న్యూఢిల్లీ: రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌తో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల రేషన్ కార్డుకు సంబంధించిన సేవలు దేశవ్యాప్తంగా ఉన్న 3.70 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు మీరు మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) ద్వారా రేషన్ కార్డుకు సంబంధించిన అనేక సేవలను యాక్సెస్ చేసుకోవచ్చునని డిజిటల్ ఇండియా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
"డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌తో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న 3.70 లక్షల కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ భాగస్వామ్యం వల్ల దేశవ్యాప్తంగా 23.64 కోట్లకు పైగా రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని" కేంద్రం ట్విటర్ ఖాతా ద్వారా పేర్కొంది. ఈ భాగస్వామ్యం ఒప్పందం వల్ల దేశవ్యాప్తంగా 23.64 కోట్లకు పైగా రేషన్ కార్డు దారులు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా రేషన్ కార్డు సంబధించిన 6 రకాల సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు.(చదవండి: ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!)
.@CSCegov_, under the @GoI_MeitY has signed a MoU with the @fooddeptgoi to enable ration card services through 3.70 Lakh CSCs across the country. The partnership is expected to benefit over 23.64 crore ration card holders across the country. pic.twitter.com/OIbutQClC3
— Digital India (@_DigitalIndia) September 16, 2021
సీఎస్‌సీలలో అందుబాటులో ఉండే 6 రకాల రేషన్ కార్డు సేవలు
- రేషన్ కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.
- రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయవచ్చు.
- మీ రేషన్ కార్డు డూప్లికేట్ ప్రింట్ పొందవచ్చు.
- మీ రేషన్ లభ్యత గురించిన సమాచారం తెలుసుకోవచ్చు.
- రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను చేయవచ్చు.
- రేషన్ కార్డు పోయినట్లయితే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment