సాక్షి, హైదరాబాద్: లయోలా అకాడమీ జూనియర్ కాలేజ్ జట్టు బ్యాట్స్‌మన్ వివేక్ సింగ్ (92 బంతుల్లో 137 నాటౌట్; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో దయానంద్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా కీట్స్ జూనియర్ కాలేజ్‌తో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల తేడాతో ఆ జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లయోలా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 349 పరుగులు చేసింది. వివేక్ సింగ్ అజేయ సెంచరీతో చెలరేగగా... అభిషేక్ (82), వైష్ణవ్ రెడ్డి (49) వేగంగా ఆడారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కీట్స్ జూనియర్ కాలేజ్ 42.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. మన్నాస్ (101), ధీరజ్ విశాల్ (52) ఆకట్టుకున్నారు. లయోలా బౌలర్లలో ప్రతీక్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
జాన్సన్ గ్రామర్ స్కూల్: 147 (జాన్సన్ 71; తరుణ్ రాజ్ 3/19, సాత్విక్ 4/22), సెరుుంట్ పీటర్స్: 148/3 (కరణ్ 38, తరుణ్ రాజ్ 52 నాటౌట్).
భవన్‌స కాలేజ్: 185/9 (అకీబ్ 59; సారుు పూర్ణానంద్ 3/34), గీతాంజలి స్కూల్: 186/3 (యశ్ 104 నాటౌట్, సారుు పూర్ణానంద్ 41).
క్రీసెంట్ మోడల్ స్కూల్: 256/5 (రోహన్ 84, వివేక్ 79నాటౌట్), సెయింట్ మర్యాస్: 68 (రోహన్ 4/18).
వివేక్ అజేయ సెంచరీ
Published Thu, Nov 3 2016 10:36 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
Advertisement
Advertisement