atmakur (s)
-
ఇద్దరిని బలిగొన్న.. వివాహేతర సంబంధం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): వివాహేతర సంబంధాన్ని వదులుకోలేక ఓ వివాహిత, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలో చోటుచేసుకుంది. తుమ్మలపెన్పహాడ్ గ్రామానికి చెందిన ఉప్పునూతల గంగరాజుకు పదేళ్ల క్రితం మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన లావణ్య(28)తో పెళ్లి జరిగింది. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, లావణ్యకు అదే గ్రామానికి చెందిన చింతపల్లి మహేశ్తో మూడేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి.. వారు మందలించడంతో మహేశ్, లావణ్య ఆదివారం తమ ఇళ్లను విడిచి వెళ్లపోయారు. లావణ్య భర్త ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఫోన్ లోకేషన్ ద్వారా గ్రామంలో కౌలు రైతు సోమిరెడ్డి మాధవరెడ్డి వ్యవ సాయ భూమి వద్ద మహేశ్ ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకోగా అప్పటికే ఇరువురూ మృతిచెంది ఉన్నారు. పక్కన పురుగుల మందు డబ్బాలు ఉండటంతో ఆత్యహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి.. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ఆత్మకూర్(ఎస్) : హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిపెస్టోలో ఇచ్చిన ఒక్కహామీని నేటికీ నెరవేర్చలేక పోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కిందిస్థాయికి తీసుకుపోవాలన్నారు. 2019లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో జరిగే మోదీ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి, జీడి భిక్షం,తోట ప్రభాకర్, మర్ల చంద్రారెడ్డి, సకినాల శ్రీనివాస్, వివిధ గ్రామాల అధ్యక్షకార్యదర్శులు,నాయకులు పాల్గొన్నారు.