Junior College
-
ఇంటర్మీడియట్ లవ్ స్టోరీ.. ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటోన్న ట్రైలర్!
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ సూపర్బ్ అంటూ సినీ ప్రియులు, నెటిజన్స్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు. తమ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడం పట్ల మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రం ఈనెల 21న థియేటర్లలో సందడి చేయనుంది. -
కొత్తగా 119 బీసీ గురుకుల జూనియర్ కాలేజీలు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మరిన్ని గురుకుల జూనియర్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం మరో 119 బీసీ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయనుంది. ఇందు లో భాగంగా 119 గురుకుల పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయనుంది. దీంతో ఈ పాఠశాల ల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభు త్వం ఆమోదం తెలపడంతో కాలేజీల ఏర్పా టుకు మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్) అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. అద్దె భవనాల కోసం అన్వేషణ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ కేవ లం 21 గురుకుల విద్యా సంస్థలు మాత్ర మే ఉండేవి. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున రెండు విడతల్లో 238 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. క్షేత్రస్థాయిలో డిమాండ్ విప రీతంగా ఉండటంతో ఇటీవల జిల్లాకు ఒక గురుకులం చొప్పున మరో 33 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. గత నెలలో సొసైటీ అధికారులు ఈ పాఠశాల లను ప్రారంభించారు. వీటికి తోడుగా మరో 15 గురుకుల డిగ్రీ కాలేజీలను సైతం అందుబాటులోకి తెచ్చారు. విడతలవారీగా యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసిన పాఠ శా లలకు ప్రభుత్వం ఇంకా శాశ్వత భవనాలను నిర్మించకపోవడంతో అవన్నీ అద్దె భవనా ల్లోనే కొనసాగుతున్నాయి. కొత్త కాలేజీలు సైతం అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో జిల్లాల వారీగా డిమాండ్‌కు తగినట్లు భవనాలను గుర్తించేందుకు సంబంధిత జిల్లా సంక్షేమాధికారి, గురుకుల పాఠశాలల ప్రాంతీయ సమన్వ యకర్తలకు విద్యా సంస్థల సొసైటీ బాధ్య తలు అప్పగించింది. పాఠశాల స్థాయిలో గురుకుల భవనానికి 20 వేల చదరపు అడు గుల స్థలం అవసరం ఉండగా.. కాలేజీతో కలిపి 50 వేల చదరపు అడుగుల భవనం అవసరమని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు పెద్ద భవనాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మూతబడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ విద్యా సంస్థల భవనాలు ఖాళీగా ఉంటే వాటికి ప్రాధా న్యం ఇవ్వాలని సొసైటీ ఆదేశించడంతో అలాంటివాటిని గుర్తించాలని భావిస్తు న్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా భవనాలను గుర్తించి అగ్రిమెంట్లు చేసుకు నేందుకుగాను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో భవనాలను గుర్తించి నివేదికలు పంపేందుకు సొసైటీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. -
Vetapalem: బండ్ల బాపయ్య విద్యాసంస్థకు వందేళ్లు
వేటపాలెం (బాపట్ల జిల్లా): వేటపాలెం బండ్ల బాపయ్య విద్యాసంస్థ వందేళ్లు పూర్తిచేసుకుంది. ఈ బడిని 1921 నవంబర్ 4న బండ్ల బాపయ్య శెట్టి హిందూ మాధ్యమిక పాఠశాల పేరుతో నెలకొల్పారు. దీనికి ఐదెకరాల స్థలం కేటాయించి అందులో శాశ్వత భవనం నిర్మించారు. దీనికి అప్పట్లో ప్రభుత్వం రూ.12,457 గ్రాంటు కూడా మంజూరు చేసింది. అప్పటి నుంచి పాఠశాల దినదినాభివృద్ధి చెందింది. బడికి అనుబంధంగా 1946లో హైస్కూలు, 1961లో హయ్యర్ సెకండరీ స్కూల్, 1969లో జూనియర్ కళాశాల, 1981లో డిగ్రీ కళాశాల ఏర్పాటయ్యాయి. ఈ పాఠశాలలోని ఒక భాగంలో కొంత కాలం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులూ నిర్వహించారు. 400 మంది ఉపాధ్యాయులు ఇక్కడ శిక్షణ పొందారు. పూర్వం ఈ పాఠశాలను అందరూ ఇంగ్లిషు బడి అని పిలిచేవారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి ఎందరో విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. ఇక్కడ చదువుకున్న ఎందరో ఉన్నతస్థానాలు అధిరోహించారు. విదేశాల్లోనూ ఉన్నత స్థితికి చేరారు. చేయూతగా రాధాకృష్ణయ్య హాస్టల్ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజనం పథకం తరహాలో ఈ పాఠశాలలో స్వాతంత్య్రం రాక పూర్వం నుంచి విద్యార్థులకు భోజనం పెట్టేవారు. గొల్లపూడి రాధాకృష్ణయ్య ఈ విధానానికి నాంది పలికారు. 1933లో పాఠశాలకు అనుసంధానంగా ఉచిత భోజన హాస్టల్ ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ రాధాకృష్ణయ్య వారసుల ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతుండడం విశేషం. నవంబర్‌లో శతజయంత్యుత్సవాలు బండ్ల బాపయ్య విద్యా సంస్థ నెలకొల్పి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శత జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా జరపనున్నారు. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు, కాలేజీలో చదివి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులు పాల్గొననున్నారు. ఇంగ్లిష్ బాగా చెప్పేవారు నేను 1971–73లో వేటపాలెం బండ్ల బాపయ్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివాను. అప్పట్లోనే అధ్యాపకులు ఇంగ్లిషు బోధించారు. అందువల్ల నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఇంగ్లిష్‌లో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. గొల్లపూడి రాధాకృష్ణయ్య హాస్టల్లో మధ్యాహ్న భోజనం చేసేవాడిని. అది నా అదృష్టం. – డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు, గుండె శస్త్ర చికిత్స నిపుణుడు, స్టార్ హాస్పిటల్, హైదరాబాద్ ఉపాధ్యాయ వృత్తికి పునాది ఇక్కడే ఈ పాఠశాలలో ప్రవేశానికి ఎంట్రన్స్ నిర్వహించేవారు. 1940లో 4వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాశాను. పాసై బడిలో చేరాను. మా తల్లిదండ్రులు ఇంగ్లిష్ బడిలో చదువుతున్నానని గొప్పగా చెప్పుకునేవారు. ఈ విద్యా సంస్థల్లోనే విద్యనభ్యసించి, 37 ఏళ్లపాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. విద్యా సంస్థల్లో చదువుకున్న ఎందరో ఉన్నత పదవుల్లో ఉన్నారు. – లొల్లా శ్రీరాం మూర్తి, విశ్రాత ప్రధానోపాధ్యాయుడు -
ఇంటర్ సప్లిమెంటరీ.. మహేశ్ ఒక్కడు పరీక్ష రాస్తే.. 8 మంది పర్యవేక్షణ
వెల్దుర్తి (తూప్రాన్): ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రానికి ఒక్క విద్యార్థి హాజరైతే ఎనిమిది మంది సిబ్బంది పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ శ్రీ రాయరావు సరస్వతీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించారు. ద్వితీయ సంవత్సరం సివిక్స్ పరీక్షకు వర్షపల్లి మహేశ్ అనే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. మొత్తం ముగ్గురు విద్యార్థులు ఫెయిల్ కాగా.. ఒక్క విద్యార్థి ఫీజు చెల్లించి పరీక్ష రాశాడు. పర్యవేక్షణకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఎగ్జామినేషన్ ఇన్చార్జి, ఇన్విజిలేటర్, సహాయ ఇన్విజిలేటర్, జూనియర్ అసిస్టెంట్, ఏఎన్‌ఎంతోపాటు కాపలాగా ఒక కానిస్టేబుల్ విధులు నిర్వర్తించారు. పరీక్ష ముగిసిన అనంతరం పరీక్ష పత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
విద్యా ప్రమాణాలు పెంచుతున్నాం
కుత్బుల్లాపూర్/సుభాష్‌నగర్: ప్రభుత్వ రంగంలో గత 8 ఏళ్లుగా విద్యా ప్రమాణాలను పెంచుతూ వస్తున్నామని... పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. అంగన్వాడీ మొదలు యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్, బహుదూర్‌పల్లిలలో రూ. 2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన జూనియర్ కాలేజీని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో కలసి ప్రారంభించారు. వొకేషనల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల భేరిలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో ఇదే జూనియర్ కాలేజీ శిథిలావస్థలో ఉండేదని, ప్రస్తుతం కొత్త భవనం నిర్మించి వొకేషనల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గురుకుల విద్యార్థులు ఐఐటీలకు... ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలల్లో 5 లక్షల మంది విద్యార్థులకు రూ. 1.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాణ్యమైన విద్యతోపాటు ఇంట్లో కూడా అందని సకల సౌకర్యాలు అందిస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందించే నాణ్యమైన చదువుతో వెయ్యి మందికంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఐఐటీకి వెళ్లారని... ఇది ప్రభుత్వం చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. 400 గురుకుల పాఠశాలలను 1,052 గురుకులాలను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామని.. ఇది ఎంతో గర్వకారణమన్నారు. విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.18 వేల కోట్లు చెల్లించామని, విదేశాల్లో చదువుకోవాలనుకునే ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు అందిస్తున్నామని కేటీఆర్ వివరించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ చొప్పున 33 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని... అగ్రికల్చర్, లా కాలేజీలు, 79 డిగ్రీ కాలేజీలు, రెండు యూనివర్సిటీలను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వివేకానంద కోరిన మేరకు ఉర్దూ కాలేజీని మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబిత, మల్లారెడ్డి ప్రసంగించగా ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్, సురభి వాణీదేవి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది: ఏపీ జేఎంసీ
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 23కు ఏపీ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ మద్దతు పలికింది. తొమ్మిది సెక్షన్లతో పాటు సెక్షన్‌కు 40 మంది విద్యార్ధులకు మాత్రమే అనుమతి ఇవ్వడంపై ఏపీ జేఎంసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు గుండా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, తదితరులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామకృష్ణను కలిశారు. అనంతరం ఆన్లైన్ అడ్మిషన్లు కొనసాగించాలని వినతి చేశారు. ఈ సందర్భంగా గుండా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీఓ 23కు రాష్డ్ర వ్యాప్తంగా నాన్ కార్పోరేట్ జూనియర్ కళాశాలల తరపున మద్దతు పలుకుతున్నామన్నారు. జీఓ 23ను యధావిధిగా ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. చదవండి: ఆన్ లైన్‌తో ‘ప్రయివేట్’ అక్రమాలకు అడ్డుకట్ట ‘జీఓ నెంబర్ 23 అమలుచేయాలని హైకోర్టులో ఇంప్లీడ్ అవుతున్నాం. కొన్ని కార్పోరేట్ కళాశాలలు జీఓ23నుని అడ్డుకోవడానికి కుట్రలతో కోర్టుని ఆశ్రయించాయి. ఇంటర్ విద్యలో కార్పోరేట్ ఆధిపత్యం తొలగిపోవాలి. విద్యార్థుల తల్లితండ్రులు కార్పొరేట్ కళాశాలల మాయమాటలు నుంచి బయటపడాలి. జీ+3 జూనియర్ కళాశాలల భవనాలకి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కోసం 60 రోజుల సమయమివ్వడానికి కమిషనర్ ఒప్పుకున్నారు. ఇదే సమయంలో ఆయా కళాశాలలు అడ్మిషన్లు నిర్వహించుకోవడానికి ఇంటర్ మీడియట్ బోర్డు అనుమతిచ్చింది. ప్రస్తుతం ఇంటర్ ఫీజు 3119 రూపాయిలు మాత్రమే ఉంది. ఈ ఫీజుని సవరించాలని కోరాం. కనీసం 25 వేల నుంచి 40 వేల వరకు పెంచాలని కోరాం. ఆన్లైన్ అడ్మిషన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంటర్ విద్యలో సమూల మార్పులకి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది. అని పేర్కొన్నారు. చదవండి: అమరావతి ఉద్యమం కథ,స్క్రీన్‌ప్లే బాబుదే -
‘మైనారిటీ గురుకులాలకు జూనియర్ కాలేజీ హోదా’
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 71 మైనారిటీ గురుకుల విద్యాలయాలను జూనియర్ కళాశాలలుగా స్థాయి పెంచనున్నట్టు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శాసనసభలో బుధవారం షకీల్ అహ్మద్, విద్యాసాగరరావు, స్టీఫెన్సన్, గాదరి కిషోర్‌కుమార్, హరిప్రియ, సురేందర్, బాల్క సుమన్ తదితరులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా వివరాలు వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని తరహాలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకులాలను అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీటిల్లో ఒక్కో విద్యార్థిపై సగటున రూ.50,686 చొప్పున ఖర్చు చేస్తున్నామన్నారు. కొన్ని గురుకులాలు అద్దె భవనాల్లో ఉన్నా.. వసతులపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూస్తున్నామన్నారు. భవిష్యత్తులో వీలైనన్ని సొంత భవనాలు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. -
ఫీజు అడిగారని దౌర్జన్యకాండ
నెల్లూరురూరల్: తమకు కావాల్సిన వారి విద్యార్థిని ఫీజు చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చారనే కారణంతో ఆగ్రహంతో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కళాశాలపై దాడికి దిగారు. ప్రిన్సిపల్‌ను దుర్భాషలాడి కర్రలతో దాడి చేసి గాయపరిచిన ఘటన నెల్లూరు రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురం శ్రీచైతన్య బాలుర జూనియర్ కళాశాల వద్ద గురువారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చెందిన విద్యార్థి భవానీ ప్రశాంత్‌కుమార్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం(ఎంపీసీ గ్రూపు) చదువుతున్నాడు. ఇతడు కళాశాలకు రూ.39,800 ఫీజు బకాయి ఉన్నాడు. కళాశాల ప్రిన్సిపల్ పత్తిపాటి మల్లికార్జున్ ఫీజు విషయమై విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. అనంతరం విద్యార్థి తండ్రి నెల్లూరులోని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడుకు విషయం చెప్పడంతో అతను తాను చూసుకుంటానని విద్యార్థి తండ్రికి హామీ ఇచ్చాడు. తర్వాత తిరుమలనాయుడు కళాశాల ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి తాను చెప్పిన సదరు విద్యార్థి చెల్లించాల్సిన ఫీజు విషయం మరచిపోవాలని చెప్పాడు. మరలా ప్రశాంత్‌కుమార్‌ను ప్రిన్సిపల్ యథావిధిగా ఫీజు చెల్లించాలని కోరడంతో విద్యార్థి తండ్రి మళ్లీ తిరుమలనాయుడుకు సమాచారం అందించాడు. దీంతో తిరుమలనాయుడు గురువారం సాయంత్రం కళాశాల ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి ‘‘నేను ఫీజు అడగవద్దంటే ఎందుకు అడిగావు.. నీ సంగతి తేలుస్తా.. అక్కడే ఉండు.. వస్తున్నా’’ అంటూ నానా దుర్భాషలాడాడు. కాసేపట్లో తిరుమలనాయుడుతోపాటు టీఎన్ ఎస్ ఎఫ్ నాయకులైన కిషోర్, అమృల్లా కూడా కళాశాల వద్దకు చేరుకున్నారు. కళాశాల ఆవరణలో హల్చల్ చేస్తూ ప్రిన్సిపల్ వద్దకు వెళ్లారు. ‘‘మేమంటే నీకు లెక్కలేకుండా పోయిందా.. మా సంగతి నీకు తెలియదు.. చంపేస్తాం’’ అంటూ వీరంగం సృష్టించి దౌర్జన్యానికి దిగారు. దౌర్జన్యాన్ని ప్రతిఘటించబోయిన ప్రిన్సిపల్‌పై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రిన్సిపల్ కుడిచేతికి గాయమైంది. అనంతరం బాధిత ప్రిన్సిపల్ ఈ విషయాన్నంతా విజయవాడలోని శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో శుక్రవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. దాడికి పాల్పడిన టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడు, నాయకులు కిషోర్, అమృల్లాలపై కేసు నమోదు చేశారు. -
కలుషితాహారంతో 75 మందికి అస్వస్థత
గుంటూరు ఈస్ట్: గుంటూరు ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల స్టూడెంట్స్ మేనేజ్మెంట్ హాస్టల్లో కల్తీ ఆహారం తిని సోమవారం 75 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. హాస్టల్లో డిగ్రీ విద్యారి్థనులు 400 మంది, ఇంటర్ విద్యారి్థనులు 283 మంది ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం అన్నం, చికెన్ కూర తిన్నారు. రాత్రికి పదిమంది స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో జీజీహెచ్‌కు వెళ్లి ప్రాథమిక చికిత్స అనంతరం హాస్టల్‌కు వచ్చారు. ఉదయం అల్పాహారంగా ఊతప్పం తిన్న అనంతరం విద్యారి్థనులు వరుసగా అస్వస్థతకు గురికావడంతో జీజీహెచ్‌లో చేరి్పంచారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎస్.బాబులాల్ మాట్లాడుతూ ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, వైఎస్సార్సీపీ నేతలు చంద్రగిరి ఏసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి జీజీహెచ్‌లో విద్యారి్థనులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడారు. అనంతరం హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు. విద్యారి్థనులతో కలిసి భోజనం చేశారు. కాగా, అస్వస్థతకు గురైన విద్యారి్థనుల సంఖ్య పెరుగుతూ రాత్రికి 75కు చేరింది. దీంతో ఎమ్మెల్యే ముస్తఫా మళ్లీ జీజీహెచ్‌కు చేరుకుని సమీక్షించారు. అత్యవసర విభాగానికి ముందు వైపు ఉన్న హాల్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయించారు. రాత్రి జీజీహెచ్‌లోనే బసచేశారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. -
కుళ్లిన మాంసం.. పాడైపోయిన కూరలు
సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్, కొండాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ హాస్టల్లో గతవారం కలుషిత ఆహారం తిని 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విజయనగర్ కాలనీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆ మర్నాడే కలుషిత ఆహారం తిని 32 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 10 మంది విద్యార్థునులు ఆస్పత్రిలో చేరారు. సికింద్రాబాద్ వైఎంసీఏలో ఉపాధిహామీ కోర్సుల్లో శిక్షణ కోసం చేరిన నిరుద్యోగులు కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారు. నగరంలో ఇటీవల నగరంలో రోజూ ఏదో ఒక వసతిగృహంలో ఆహారం కలుషితమవుతూనే ఉంది. ఫుడ్కాంట్రాక్టర్ల కక్కుర్తి కారణంగా తరచూ పలువురు విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు ఆయా వసతి వసతిగృహాల్లో తనిఖీలు నిర్వహించి ఆహార నాణ్యతను పరిశీలించాల్సిన జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతి గృహాల ఏర్పాటుకు స్పష్టమైన విధివిధానాలు లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాలు లేని భవనాల్లో వీటిని ఏర్పాటు చేస్తుండటం, మార్కెట్లో తక్కువ ధరకు లభించే కూరలు, మాంసం, నూనెలు వినియోగిస్తుండటంతో ఆహారం కలుషితమై విద్యార్థులు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వసతి గృహాలపై నియంత్రణ ఏదీ? గ్రేటర్ పరిధిలో కార్పొరేట్ జూనియర్ కాలేజీలు, వాటికి చెందిన హాస్టళ్లు 500 పైగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు 100 వరకు ఉన్నాయి. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలకు అనుబంధంగా మరో 100 హాస్టళ్లు నడుస్తున్నాయి. వీటికితోడు వివిధ పోటీ పరీక్షల కోసం సన్నద్ధ మవుతున్న అనేక మంది నిరుద్యోగులు ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్, రామంతాపూర్, దిల్సుఖ్నగర్, అమీర్‌పేట్, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో లెక్కలేనన్ని హాస్టళ్లు ఉన్నాయి. చాలా మంది రద్దీ ప్రాంతాల్లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని, బోయ్స్, లేడీస్ హాస్టళ్లను ఓపెన్ చేస్తున్నారు. ఒక్కో గదిలో ఐదు నుంచి పది మందికి వసతి కల్పిస్తున్నారు. ఇక హోటళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ గల్లీలోకి చూసినా ఏదో ఒక హో టల్ కన్పిస్తుంది. రుచికరమైన నాణ్యమైన ఆహారంతో పాటు అహ్లాదకరమైన వాతావరణంలో వసతి కల్పిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి ఆయా వసతి గృహాల్లోని వంటగదుల నిర్వహణ అధ్వాన్నంగా ఉంటుంది. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే పుచ్చి, పాడైపోయిన కూరగాయలు, కుళ్లిన మాంసంతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తున్నారు. రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని కిచిడీ రూపంలో ఉదయం టిఫిన్‌గా పెడుతున్నారు. కూరలు, పప్పు, సాంబార్ సహా ఇతర వంటలను వేడిచేసి మళ్లీ వడ్డిస్తున్నారు. ఈ కలుషిత ఆహారం తినడంతో విద్యార్థులు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, జ్వరంతో తీవ్ర అవస్వస్థతకు గురై చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాలపై నియంత్రణ లేకపోవడం, అధికారులు వీటిని తనిఖీ చేయకపోవడం, ఎప్పటికప్పుడు ఆహారం నాణ్యతను పరిశీలించకపోవడం వల్ల నిర్వహకులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరోక్షంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. అనుకోని విపత్తు లు, అగ్ని ప్రమాదాలు జరిగితే..ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు లేవు. అంతేకాదు నగరంలోని వసతి గృహాల్లో 90 శాతం భవ నాలకు ఫైర్ సేఫ్టీ లేదంటే ఆశ్చర్యపోనవసరంలేదు. పని చేయని ‘మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్’.. కల్తీ ఆహార పదార్థాల భారి నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో ఐపీఎంలో మొబైల్ ఫుడ్ సేప్టీ ల్యాబ్‌ను ప్రారంభిం చింది. నారాయణగూడ పరిసర ప్రాంతాలు సహా కుత్బుల్లాపూర్‌లో పర్యటించి హోటళ్లలో ఆహార పదార్థాల నమూనాలు సేకరించి...పరీక్షల పేరుతో హడావుడి చేసింది. ఆ తర్వాత విస్మరించింది. ప్రస్తుతం ఈ వాహనం జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు ఐపీఎం అధికారులు చెబుతున్నారు. ఆహార పదార్థాల నమూనాలు సేకరించి నాణ్యతను పరీక్షించాల్సిన ఈ మొబైల్ ఫుడ్ సేప్టీ ల్యాబ్ వెహికిల్ ప్రస్తుతం కేవలం పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలకే పరిమితమైంది. కలుషిత ఆహారంతో ఆరోగ్యం దెబ్బతిని ఆస్పత్రుల్లో చేసిన బాధితుల్లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప...జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
అదరహో కేజీఠీవీ !
సాక్షి, శ్రీకాకుళం : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు (కేజీబీవీ) మంచి రోజులు రానున్నాయి. ప్రస్తుతం కేజీబీవీల్లో ప్రవేశాలకు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు ఇంటర్మీడియెట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో కేజీబీవీలను జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడేషన్ చేస్తున్నారు. మొత్తం 32 కేజీబీవీల్లో గత ఏడాది 2 అప్‌గ్రేడ్ కాగా, ఈ ఏడాది మరో 19 అప్‌గ్రేడ్ అవుతున్నాయి. దీంతో జిల్లాలో మొత్తం జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడ్ అయిన కేజీబీవీల సంఖ్య 21కు చేరుకుంది. వసతి సమస్య లేకుండా ఉంటే.. భవిష్యత్‌లో అన్ని కేజీబీవీల్లోను ఇంటర్మీడియెట్ కోర్సులు తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బాలికలకు విద్య చేరువ.. గ్రామీణ ప్రాంతాల్లోని నిస్సహాయ బాలికలకు విద్యను చేరువ చేసేందుకు 2004లో అప్పటి కేంద్రప్రభుత్వం కేజీబీవీలను తీసుకువచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ, వసతి, భోజనం కూడా కల్పించి వారిని తీర్చిదిద్దాలని భావించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు 32 కేజీబీవీలను కేటాయించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పరిమితం చేస్తూ.. క్లాసుకు గరిష్టంగా 40 మంది చొప్పున విద్యార్థినులతో నిర్వహించారు. తొలిరోజుల్లో భవనాలు లేక కొన్ని అద్దె భవనాల్లో నడిపించారు. మరికొన్నింటిని ఆయా ప్రాంతాల్లోని గురుకుల పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణను కొనసాగించారు. 2010 నుంచి ఆర్వీఎంలోకి.. కేజీబీవీ పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం జరిగిన తర్వా త 2010లో అప్పటి రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) పరిధికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కేజీబీవీల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఉత్తీర్ణత శాతంతోను రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో నిలుస్తూ వస్తున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా ప్రస్తుతం సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిర్వహణలో కేజీబీవీలు నడుస్తున్నాయి. జిల్లాలో 32 కేజీబీవీల్లో ప్రస్తుతం 6600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. జూనియర్ కళాశాలలుగా ఉన్నతి.. కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ విద్యను గతంలో ప్రవేశపెట్టారు. జిల్లాలో కేవలం కోటబొమ్మాళి, జి.సిగడాం కేజీబీ వీలను జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లాకు చెందిన గత మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకటరావులు చెరో కళాశాలను పంచుకున్నారు. కేజీబీవీల్లో నియామకాలు సైతం ఈ మాజీ మంత్రుల సిఫారసుల మేరకే జరిగాయన్న విమర్శలు లేకపోలేదు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రాష్ట్రవ్యాప్తంగా 140 కేజీబీవీలను జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జాబితాలో శ్రీకాకుళం జిల్లా నుంచి 19 కేజీబీవీలు ఉన్నాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు అప్‌గ్రేడ్ జరిగిన కేజీబీవీల సంఖ్య 21కు చేరింది. కొటబొమ్మాళి, గత ఏడాది అప్‌గ్రేడ్ అయిన జి.సిగడాంలలో ఎంపీసీ, బైపీపీ రెండేసి గ్రూపులను కేటాయింపు చేయగా.. ప్రస్తుతం కేటాయింపు చేసిన 19 కళాశాలలకు మాత్రం కేవలం ఒక గ్రూపును మాత్రమే మంజూరు చేసింది. ఆ ప్రాంతాల్లో ఆదరణ ఉన్న గ్రూపులకు అవకాశం కల్పించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, పలు ఒకేషనల్ కోర్సులను మంజూరుచేశారు. తరగతులు, వసతి ఇతర సదుపాయాలను ఉచితంగా కల్పిస్తూ.. కోర్సుకు గరిష్టంగా 40 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. దీంతో 19 కేజీబీవీ కళాశాలలకు 40 మంది చొప్పున 760 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. వీటిల్లో విద్యార్థుకు పాఠాలు బోధించేందుకు పార్ట్‌టైమ్ లెక్చరర్ల నియామకాలకు సైతం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితాల్లోనూ అగ్రస్థానమే.. కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులు సైతం ఉన్నతమైన ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2019 మే నెలలో వెలువడిన టెన్త్‌క్లాస్ ఫలితాల్లో 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులు 35 మంది ఉండటం గమనార్హం. రాష్ట్రంలో కేజీబీవీల్లో అత్యధికంగా 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించడంలో 38 మంది విద్యార్థినులతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. శ్రీకాకుళం 35 మందితో రెండోస్థానంలో నిలవడం విశేషం. గత ఐదేళ్లుగా జిల్లాలో కేజీబీవీలు టెన్త్‌లో సగటున 95 శాతానికిపైగా ఉత్తర్ణత సాధిస్తున్నాయి. -
జాగా.. ఎక్కడా..!
సాక్షి, నర్సాపూర్ : మండల కేంద్రమైన శివ్వంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలీచాలని ఉన్నత పాఠశాల భవనంలో ప్రస్తుతం కాలేజీ కొనసాగుతుండడంతో అందులో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఫీజు రాయితీ పథకాన్ని సైతం అమలు చేస్తున్నా మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థుల చేరిక పడిపోతుంది. 2008లో శివ్వంపేటకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది. ఎనిమిదేళ్లపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో కాలేజీ కొనసాగింది. ఆ భవనం సైతం శిథిలావస్థకు చేరడంతో భవనాన్ని ఖాళీచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి శివ్వంపేటలోని ఓ అద్దెభవనంలో కాలేజీ నిర్వహించారు. నెలవారి అద్దె చెల్లించకపోవడంతో ఆ భవనం సైతం ఖాళీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల భవనంలో.. ప్రస్తుతం కాలేజీని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగుతుంది. కేవలం నాలుగు గదులు మాత్రమే కేటాయించడంతో విద్యార్థులకు సరిపోని పరిస్థితి నెలకొంది. సరిపడా గదులు లేకపోవడంతో పాటు విద్యార్థుల ప్రాక్టికల్స్ చేసేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సొంత భవనం లేకపోవడంతోనే విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు వెనుకడుగు వేస్తున్నారు. శివ్వంపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు అనుకూలంగా కాలేజీ ఉన్నా సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులను కళాశాలలో బోధిస్తున్నారు. ద్వితీయ సంవత్సరంలో 55 మంది విద్యార్థులు ఉండగా మొదటి సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 27 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. స్థానికంగా వసతులు లేకపోవడంతో విద్యార్థులు తూప్రాన్, నర్సాపూర్ ప్రాంతాల్లోని ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మండలంలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2018–2019 విద్యా సంవత్సరానికి సంబంధించి 544 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయడం జరిగింది. శివ్వంపేట, చెండి, చిన్నగొట్టిముక్కల్ల, దొంతి గ్రామాలకు సంబంధించి ఇంటర్ చదివేందుకు శివ్వంపేట కాలేజీ అనుకూలంగా ఉంటుంది. ఆయా పాఠశాలల్లో 200 మంది విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ ఇప్పటి వరకు 30 మంది విద్యార్థులు మాత్రమే శివ్వంపేట ప్రభుత్వ కాలేజీలో పేర్లు నమోదు చేసుకున్నారు. స్థలం లేక వృథాగా నిధులు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంతభవనం నిర్మాణానికి 8 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం 40లక్షల నిధులు మంజూరు చేసింది. భవన నిర్మాణానికి సంబంధించి భూమి కేటాయింపు జరగకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. 6 సంవత్సరాల క్రితం మరోమారు నాబార్డు నుంచి ఆధునిక జూనియర్ కళాశాల భవననిర్మాణానికి 10కోట్లు మంజూరయ్యాయి. నిధులు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ భూమి కేటాయింపు చేపట్టకపోవడంతో ఆ నిధులు సైతం వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. భవన నిర్మాణానికి భూమిని కేటాయిస్తే అన్ని హంగులతో విద్యార్థులకు పూర్తి వసతులతో భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. భూమి కేటాయించకపోవడంతో కాలేజీ భవన నిర్మాణం కలగానే మిగిలిపోయింది. కాలేజీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని పలుమార్లు అప్పటి మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలేజీ భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు కోరుతున్నారు. -
ఇలా చేశావేంటమ్మా..!
సాక్షి, లక్కవరపుకోట (ప్రకాశం): ఎల్.కోట... ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సొంత మండలం. ఆ మండల విద్యార్థులనే ఆమె మోసం చేశారు. ప్రతీ ఎన్నికల సమయంలోనూ ఎల్.కోటకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయిస్తానని హామీ ఇస్తారు. అనంతరం వాటిని పక్కనపెడతారు. ఇది ఆమెకు షరామామూలే అయినా మండల విద్యార్థులకు చదువు కష్టాలు తప్పడం లేదు. ఏటా పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పొరుగుమండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి. వ్యయప్రయాసలు తప్పడంలేదు. ఆర్థిక స్థోమతలేని విద్యార్థులు పదోతరగతితోనే చదువుకు ఫుల్స్టాప్ పెడుతున్నారు. సొంత మండలంలో ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో ఆడపిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. అమ్మా... ఇంకా ఎన్నాళ్లిలా మోసం చేస్తావంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నా.. ఆమె నుంచి సమాధానం లేదు. లక్కవరపుకోట మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు కలగానే మిగిలింది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఇంటటర్ విద్య అందని ద్రాక్షగా మారింది. ఇంటర్మీడియట్ చదువుకోసం శృంగవరపుకోట, కొత్తవలస మండలాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. గతంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కొన్నిగదులు జూనియర్ కళాశాలకు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేశారు. కళాశాల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కృషిచేస్తానని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హామీ ఇచ్చారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాసిన 583 మంది విద్యార్థులకు ఇంటర్ విద్యాకష్టాలు తప్పడం లేదు. ఉత్తరాపల్లి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఒక్క పర్యాయం తప్ప మిగిలిన అన్ని పర్యాయాలు మాజీ మంత్రి దివంగత కోళ్ల అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. తరువాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో శృంగవరపుకోట నియోజకవర్గంగా మారింది. కోళ్ల అప్పలనాయుడు కోడలు కోళ్ల లలితకుమారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏళ్ల తరబడి అదే కుటుంబ పాలన సాగిస్తున్నా కళాశాల మంజూరుకు చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థిలోకం భగ్గుమంటోంది. గత ఎన్నికల్లో లక్కవరపుకోట మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని వాపోతున్నారు. పాలకులు మారితే తప్ప కళాశాల మంజూరు కాదని, విద్యార్థులకు ఇంటర్ విద్య అందుబాటులోకి రాదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మా త్రమే. మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో ఆర్థిక స్థోమత లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేటు కళాశాలలో చేరాను. నాలాగే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది మండలానికి చంద్రబాబు వచ్చి ప్రభుత్వ కళాశాల మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నేటికీ కార్యరూపం దాల్చలేదు. –పి.శ్రీను, ఇంటర్ ప్రథమ సంవత్సరం, లక్కవరపుకోట ఏం చేయాలో అర్థంకావడం లేదు మా కుటుంబం కొద్ది సంవత్సరాల కిందట బతుకు తెరువుకోసం ఎల్.కోట మండలం వచ్చాం. నేను ఈ ఏడాది స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి పరీక్షలు రాసాను. ఇంటర్ విద్యకు ప్రైవేట్ కళాశాలలో చేర్పించే స్థోమత మా తల్లిదండ్రులకు లేదు. నాకు మాత్రం డాక్టర్ చదవాలని ఉంది. ప్రభుత్వ కళాశాల ఉంటే మాలాంటి పేదావాళ్లు చదువుకునే అవకాశం ఉండేది. ప్రస్తుత ఏడాది ఏ కళాశాలలో చేరాలో తెలియడం లేదు. –మహంతి రాకేష్,సోంపురం జంక్షన్, లక్కవరపుకోట మండలం ప్రభుత్వ కళాశాల కావాలి నేను ఈ ఏడాది పదో∙తరగతి పరీక్షలు రాశాను. ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో ఇంటర్ ఎక్కడ జాయిన్ కావాలో తెలియడం లేదు. మా లాంటి విద్యార్థుల గోడు పాలకులకు పట్టడం లేదు. – ఆబోతు మణికంఠ, ఎల్.కోట కనికరం లేదు నేను స్థానిక కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాశాను. ఇంటర్మీడియట్ చదవాలంటే ఎస్.కోట, కొత్తవలసకు వెళ్లాలి. వ్యయప్రయాసలు తప్పవు. కళాశాలను ఏర్పాటు చేసి మాలాంటి పేద విద్యార్థులను ఆదుకోవాలి. – టి.దీపిక, గొల్జాం గ్రామం -
మంత్రి ఇలాఖా.. కాలేజీ ఇలాగా?
తాండూరు: అది మంత్రి ఇలాఖా. అక్కడ ఓ జూనియర్ కాలేజీ ఉంది. 1950లో ఏర్పాటైన ఆ కళాశాల దినదిన ప్రవర్థమానమై రెండు వేలకుపైగా విద్యార్థులతో కళకళలాడుతోంది. ఇక్కడ 25 మంది అధ్యాపకులు ఉన్నారు. వారిలో ఒక్కరే ప్రభుత్వ అధ్యాపకుడు. మిగతావారంతా కాంట్రాక్ట్ లెక్చరర్లే. బెంచీలు సరిపడా లేక చాలా మంది కింద కూర్చొనే పాఠాలు వింటున్నారు. ఇరుకు గదుల్లో విద్యార్థులు కిక్కిరిసిపోతున్నారు. ఇదీ రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోని జూనియర్ కళాశాల దుస్థితి. వికారాబాద్ జిల్లాలోని తాండూరు కాలేజీలో 2,200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో సెక్షన్లో 180 మంది విద్యార్థులున్నారు. వీరికి సరిపడా తరగతి గదులూ, బెంచీలూ లేవు. కింద కూర్చున్న వారికి బోర్డు కనిపించకపోవడంతో అధ్యాపకులు బోధించే పాఠాలు అర్థం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లవుతున్నా జూనియర్ కళాశాల విద్యకు గ్రహణం వీడలేదు. ప్రభుత్వ కళాశాలలను మరింత బలోపేతం చేశామని అధికారులు, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదు. గుణాత్మక విద్య అందడం లేదు. కాలేజీ దుస్థితిపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థుల వేదన.. అరణ్య రోదన
రాయవరం (మండపేట):గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో పొలాల్లో ఆ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. చిట్టడవిని తలపించే ఆ ప్రాంతంలో, నిత్యం భయపెడుతున్న విష సర్పాల మధ్య చదువుకోవడానికి విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాగే కళాశాల భవనం కూడా అధ్వానంగా మారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలి యని పరిస్థితి నెలకొంది. కళాశాలను గ్రామంలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళనలు కూడా చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రమైన రాయవరంలో 1983లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటైంది. ఉన్నత పాఠశాల ప్రాంగణంలోనే కళాశాల ఉండడంతో మొదట్లో షిప్టుల పద్ధతిలో నిర్వహించారు. అప్పట్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా ఉండేవి. 2001లో ప్రభుత్వం జూనియర్ కళాశాల భవనాన్ని మంజూరు చేయగా, గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో పంటపొలాల మధ్య నిర్మించారు. 2002లో ప్రారంభించిన కళాశాల భవనం రెండేళ్లకే నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. భవనం కిటికీల అద్దాలు వాటికవే ఊడి ఫ్లోరింగ్ దిగడం, శ్లాబు జాయింట్ల మద్య పగుళ్లు ఏర్పడి వర్షం వస్తే వర్షపు నీరంతా తరగతి గదులు, ఆఫీసు గదులలోనికి చేరుతుంది. ఫలితంగా తరగతుల నిర్వహణతో పాటు కార్యాలయ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. విష సర్పాల సంచారం పొలాల మధ్య కళాశాల ఉండడంతో నిత్యం విష సర్పాలు సంచరిస్తున్నాయి. తరగతులు జరుగుతున్న సమయంలో గదుల్లోకి పాములు, తేళ్లు రావడంతో చదువుపై దృష్టి కేంద్రీకరించలేక పోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. పలుమార్లు విషసర్పాలు, కీటకాలను తరగతి గదులలోనే చంపిన పరిస్థితిని తలచుకొని విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. గదుల్లో బీటలు వారిన గోడల్లో పాములు, తేళ్లు ఆవాసాలుగా మార్చుకున్నాయి. అధ్యాపకులు చాక్‌పీస్‌తో పాటు కర్రలను కూడా గదుల్లో ఉంచుకోవాల్సినదుస్థితి నెలకొంది. కళాశాల మార్పు కోసం నిరసనలు జూనియర్ కళాశాలను గ్రామంలోకి మార్చాలంటూ గతేడాది విద్యార్థులు నిరసనలు, మానవహారాలు చేపట్టారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని పలువురు వ్యక్తులు గ్రామాభివృద్ధి కమిటీగా ఏర్పడి, కళాశాలను ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే కళాశాలను గ్రామంలోని ఉన్నత పాఠశాలలోకి మార్చాలంటే ఆషామాషీ కాదు. ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో కృషి చేస్తేనే ఇది సాధ్యమవుతుందనే భావనను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. శిథిల భవనంలో విద్యార్థులు, అధ్యాపకులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో కళాశాల మార్పును చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇబ్బందులు వాస్తవమే కళాశాలలో ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవమే. విద్యార్థులు గతేడాది కళాశాల మార్పు కోరుతూ ఆందోళన చేపట్టారు. ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు వచ్చి కళాశాలను పరిశీలించారు. కళాశాల మార్పుకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది.– జీజీకే నూకరాజు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాయవరం. -
లెక్చరర్ తిట్టారని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఇంటర్ పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని సీవీ రామన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నదీమున్నీసాబేగం(18) లెక్చరర్ తిట్టారన్న కారణంతో ఇంటికెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరులోని ఎంఎస్ లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న సుధాకర్‌బాబు, నూర్జహన్బేగం దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. సుధాకర్‌బాబు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి కూతురు తహెరబాను, రెండో కూతురు నదీమున్నీసాబేగం, మూడో కూతురు హజ్‌మున్నీసా బేగం. వీరిలో తహెరబాను ఎంపీసీ, నదీమున్నీసాబేగం బైపీసీ సీవీ రామన్ జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం స్టడీ అవర్‌లో ఫిజిక్స్ టీచర్ సులోచన.. నదీమున్నీసాబేగంకు స్లిప్ టెస్టులో తక్కువ మార్కులు రావడంతో తోటి విద్యార్థుల ఎదుట తిట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇంటికి తీసుకెళ్లడానికి అక్క రావడంతో ఆమెతో కూడా నదీమున్నీసాకు చదువు రాదని చెప్పడంతో అవమానంగా భావించింది. ఇంటికి రాగానే చదువుకుంటానని చెప్పి గదిలోకి వెళ్లింది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అధ్యాపకురాలు తిట్టడంతోనే తమ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, కారణమైన ఆమెపై, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
అమానుషం..!
వైఎస్ఆర్ జిల్లా ,వైవీయూ: వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని రోజు మాదిరిగానే కళాశాలకు వెళ్లే ఆర్ట్స్ కళాశాల మీదుగా అంగడివీధిలోని ఇంటికి వెళుతోంది. అయితే కళాశాల ప్రధాన ద్వారం వద్ద కాచుకొని ఉన్న ఆకతాయి.. ఆ విద్యార్థినిని.. ఏయ్ పిల్లా... వస్తావా.. అనడంతో.. మూతి పళ్లు రాలుతాయి.. అని సమాధానం ఇవ్వడంతో ఏమన్నావే.. అంటూ ఆ విద్యార్థిని వద్దకు వచ్చి విచక్షణా రహితంగా కొట్టాడు. బాలికను ఇష్టానుసారంగా చేతులు, కాళ్లతో తన్నాడు. ఇంతలోనే ఆ విద్యార్థిని చదివే కళాశాలకు చెందిన విద్యార్థులు అటుగా రావడంతో నిందితుడు పరారయ్యాడు. దీంతో విద్యార్థిని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో వారంతా కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్ డా. ఎన్. సుబ్బనరసయ్యకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే పోలీసులకు సమాచారం అందడంతో వారు రంగప్రవేశం చేశారు. ఒన్‌టౌన్ సీఐ టి.వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో కళాశాలలోని సీసీ పుటేజీలను పరిశీలించారు. అయితే పుటేజీల్లో ప్రధాన ద్వారం వరకు కెమెరాలు లేకపోవడంతో వారికి ఎటువంటి ఆధారం లభించలేదు. తప్పని వేధింపులు.. ఆ విద్యార్థినితో పాటు అటుగా వెళ్లే మహిళలను కొందరు ఆకతాయిలు ప్రతిరోజూ ఏదో ఒక వంకతో కామెంట్ చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆకతాయిలను గుర్తుపట్టేందుకు కళాశాలలోని విద్యార్థుల ఫొటోలను చూపించగా.. తరచూ కామెంట్ చేసే ఇద్దరిని వారు గుర్తించారు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ వారిని పిలిపించి విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడి వివరాలు తెలిస్తే చెప్పాలని కోరారు. అమ్మాయిలపై కామెంట్ చేయడం సిగ్గుగా లేదా అంటూ చీవాట్లు పెట్టారు. అనంతరం వారిని వారి కుటుంబసభ్యుల సమక్షంలో పోలీసులకు అప్పగించారు. కాగా పట్టపగలే ఇలా విద్యార్థినిపై దాడి చేయడంతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాడి చేసిన ఆకతాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
‘జబర్దస్త్’ బృందం సభ్యుల సందడి
సిరికొండ(నిజామాబాద్ రూరల్): మండల కేంద్రంలోని కామధేను జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో జబర్దస్త్ బృందం సభ్యులు వినోద్(వినోదిని), జీవన్‌లు సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించని కామెడీ షోతో ఆహూతులను అలరింపజేసింది. విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు. వారి కామెడీకి, నృత్యాలకు విద్యార్థులు ఈలలు, చప్పట్లతో కేకలు పెట్టారు. వారితో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు ఎగబడ్డారు. అనంతరం వారు మాట్లాడుతూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ బాశెట్టి లింబాద్రి, ఎంపీడీవో చందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట రాజన్న, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బాజిరెడ్డి రమాకాంత్, రావుట్ల ఎంపీటీసీ సభ్యుడు ఎర్రన్న, సర్పంచ్‌లు సంజీవ్, రాజేశ్వర్, జాగృతి మండల కన్వీ నర్ కుందేళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యార్థుల నిర్బంధం
సాక్షి, పెందుర్తి: విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో అదో ప్రైవేటు జూనియర్ కళాశాల.. కళాశాల యాజమాన్యానికి, భవన యజమానికి ఆర్థిక వివాదాలు తలెత్తాయి. దీంతో విద్యార్థులు తాము చదువుకున్న తరగతి గదిలోనే బందీలుగా ఉండాల్సి వచ్చింది. బాధిత విద్యార్థులు, కళాశాల యాజమాన్యం కథనం ప్రకారం.. స్థానికంగా ఉన్న ఎల్ఐసీ భవనం సమీపంలో ఓ భవంతిలో రెండు అంతస్తుల్లో జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులుగా కళాశాల యాజమాన్యం, భవన యజమాని కె.శ్రీనివాసరావు మధ్య వివాదం నడుస్తోంది. బుధవారం ఉదయం ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భవన యజమాని అనుచరులు విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపేశారు. కొంతమంది విద్యార్థులను గదుల్లో ఉంచి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు ఏమి జరిగిందో తెలియక భయాందోళనకు గురయ్యారు. కొన్ని గంటలపాటు విద్యార్థులు బందీలుగా ఉండిపోయారు. చివరకు తోటి విద్యార్థులు తాళాలు పగలకొట్టి వారిని రక్షించారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు తాము విద్యార్థులను బంధించలేదని, కళాశాల యాజమాన్యమే తాము తాళాలు వేసిన తర్వాత అడ్డదారిలో గదుల్లోకి పంపిందని భవన యజమాని చెబుతున్నారు. తీవ్ర ఆందోళనకు గురయ్యాం ఉదయం యధావిధిగా కళాశాలకు వచ్చాం. తరగతి గదిలో పాఠాలు వింటున్న సమయంలో కొందరు వ్యక్తులు ప్రాంగణంలోకి వచ్చారు. మా పక్క గదిలో ఉన్నవారిని బయటకు పంపారు. మమ్మల్ని మాత్రం లోపల ఉంచి గదికి తాళం వేశారు. ఏం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యాం. –సిహెచ్ జయకిషోర్, బాధిత విద్యార్థి అద్దె సక్రమంగా చెల్లిస్తున్నాం మేం భవనం అద్దెకు తీసుకున్నప్పుడే అగ్రిమెంట్ రాసుకున్నాం. అద్దె కూడా గత నెల వరకు పూర్తిగా చెల్లించాం. భవన యజమాని దురుద్దేశంతో మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. దానికి మేం నిరాకరించడంతో విద్యార్థులను బంధించారు. వారికి ఏదైనా ఆపద తలెత్తితే బాధ్యత ఎవరిది? – పి.సురేశ్, కళాశాల ప్రిన్సిపాల్ -
ఇంటర్ విద్యార్థుల ‘ఉపకార’ యాతన
► ఈ–పాస్ వెబ్సైట్లో కనిపించని జూనియర్ కాలేజీల వివరాలు ► ప్రవేశాల ప్రక్రియ ముగిశాకే లింకు ఇస్తామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తుకు చిక్కులు తప్పడం లేదు. ఈ ఏడాది ముందస్తుగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించినప్పటికీ సాంకేతిక సమస్యలు విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2017–18 విద్యాసంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ జూన్ 20న ప్రారంభం కాగా.. ఈ నెల 30తో గడువు ముగియనుంది. అయితే ఇప్పటివరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఒక్కరు కూడా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించలేదు. వెబ్సైట్లో సమాచార లోపంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో దరఖాస్తులకు తుది గడువు సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ఈ–పాస్‌తో అనుసంధానం చేయకపోవడంతో.. ఈ–పాస్ వెబ్సైట్లో కాలేజీల సమాచారాన్ని సంబంధిత బోర్డులు/యూనివర్సిటీలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జూనియర్ కాలేజీల సమాచారాన్ని ఈ–పాస్ వెబ్సైట్లో ఇంటర్మీడియెట్ బోర్డు నమోదు చేయాలి. ఇందుకు బోర్డు వెబ్‌సైట్‌ను ఈ– పాస్‌తో అనుసంధానం చేయాలి. ప్రస్తుతం కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతుండటంతో ఈ– పాస్ వెబ్‌సైట్‌తో ఇంటర్మీడియెట్ వెబ్‌సైట్‌ను అధికారులు అనుసంధానం చేయలేదు. దీంతో ఉపకారవేతనాల దరఖాస్తులో బీఐఈ(బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్) ఆప్షన్ కనిపించడం లేదు. కాలేజీల సమాచారం లేకపోవడంతో ఆయా విద్యార్థులు దరఖాస్తును సమర్పించలేక పోతున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యా ర్థులు సంక్షేమ శాఖలకు ఫిర్యాదు చేశారు. ప్రవే శాల ప్రక్రియ ముగియగానే, వచ్చే వారంలో బోర్డు లింకును అనుసంధానం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
సమస్యల చదువులు మాకొద్దు
► రోడ్డెక్కిన జూనియర్ కళాశాల విద్యార్థులు పాపన్నపేట(మెదక్) ఇరుకైన గదులు..చాలీచాలని ఫర్నిచర్.. మనిషి పట్టని టాయిలెట్లతో వేగేదెలా అంటూ పాపన్నపేట జూనియర్ కళాశాల విద్యార్థులు మెదక్ బొడ్మట్‌పల్లి రోడ్డుపై శనివారం రాస్తారోకోకు దిగారు. అర్ధగంట పాటు సాగిన ఆందోళనతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోగా పోలీసుల రంగప్రవేశంతో ఆందోళన సద్దుమణిగింది. వివరాల్లోకి వెళ్తే..పాపన్నపేట జూనియర్ కళాశాలలో 450 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే చదువుకోవడానికి మాత్రం నాలుగు గదులే ఉండటంతో ఒక్కోగదిలో100 మందికి పైగా కూర్చోవాల్సి వస్తుంది.పైగా అదే గదిలో ల్యాబ్ అలమారాలు ఉన్నాయి.దీంతో విద్యార్థుల బాధలు అలవి కాకుండా పోయాయి. కిక్కిరిసిన గదిలో అమ్మాయిలు,అబ్బాయిలు కూర్చోవడం కష్టతరంగా మారింది. ఇదే క్రమంలో గత మూడు రోజుల క్రితం తరగతి గదిలోని అలమారాల కిందికు పాము వచ్చింది. మరోవైపు ఇరుకైన టాయిలెట్లు వినియోగానికి అనుకూలంగా లేవు.రెండేళ్లు గడుస్తున్నా కొత్త బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో చదువులు ఎలా సాగుతాయంటు విద్యార్థులు మెదక్ బొడ్మట్‌పల్లి రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. సమస్యలు వెంటనే తీర్చాలంటు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి తరలి వచ్చి ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఓపెన్ లీక్ !
పరీక్షకు ముందే ప్రశ్నపత్రం బయటకు.. .కదిరి : కదిరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల ప్రశ్నపత్రం పరీక్ష ప్రారంభం కాకముందే స్టడీ సెంటర్ నిర్వాహకులకు లీకవుతోంది. సోమవారం జరిగిన పొలిటికల్ సైన్స్ ప్రశ్న పత్రంకు సంబంధించిన సమాధానాలన్నీ ఓ పేపర్లో పొందుపరచిన జిరాక్స్ కాపీలు ఆ పరీక్షా కేంద్రం ముందు అభ్యర్థులకు పంపిణీ చేయడం కన్పించింది. మీడియాతో పాటు పోలీసులు వారి వెంటబడితే వారి చేతిలో ఉన్న జిరాక్స్ కాపీలను అక్కడే పడేసి వారు పరారయ్యారు. పరీక్ష ప్రారంభంకాకనే అన్ని ప్రశ్నలకు సమాధానాలన్నీ ముందే సిద్ధం చేసి, వందలాదా కాపీలు జిరాక్స్ చేశారంటేæ కనీసం 2 గంటల ముందే వారికి ప్రశ్నపత్రం తెలిసిపోయి ఉంటుందని అంటున్నారు. దీనిపై పోలీసులు బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలోని నిర్వాహకులను ప్రశ్నిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయనీ, మరి ఎక్కడి నుండి లీక్ అయిందో కానీ తామైతే ఇంకా బండిల్ కూడా తెరవలేదని చెప్పినట్లు పోలీసులు తెలియజేశారు. అయినా తీరు మారలేదు కదిరిలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు చూచిరాతలను తలపిస్తున్నాయని ప్రతి రోజూ పత్రికల్లో వస్తున్నా, రోజూ విద్యార్థి సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నా పరీక్షల నిర్వహణలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. పరీక్షా కేంద్రం ప్రధాన గేట్లు మూసేసి, ఇన్విజిలేటర్లు, సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారుల పర్యవేక్షణలోనే మాస్ కాపీయింగ్ జరుగుతోందని పరీక్ష రాస్తున్న అభ్యర్థులే కొందరు బహిరంగంగా చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమని ఆరాతీస్తే స్టడీ సెంటర్ల నిర్వాహకులు ముందే పథకం ప్రకారం తమకు అనుకూలమైన ఇన్విజిలేటర్లను, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించుకున్నారని తెలిసింది. వారందరికీ పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పడంతో వారే స్వయంగా కాపీలను అందజేస్తున్నారని విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ తెలిపారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుండి రూ.10 వేల నుండి రూ.12 వేల దాకా వసూలు చేసినట్లు సమాచారం. -
అన్నం అడిగితే కర్రలతో బాదారు
గుంటూరు జిల్లాలోని ఓ జూనియర్ కాలేజీలో ఘటన 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు మేడికొండూరు(గుంటూరు): భోజనం పెట్టలేదని అడిగినందుకు కర్రలతో విచక్షణా రహితంగా విద్యార్థులను బాదారు. ఈ హృదయవిదారక ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండల పరిధిలోని పేరేచర్ల జంక్షన్‌లోని ఓ జూనియర్ కళాశాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పేరేచర్ల జంక్షన్‌లోని శ్రీలక్ష్మీ నరసింహా కాలనీలో ఓ అపార్ట్మెంట్లో ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీని నిర్వహిస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు హాస్టల్ వసతితో ఇక్కడ బోధన చేస్తున్నారు. బుధవారం రాత్రి భోజనం చేసేందుకు విద్యార్థులు వచ్చారు. వారికి తెచ్చిన భోజనం సరిపోకపోవడంతో హాస్టల్ ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసరావును విద్యార్థులు భోజనం పెట్టించమని అడిగారు. దీంతో ప్రిన్సిపాల్ విద్యార్థులపై విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాల యాజమాన్యానికి తెలియపరచగా కళాశాల కరస్పాండెంట్ బి.లక్ష్మణరావు, కొంతమంది లెక్చరర్లు అర్ధరాత్రి సమయంలో గుంటూరు నుంచి కార్లలో పేరేచర్లకు వచ్చి విద్యార్థులపై కర్రలతో దాడి చేశారు. సుమారు 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇతర విద్యార్థులు పరిస్థితిని స్థానికులకు చెప్పారు. వారు మేడికొండూరు పోలీసులకు తెలియజేశారు.ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు సత్తెనపల్లి – గుంటూరు ప్రధాన రహదారిపై నిరసనగా బైఠాయించారు. ఘటనా స్థలానికివ వచ్చిన గుంటూరు సౌత్ డీఎస్పీ బి.శ్రీనివాసరావు పరిస్థితిని చక్కదిద్దారు. విద్యార్థులను కొట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. -
జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
వచ్చే సంవత్సరం నుంచి అమలు రూ.200 కోట్లతో డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాలు ఉన్నత స్థాయి సమావేశంలో కడియం సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఏటా రూ. 84 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. విద్యా శాఖకు అవసరమైన బడ్జెట్, ప్రణాళికలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ వాణిప్రసాద్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, ఇంటర్ విద్య కార్యదర్శి అశోక్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలుకు అవసరమైన నిధులను కేటాయించాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రెగ్యులర్‌గా ఇచ్చే నిధులకంటే అదనంగా మరో రూ.1,500 కోట్లు కేటాయించాలని కడియం పేర్కొన్నారు. రాష్ట్రంలోని 404 జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులకు రూ.111 కోట్లు అవసరమన్నారు. బాలికలు చదువు కుంటున్న కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రస్తుతం కేజీబీవీ లకు ఉన్న భవనాలను హాస్టళ్లుగా వినియోగించేలా, కొత్తగా ఆరు తరగతి గదులతో అకడమిక్ బ్లాకులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇందుకు రూ. 300 కోట్లు కేటాయించాలని కోరారు. పాఠశాలల్లో మౌలిక వసతులకు రూ.100 కోట్లు, టాయిలెట్లు, నీటి వసతులకు రూ.100 కోట్లు చొప్పున అవసరమన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు పాఠశాలలను పటిష్టం చేసేందుకు అదనంగా రూ.600 కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. డిగ్రీ కాలే జీలు, పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాల కోసం రూ. 200 కోట్లను బడ్జెట్లో కేటాయించాలన్నారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి చర్యలు యూనివర్సిటీల్లో మౌలిక వసతులు కల్పిం చడంతోపాటు, ఖాళీ పోస్టుల భర్తీ, కొత్త పోస్టుల మంజూరుకు చర్యలు చేపడుతున్నామని కడియం తెలిపారు. ఇందుకోసం కనీసంగా రూ.500 కోట్లు కావాలన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయించా లన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లలో 20 స్కూళ్లను కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు రూ.26 కోట్లు అవసరం అవుతాయన్నారు. -
వివేక్ అజేయ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: లయోలా అకాడమీ జూనియర్ కాలేజ్ జట్టు బ్యాట్స్‌మన్ వివేక్ సింగ్ (92 బంతుల్లో 137 నాటౌట్; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో దయానంద్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా కీట్స్ జూనియర్ కాలేజ్‌తో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల తేడాతో ఆ జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లయోలా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 349 పరుగులు చేసింది. వివేక్ సింగ్ అజేయ సెంచరీతో చెలరేగగా... అభిషేక్ (82), వైష్ణవ్ రెడ్డి (49) వేగంగా ఆడారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కీట్స్ జూనియర్ కాలేజ్ 42.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. మన్నాస్ (101), ధీరజ్ విశాల్ (52) ఆకట్టుకున్నారు. లయోలా బౌలర్లలో ప్రతీక్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు జాన్సన్ గ్రామర్ స్కూల్: 147 (జాన్సన్ 71; తరుణ్ రాజ్ 3/19, సాత్విక్ 4/22), సెరుుంట్ పీటర్స్: 148/3 (కరణ్ 38, తరుణ్ రాజ్ 52 నాటౌట్). భవన్స కాలేజ్: 185/9 (అకీబ్ 59; సారుు పూర్ణానంద్ 3/34), గీతాంజలి స్కూల్: 186/3 (యశ్ 104 నాటౌట్, సారుు పూర్ణానంద్ 41). క్రీసెంట్ మోడల్ స్కూల్: 256/5 (రోహన్ 84, వివేక్ 79నాటౌట్), సెయింట్ మర్యాస్: 68 (రోహన్ 4/18).