమోదు చేసుకునే సదుపాయం ఉంది. చదవండి: ఫోన్ బ్యాటరీ లైఫ్‌లో సమస్యలా? ఈ 5 చిట్కాలు ఫాలో అవండి -
125 కోట్ల మందికి ఆధార్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 125 కోట్ల మంది ప్రజలకు ఆధార్ ఉన్నట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఉపయోగించడం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. నిత్యం 3 కోట్ల పైచిలుకు ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ అభ్యర్థనలు నమోదవుతున్నాయని తెలిపింది. అలాగే ఆధార్ వివరాల అప్డేట్ అభ్యర్థనలు కూడా రోజుకు 3–4 లక్షల మేర వస్తున్నాయని వివరించింది. సీఎస్సీల్లో మళ్లీ ఆధార్ ఎన్రోల్మెంట్.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలో భాగమైన సీఎస్సీ ఈ–గవర్నెన్స్ సర్వీసెస్ సంస్థ మళ్లీ ఆధార్ రిజి స్ట్రేషన్, సంబంధిత సర్వీసులను ప్రారంభించింది. వచ్చే వారం దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తేనుంది. ఆధార్ ఎన్రోల్మెంట్, మార్పులు.. చేర్పులు వంటి సేవలు అందించేందుకు .. యూఐడీఏఐతో సీఎస్సీ ఎస్పీవీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.6 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ).. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఆన్లైన్ ప్రభుత్వ సర్వీసులను అందిస్తున్నాయి. డేటా లీకేజీ, నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని సీఎస్సీ ఆధార్ ఎన్రోల్మెంట్ సేవలు రెండేళ్ల క్రితం నిల్చిపోయాయి. -
మారుమూల గ్రామాల్లో గ్యాస్ ఏజెన్సీలు
న్యూఢిల్లీ: ఇకపై మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వంట గ్యాస్ ఏజెన్సీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు, అధీకృత ఉమ్మడి సేవా కేంద్రాల(సీఎస్సీ)మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సంస్థలు సీఎస్‌సీలతో అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్సీ ఫ్రాంచైజీలుగా ఏర్పాటయ్యే గ్యాస్ ఏజెన్సీలు.. కొత్తగా బుక్ చేసే ప్రతి గ్యాస్ కనెక్షన్‌పై రూ.20, ప్రతి రీ ఫిల్లింగ్ సిలిండర్‌పై రూ.2, సీఎస్సీకి సిలిండర్ చేరవేస్తే రూ.10, వినియోగదారుకు సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే రూ.19.5 చొప్పున అందుకుంటాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్లు 25 కోట్లకు చేరుకోనుండగా అందులో ఉజ్వల కనెక్షన్లు 5.75 కోట్ల వరకు పెరగనున్నందున ఇందుకు సంబంధించి ఏర్పాట్లను విస్తృతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రులు అన్నారు. తాజా ఒప్పందంతో లక్ష వరకు మినీ గ్యాస్ ఏజెన్సీల సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ముందుగా ఈ సదుపాయాన్ని ఒడిశాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడతామనీ, వచ్చే ఒకటీ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని వివరించారు. దేశంలో 3.1 లక్షల సీఎస్‌సీలుండగా ప్రస్తుతానికి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లక్ష కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. సీఎస్సీ ఈ–గవర్నెన్స్ సీఈవో దినేశ్ త్యాగి మాట్లాడుతూ..తాజా ఒప్పందంతో గ్రామీణ ఏజెన్సీల ఆదాయంతోపాటు సీఎస్సీల పట్ల విశ్వసనీయత పెరుగుతుందన్నారు. -
20న రైతులతో మాట్లాడతా..
