హామీల అమలులో ప్రభుత్వం విఫలం | Govt fail to the promises implementation | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Published Tue, Aug 2 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

ఆత్మకూర్‌(ఎస్‌) : హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిపెస్టోలో ఇచ్చిన ఒక్కహామీని నేటికీ నెరవేర్చలేక పోయిందన్నారు.  కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కిందిస్థాయికి తీసుకుపోవాలన్నారు. 2019లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో జరిగే మోదీ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి, జీడి భిక్షం,తోట ప్రభాకర్, మర్ల చంద్రారెడ్డి, సకినాల శ్రీనివాస్, వివిధ గ్రామాల అధ్యక్షకార్యదర్శులు,నాయకులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement