
దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులకు పోస్ట్ ఆఫీస్ శుభవార్త తెలిపింది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి వేతన తరగతి ప్రజలు ఇకపై చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు సమీపంలోని పోస్టాఫీసు కామన్ సర్వీసెస్ సెంటర్స్(సీఎస్ సీ) కౌంటర్ లో ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను పొందవచ్చు అని ఇండియా పోస్ట్ తెలిపింది. "ఇప్పుడు మీ ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయడానికి చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. మీరు మీ సమీప పోస్టాఫీసు సీఎస్ సీ కౌంటర్ వద్ద ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను సులభంగా పొందవచ్చు#AapkaDostIndiaPost" అని ఇండియా పోస్ట్ ట్వీట్ చేసింది.
పోస్ట్ ఆఫీస్ సీఎస్ సీ కౌంటర్ వద్ద ప్రజలు పోస్టల్, బ్యాంకింగ్, బీమా సేవలతో పాటు ఇతర ప్రభుత్వ సమాచారం యాక్సెస్ చేసుకోవచ్చు అని డిజిటల్ ఇండియా వెబ్ సైట్ తెలిపింది. ప్రభుత్వం అందించే అన్ని ఈ-సేవలను, పౌరులు వారి స్థానిక తపాలా కార్యాలయాలలో పొందవచ్చు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద అందించే సేవలను వేగంగా స్వీకరించడానికి, పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడుతుంది అని డిజిటల్ ఇండియా వెబ్ సైట్ పేర్కొంది. ఇంతకు ముందు జూన్ 7న ఆదాయపు పన్ను శాఖ తన కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.inను ప్రారంభించింది.
अब आयकर रिटर्न जमा करने के लिए दूर जाने की ज़रूरत नहीं है। आप अपने नज़दीकी डाकघर के सीएससी काउंटर पर आसानी से आयकर रिटर्न सेवाओं का लाभ उठा सकते हैं।#AapkaDostIndiaPost pic.twitter.com/afb1sc7GNs
— India Post (@IndiaPostOffice) July 14, 2021