గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
Published Sat, Oct 1 2016 8:35 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
సూర్యాపేట మున్సిపాలిటీ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్యనాయక్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదే డిమాండ్‌తో త్వరలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గిరిజనులు, ఉద్యోగ, విద్యార్థి, మహిళా నాయకులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేయడం, 12 శాతం రిజర్వేషన్, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రిజర్వేషన్లు..ప్రమోషన్లు తదితర హామీలను అమలు చేయడంలో జాప్యం చేయడం తగదన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట్యానాయక్, జిల్లా అధ్యక్షులు ధరావత్ భిక్షంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement