loyola academy
-
వివేక్ అజేయ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: లయోలా అకాడమీ జూనియర్ కాలేజ్ జట్టు బ్యాట్స్‌మన్ వివేక్ సింగ్ (92 బంతుల్లో 137 నాటౌట్; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో దయానంద్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా కీట్స్ జూనియర్ కాలేజ్‌తో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల తేడాతో ఆ జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లయోలా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 349 పరుగులు చేసింది. వివేక్ సింగ్ అజేయ సెంచరీతో చెలరేగగా... అభిషేక్ (82), వైష్ణవ్ రెడ్డి (49) వేగంగా ఆడారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కీట్స్ జూనియర్ కాలేజ్ 42.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. మన్నాస్ (101), ధీరజ్ విశాల్ (52) ఆకట్టుకున్నారు. లయోలా బౌలర్లలో ప్రతీక్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు జాన్సన్ గ్రామర్ స్కూల్: 147 (జాన్సన్ 71; తరుణ్ రాజ్ 3/19, సాత్విక్ 4/22), సెరుుంట్ పీటర్స్: 148/3 (కరణ్ 38, తరుణ్ రాజ్ 52 నాటౌట్). భవన్స కాలేజ్: 185/9 (అకీబ్ 59; సారుు పూర్ణానంద్ 3/34), గీతాంజలి స్కూల్: 186/3 (యశ్ 104 నాటౌట్, సారుు పూర్ణానంద్ 41). క్రీసెంట్ మోడల్ స్కూల్: 256/5 (రోహన్ 84, వివేక్ 79నాటౌట్), సెయింట్ మర్యాస్: 68 (రోహన్ 4/18). -
ఆట అదరగొట్టారు
‘సాక్షి’ ఎరీనావన్ స్పోర్ట్స్‌లో యువత సత్తా చాటుతున్నారు. బాస్కెట్‌బాల్, క్రికెట్ మ్యాచ్‌ల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ వైఎంసీఏలో జరిగిన బాస్కెట్‌బాల్ మహిళలు, పురుషుల విభాగం ఫైనల్స్‌లో లయోలా అకాడమీ, సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజీలు విజేతలుగా నిలిచాయి. కేశవగిరిలోని అరోరా సైంటిఫిక్ టెక్నాలాజికల్ అండ్ రీసెర్చ్ అకాడమీ, ఘట్కేసర్ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీల్లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. నువ్వా, నేనా అన్నట్టుగా జట్లు తలపడ్డాయి. - సాక్షి, సిటీబ్యూరో బాస్కెట్‌బాల్‌లో లయోలా అకాడమీ, సెయింట్ మార్టిన్స్ విజయం సికింద్రాబాద్ వైఎంసీఏలో జరిగిన బాస్కెట్‌బాల్ ఫైనల్స్ ఆసక్తికరంగా సాగాయి. మహిళల విభాగంలో వీజేఐఈటీ(31 పాయింట్ల)పై లయోలా అకాడమీ (38 పాయింట్లు) విజయం సాధించి ట్రోఫీని దక్కించుకుంది. మానస 14 పాయింట్లు, మౌనిక తొమ్మిది పాయింట్లు సాధించి లయోలా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. వీజేఐఈటీలో నందిని 22 పాయింట్లు, పి.మౌనిక తొమ్మిది పాయింట్లు చేసినా జట్టును గట్టెక్కించలేకపోయారు. పురుషుల మ్యాచ్‌లో సెయింట్ మార్టిన్స్ 32 పాయింట్లు చేసి గెలుపొందింది. లెండిల్ 12 పాయింట్లు, సంతోష్ రెడ్డి ఆరు పాయింట్లతో జట్టుకు విజయం అందించారు. వీబీఐటీ కేవలం 16 పాయింట్లు మాత్రమే చేసి ఓటమిపాలైంది. -
లయోలా అకాడమీ గెలుపు
జింఖానా, న్యూస్‌లైన్: బీఎఫ్ఐ ఐఎంజీ రిలయన్స్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో లయోలా అకాడమీ 53-37తో భవాన్స్ డిగ్రీ కాలేజిపై నెగ్గింది. సికింద్రాబాద్‌లోని వైఎంసీఏలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ప్రారంభం నుంచి హోరాహోరీగా త లపడ్డాయి. మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 25-22తో భవాన్స్ కాలేజి ముందంజలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో విజృంభించిన లయోలా అకాడమీ క్రీడాకారులు గణేశ్ (26), ఉదయ్ (11) ప్రత్యర్థిని ప్రతిఘటించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. చివరి నిమిషంలో ఆటగాళ్లు చాకచక్యంగా వ్యవహరించడంతో జట్టుకు విజయం చేకూరింది. భవాన్స్ ఆటగాళ్లు హేమంత్ (17), విష్ణు (8) రాణించారు. మరో మ్యాచ్‌లో ఏవీ కాలేజి 60-49తో సెయింట్ మార్టిన్స్ కాలేజిపై గెలిచింది. ఆట ప్రారంభం నుంచి ఏవీ కాలేజి క్రీడాకారులు దూకుడుగా ఆడారు. కొంత సేపటికి తేరుకున్న సెయింట్ మార్టిన్స్ ఆటగాళ్లు చెలరేగారు. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 29-27తో ఏవీ కాలేజి ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ రె ండో అర్ధ భాగంలోనూ ఏవీ కాలేజి ఆటగాళ్లు బాలాజీ (27), శాంసన్ (12), పవన్ (12) అదే జోరును కొనసాగించారు. అయితే మార్టిన్స్ జట్టు ఆటగాళ్లు జోనా (21), విశాల్ (14), సంతోష్ (9) చివరి వరకు శ్రమించినప్పటికీ విజయం దక్కలేదు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలుముఫకంజా: 39 (అలీం 12, అద్నాన్ 11, త్రిభువన్ 11); మల్లారెడ్డి: 29 (మానవ్ 10, చైతన్య 9). బిట్స్ పిలాని: 40 (ఇషాన్ 16, స్వర్ణిమ్ 12); అవంతి: 28 (జశ్వంత్ 14, కాకు 10). మహిళల విభాగం ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల: 36 (ప్రీతి 18, భవ్య 9, అమిత 9); సెయింట్ మార్టిన్స్: 25 (సుశ్మిత 9, దివ్య 9). కస్తూర్బా కాలేజి: 39 (కోమల్ 12, ప్రీతి 12, శ్వేత 9); గోకరాజు కాలేజి: 15 (సింధూష 11). సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి: 22 (శ్రేయ 10, ఆషేక 7); బిట్స్‌పిలాని: 10 (రక్షిక 4). సీవీఎస్ఆర్: 32 (ప్రత్యూష 11, శ్రేష్ఠ 8, స్పందన 8); సెయింట్ ఆన్స్: 20 (దివ్యా బాయి 12, కీర్తి 6). -
చాంప్ లయోలా అకాడమీ
ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి కార్ఫ్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను లయోలా అకాడమీ జట్టు కైవసం చేసుకుంది. ఎ.వి.కాలేజి జట్టుకు రెండో స్థానం లభించింది. అవంతి కాలేజి జట్టుకు మూడో స్థానం దక్కింది. ఓయూ గ్రౌండ్స్‌లో సోమవారం జరిగిన ఫైనల్లో లయోలా అకాడమీ జట్టు 19-6 స్కోరుతో ఎ.వి.కాలేజి జట్టుపై విజయం సాధించింది. లయోలా అకాడమీ జట్టులో శ్రీగణేష్ 12 పాయింట్లు చేయగా, పాషా 10 పాయింట్లను నమోదు చేశారు. ఎ.వి.కాలేజి జట్టులో సుధీర్ 4 పాయింట్లు చేశాడు. విజేతలకు ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ సెక్రటరీ ప్రొఫెసర్ ఎల్.లక్ష్మీకాంత్ రాథోడ్ ట్రోఫీలను అందజేశారు.