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలోని సమస్యలపై చర్చించేందుకు ఈనెల 20న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో మాట్లాడనున్నారు. వివిధ సేవలను డిజిటల్ రూపంలో అందించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాటైన మూడు లక్షల ఉమ్మడి సేవా కేంద్రాల (సీఎస్సీ) ద్వారా రైతులు మోదీతో మాట్లాడవచ్చు. గత కొద్దికాలంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తుండటం తెలిసిందే. శుక్రవారం డిజిటల్ ఇండియా పథకం లబ్ధిదారులతో మాట్లాడుతూ ‘20న ఉదయం 9.30 గంటలకు నేను రైతులతో ముచ్చటిస్తాను. నాతో మాట్లాడే అవకాశాన్ని రైతులకు మీరు (సీఎస్సీ ఏజెంట్లు) ఇవ్వాలి’ అని అన్నారు. రేపు నీతి ఆయోగ్ సమావేశం మోదీ అధ్యక్షతన ఆదివారం రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ పరిపాలక మండలి నాలుగో సమావేశం జరగనుంది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్, జాతీయ పోషకాహార పథకం తదితర ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, సీనియర్ అధికారులు హాజరవుతారు. ‘న్యూ ఇండియా 2022’ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన పనులపై కూడా మండలి సమావేశంలో చర్చిస్తారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలకు మోదీ విందు.. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లోని కీలక నేతలకు మోదీ శుక్రవారం రాత్రి తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా అనేక మంది ఈ విందుకు హాజరయ్యారు. కాగా దేశంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, భవిష్యత్తు వ్యూహాలు, ఇతర కాషాయ సంస్థలతో ఆరెస్సెస్, బీజేపీల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం తదితరాలపై చర్చించేందుకు సూరజ్‌కుండ్‌లో మూడు రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో బీజేపీ, ఆరెస్సెస్‌లకు చెందిన 60 మంది ఉన్నతస్థాయి నేతలు పాల్గొన్నారు. గురువారం ఇవి ప్రారంభం కాగా, అమిత్ షా శనివారం ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. కశ్మీర్‌పై మోదీ ఉన్నతస్థాయి భేటీ జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిపై మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. హోం మంత్రి రాజ్‌నాథ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. రంజాన్ మాసంలో మిలిటరీ ఆపరేషన్లను ఆపివేయగా, శుక్రవారంతో ఆ గడువు పూర్తయింది. దీంతో ఆపరేషన్ల నిలిపివేత ఆదేశాలు పొడిగింపుపై సమావేశంలో చర్చించారు. -
సీఎస్సీ విలేజ్ లెవల్ సెంటర్ ప్రారంభం
సాక్షి, అల్గునూర్(మానకొండూర్) : ప్రభుత్వ, ప్రైవేటు సేవలను పౌరులకు అందించేందుకు ప్రభుత్వ అనుబంధంగా ఏర్పాటు చేసిన సిటిజన్ సర్వీస్ సెంట్ విలేజ్ లెవల్ కార్యాలయం తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లో ఏర్పాటయింది. రైతులకు అవసరమైన ఎరువులను ఈ సర్వీస్ సెంటర్ ద్వారా అందించేందుకు ఏర్పాటు చేసిన గోదామును కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటురంగ సేవలు ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్ ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు. దేశంలో ఇప్పటివరకు సీఎస్సీ ఆధ్వర్యంలో ఒకేఒక్క ఫర్టిలైజర్ గోదాముందని, రెండోది, రాష్ట్రంలో మొట్టమొదటి గోదాం అల్గునూర్‌లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సీఎస్సీ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సేవలన్నీ ఈ సెంటర్లో అందుబాటులో ఉంటాయని, హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ సేవలను కూడా ఇక్కడి నుంచి పొందొచ్చని తెలిపారు. రైతులకు కావాల్సిన ఎరువులన్నీ సీఎస్సీ కేంద్రంలో అందుబాటులో ఉంటాయ ని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా త్వరలో మరిన్ని సేవలు పౌరులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సీఎస్సీ హైదరాబాద్ ఇన్చార్జి మంజుల వీఎల్ఈ శానిటరీ నాప్కిన్ యూనిట్‌ను ప్రారంభించారు. సీఎస్సీ జిల్లా మేనేజర్ శ్రీరాం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర బ్యాధుడు శివకుమార్, సొసైటీ అధ్యక్షుడు రాజు, అల్గునూర్ సర్పంచ్ చిందం కిష్టయ్య, ఎంపీటీసీ స్వామిరెడ్డి, తహసీల్దార్ జగత్సింగ్, కంది రాంచంద్రారెడ్డి, చల్ల మహేందర్‌రెడ్డి, జాప శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
బ్యాంకింగ్ సేవలకు హెచ్‌సీఎల్, సీఎస్సీ జట్టు
న్యూఢిల్లీ : బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, సేవలు అందించే దిశగా ఐటీ దిగ్గజాలు సీఎస్సీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కలిసి జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశాయి. అయితే, ఇందులో ఎంత పెట్టుబడి పెడుతున్నది, ఏ సంస్థకు ఎంత వాటాలు ఉన్నది వెల్లడి కాలేదు. డేటా అనలిటిక్స్ సర్వీసులు మొదలైన వాటికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ క్లయింట్లకు అవసరమైన అత్యాధునిక సేవలు అందించడంపై ఈ జేవీ దృష్టి పెడుతుందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ అనంత్ గుప్తా తెలిపారు.