‘పేట’ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని పునర్నిర్మించాలి
‘పేట’ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని పునర్నిర్మించాలి
Published Sun, Jul 17 2016 8:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని వెంటనే పునర్నిర్మించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 800 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఈ కళాశాలలో చదువుతున్నారని చెప్పారు. రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించి వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు. కళాశాలలో తాగునీటి సౌకర్యం, ప్రహరీ, మూత్రశాలలు కూడా సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమావేశంలో నాయకులు నామ నాగయ్య, గుండ్ల పురుషోత్తం, భాస్కర్, ఎల్క సైదులు, ఎ.శశిధర్, నాగరాజు, అనీస్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement